అనుష్క, సోనాక్షిలతో రజనీకాంత్ సంచలనం ‘లింగా’
హైదరాబాద్: ఈ వయసులోనూ హీరోగా ఇరగదీస్తున్న తమిళ స్టార్ హీరో రజనీకాంత్ మరో సంచలన చిత్రానికి రెడీ అవుతున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి 'లింగా' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే లేదా జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లబోతోందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా ఎంపికైనట్లు సమాచారం. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే తెలుగు నటుడు జగపతి బాబు ఈ చిత్రంలో విలన్ పాత్ర చేయబోతున్నారట. బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో భారీగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అపీషియల్‌గా వెల్లడి కానున్నాయి.

మరో వైపు రజనీకాంత్ నటించిన 'కొచ్చాడయాన్' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ప్రధానంగా తమిళం, తెలుగు, హిందీ బాషలతో పాటు ఇతర బాషల్లోనూ రిజలీ చేస్తున్నారు. తెలుగులో ఈచిత్రం 'విక్రమసింహ' పేరుతో విడుదల కానుంది. 'విక్రమ సింహ' చిత్రం రాజుల నాటి కథాంశంతో తెరకెక్కిన సినిమా. రజనీ కూతురు ఐశ్వర్య ఆర్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
కెఎస్ రవి కుమార్ స్క్రిప్టు అందించారు. పాండ్య సామ్రాజ్య రాజు కొచ్చాడయాన్ రణధీరన్ స్టోరీ ఇన్స్‌స్పిరేషన్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రజనీకాంత్-దీపిక పదుకోన్ జంటగా నటించిన ఈ చిత్రం దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసారు. దీపిక పదుకోన్, జాకీష్రాఫ్, శరత్ కుమార్, శోభన, ఆది, నాజర్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











