»   » రోబో2 కథ లీక్.. సినిమాపై శంకర్ ట్వీట్

రోబో2 కథ లీక్.. సినిమాపై శంకర్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రోబో2 చిత్రానికి సంబంధించి ఓ పాట, కొంత ప్యాచ్ వర్క్ మినహా దాదాపు సినిమా పూర్తయిందని ప్రముఖ దర్శకుడు శంకర్ వెల్లడించారు. శంకర్ డైరెక్షన్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర కథను యూనిట్ సభ్యులు వెల్లడించారు.

లీకైన రోబో కథ ఇదే..

పక్షుల సహాయంతో ప్రపంచాన్ని సర్వనాశనం చేయాలని విలన్ అక్షయ్ కుమార్ పూనుకొంటాడు. అక్షయ్ దుష్ట ప్రయత్నాలను 2.0 సాంకేతికతతో వసీ, చిట్టి (రజనీ డ్యూయల్ రోల్) ద్వయం ఎలా ఎదుర్కొన్నారు అనేది కథ. ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తాయి. ఈ చిత్ర ప్రధాన కథ గ్లోబల్ థీమ్‌తో రూపొందుతున్నది.

పాట, ప్యాచ్ వర్క్ మినహా

పాట, ప్యాచ్ వర్క్ మినహా

ఇటీవల కీలక సన్నివేశాలను తెరకెక్కించిన తర్వాత చిత్ర యూనిట్‌తో ఉన్న ఫొటోను శంకర్ ట్వీట్ చేశారు. ప్రధాన సన్నివేశాన్ని పూర్తి చేసిన తర్వాత దిగిన ఫోటో ఇది. ఒక పాట, కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉన్నది అని శంకర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

పాట మినహా 90 శాతం పూర్తి

పాట మినహా 90 శాతం పూర్తి

‘ఈ చిత్ర షూటింగ్ 90 శాతం పూర్తయిది. అమీ జాక్సన్, రజనీకాంత్‌తో ఓ పాట షూట్ చేయాల్సి ఉంది. దాంతో షూటింగ్ పూర్తవుతుంది' అని యూనిట్ సభ్యులు తెలిపారు. దాదాపు రూ.400 కోట్లతో 2010లో వచ్చిన రోబో సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని శంకర్ తెరకెక్కిస్తున్నారు.

దీపావళికి రిలీజ్

దీపావళికి రిలీజ్

సుధాంశు పాండే, ఆదిల్ హుస్సేన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం దీపావళికి విడుదల కానున్నది.

English summary
Shankar has tweeted to inform that just a song and some patch work remains. The buzz around Rajinikanth’s next with Shankar, 2.o, is big. More so, because it stars Akshay Kumar as the antagonist.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu