»   » అభిమానులకు నిరాశే... రోబో 2 లో ఒకటే ఉంటుందట

అభిమానులకు నిరాశే... రోబో 2 లో ఒకటే ఉంటుందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

శంకర్' దర్శకత్వంలో ఓ చిత్రం వస్తుందంటే ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. అత్యంత భారీ బడ్జెట్ తో 'శంకర్' సినిమాలు నిర్మిస్తుంటాడు. గతంలో ఆయన నిర్మించిన చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'రజనీకాంత్' 'ఐశ్వర్య రాయ్' కాంబినేషన్ లో 'రోబో' వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అనంతరం దీనికి సీక్వెల్ గా 'రోబో 2' సినిమాను 'శంకర్' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 350 కోట్లతో సినిమాను రూపొందిస్తున్నట్లు టాక్.

గతేడాది డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు 150 రోజులు షూటింగ్ పూర్తి చేశారు. ఇటీవలే క్లయిమాక్స్ చిత్రీకరించారు. మొత్తంగా 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ సీన్స్ చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిత్ర కథానాయకుడు 'రజనీకాంత్' కథానాయిక 'అమీ జాక్సన్'పై ఓ రోమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

Rajinikanth Robo 2 has only one song

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం వెల్లడైంది. ఈ సినిమాలో కేవలం ఒకే ఒక పాట ఉంటుందని చిత్రవర్గాలు వెల్లడించాయి.'ఈ సినిమాలో ఒకేఒక పాట ఉంది. చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. రజనీకాంత్, అమీ జాక్సన్ పై ఈ పాట తీశారు. ఉ్రక్రెయిన్ లోని ప్రముఖ ప్రాంతాల్లో ఈ గీతాన్ని చిత్రీకరించారు. సినిమాలో ఒకే పాట ఉన్నప్పటికీ ఆడియో ఆల్బంలో మాత్రం ఐదు లేదా ఆరు పాటలుంటాయ'ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఆదిల్ హుస్సేన్, సుధాంశు పాండే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 20న ముంబైలో ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.

English summary
Superstar Rajinikanth and director Shankar’s sequel project Robo 2 is in the news every time and latest reports said that the movie has the only song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu