For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Peddhanna Twitter Review: మూవీకి అస్సలు ఊహించని టాక్.. అదొక్కటి తప్ప అంతా తుస్సే.. అందరిలో అదే డౌట్

  |

  సుదీర్ఘ కాలంగా దక్షిణాదిలో హవాను చూపిస్తూ దేశమే గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఏజ్ బార్ అవుతోన్నా.. కుర్రాళ్లతో పోటీగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌తో కనిపిస్తుంటారు. ఆరు పదుల వయసులోనూ ఎంతో వేగంగా మూవీలను చేస్తోన్న ఆయన.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక, ఈ మధ్య కాలంలో రజినీకాంత్ సరైన హిట్ కోసం వేచి చూస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. అవన్నీ ఫ్యాన్స్‌ను కూడా అలరించలేకపోయాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ను అందుకోవాలని పట్టుదలతో ఉన్నారాయన. ఈ క్రమంలోనే ఇప్పుడు 'పెద్దన్న'గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

  ‘పెద్దన్న’గా వచ్చిన రజనీకాంత్

  ‘పెద్దన్న’గా వచ్చిన రజనీకాంత్

  శివ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం 'అన్నత్తే'. దీన్ని తెలుగులోకి 'పెద్దన్న' టైటిల్‌తో తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో నయనతార హీరోయిన్‌ కాగా.. మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఇమ్మాన్ ఈ సినిమాకు సంగీత సమకూర్చారు.

  బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ సరసాలు: ఏకంగా అతడి మీద పడుకుని.. వామ్మో ఇది మహా దారుణం!

  భారీ అంచనాలతో.. గ్రాండ్ రిలీజ్

  భారీ అంచనాలతో.. గ్రాండ్ రిలీజ్

  చాలా గ్యాప్ తర్వాత రజినీకాంత్ నటిస్తోన్న కుటుంబ కథా చిత్రం కావడంతో 'అన్నత్తే'పై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఇక, దీని నుంచి వచ్చిన పోస్టర్, పాటలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దీన్ని భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

  పెద్దన్న మూవీకి ఊహించని టాక్

  పెద్దన్న మూవీకి ఊహించని టాక్

  రజినీకాంత్ నటించిన 'అన్నత్తే' / 'పెద్దన్న' మూవీ ఎన్నో అంచనాలతో దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు కూడా పూర్తి చేసుకుంది. అలాగే, తమిళనాడులో స్పెషల్ షోలు కూడా పడిపోయాయి. ఇక, ప్రదర్శితం అయిన చోట్ల నుంచీ ఈ చిత్రానికి ఊహించని విధంగా నెగెటివ్ టాక్ వస్తోంది.

  షర్ట్ విప్పేసి బ్రా తీసేసి అషు రెడ్డి రచ్చ: హాట్ షోలో హద్దు దాటేసి.. మరీ ఇలా చూపిస్తారా!

  ఫస్టాఫ్ అలా... సెకెండాఫ్ మరోలా

  ఫస్టాఫ్ అలా... సెకెండాఫ్ మరోలా


  ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అన్నత్తే' / 'పెద్దన్న' మూవీ ఫస్టాఫ్ మొత్తం మాస్ యాక్షన్‌తో ఉంటుందట. అలాగే సిస్టర్ సెంటిమెంట్‌ను కూడా బాగా హైలైట్ చేసి చూపించారట. ఇంటర్వెల్‌లో ఓ ట్విస్ట్‌తో ఉంటుందని ప్రేక్షకుల చెబుతున్నారు. కానీ, సెకెండాఫ్ మాత్రం ఫైట్స్ ఫైట్స్ ఫైట్స్‌తో సాగుతూ ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టేలా ఉందట.

  సినిమా ప్లస్... మైనస్ పాయింట్లు

  సినిమా ప్లస్... మైనస్ పాయింట్లు


  సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'అన్నత్తే' / 'పెద్దన్న' మూవీలో రజినీకాంత్ ఎనర్జిట్ యాక్షన్, ఇమ్మాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రమే బాగున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక, పాత కాలం నాటి కథ, శృతి మించిన సెంటిమెంట్‌, లాజిక్ లేని సన్నివేశాలు, ఓవర్ ఫైట్స్ ఈ సినిమాకు మైనస్‌గా మారాయని సినిమాను చూసిన వాళ్లంతా అంటున్నారు.

  Unstoppable: బాబుకు టీడీపీని ఎందుకిచ్చావ్ అన్న మోహన్ బాబు.. చిరును లాగుతూ బాలయ్య షాకింగ్ రియాక్షన్

  మొత్తంగా మూవీ ఎలా ఉందంటే

  మొత్తంగా మూవీ ఎలా ఉందంటే

  'అన్నత్తే' / 'పెద్దన్న' మూవీని ఇప్పటి వరకూ చూసిన వాళ్లంతా చెబుతోన్న దాని ప్రకారం.. ఇది కూడా రజినీకాంత్‌కు నిరాశనే మిగిల్చిందట. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ క్రేజ్‌తో నెగ్గుకు రావొచ్చన్న ప్రయత్నం పూర్తిగా విఫలమైందట. దాదాపు రెండున్నర గంటలకు ప్రేక్షకులకు పరీక్ష పెట్టేలా ఉందట. అయితే, రజినీకాంత్ అభిమానులకు మాత్రం ఇది నచ్చుతుందట.

  Recommended Video

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  అందరిలో అదొక్కటే సందేహం

  అందరిలో అదొక్కటే సందేహం


  క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అన్నత్తే' / 'పెద్దన్న' మూవీని చూసిన వాళ్లంతా ఓ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అదే ఈ సినిమా కథ. అవును.. దీన్ని చూసిన తర్వాత అసలు ఇది ఇప్పటి కథేనా? లేక ఎప్పుడో రాసుకున్న దాన్ని ఇప్పుడు తీశారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతలా ఇది 80 దశకం నాటి సినిమాలా సాగుతుందని కామెంట్లు చేస్తున్నారు.

  English summary
  Super Star Rajinikanth Now Did Annaatthe/Peddhanna Movie Under Mass Director Siva Direction. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X