»   » ‘కబాలి’: రజనీ ఇంట్రడక్షన్ సీన్ లీక్, వీడియో ఇదే

‘కబాలి’: రజనీ ఇంట్రడక్షన్ సీన్ లీక్, వీడియో ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ నెల 22న అంటే రేపే 'కబాలి' వచ్చేస్తున్నాడు. అన్ని చోట్లా కబాలి సంబరాలు మిన్నుంటుతున్నాయి. ఈ నేపధ్యంలో చిత్రంలో హీరో ఇంట్రడక్షన్ సీన్ లీక్ అయ్యిందనే వార్త అభిమానలను కలవరపరుస్తోంది. సినిమాలోని రెండు నిముషాల రజనీ ఇంట్రడక్షన్ ఇప్పుడు వాట్సప్ లలో చక్కర్లు కొడుతూ ఆందోళనకు గురి చేస్తోంది. లీకైన వీడియో ఇదిగో మీరు ఇక్కడ చూడవచ్చు.


లీక్ అయిన సీన్లో అరబిక్ సబ్ టైటిల్స్ ఉండటంతో ఈ సీన్ గల్ఫ్ దేశాల్లో లీక్ అయ్యిందన్న అనుమానం వ్యక్తం అవుతోంది. రజనీ జైలు నుంచి బయటకు వస్తున్న రెండు నిమిషాల సన్నివేశం లీక్ అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది.


ఇక ఈ సీన్ లో ఏముందంటే... సీన్ మొదట్లో రజనీకాంత్ ..జైల్లో ఒక పుస్తకం చదువుతూండగా సినిమా సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత సీన్ లో శిక్ష పూర్తి అయ్యిందని జైలు అధికారి చెప్తాడు. వెంటనే జైలు గది నుంచి రజనీ తన స్టైల్లో బయిటకు వస్తాడు.


బ్లూ డ్రస్ ధరించిన రజనీ జైలు బుక్ లో సంతకం పెడతాడు. అక్కడ నుంచి తన వస్తువులు తీసుకుని తానే షూ క్లీన్ చేసుకుని, వాచి, కోటు ధరించి అంతే స్టైల్ గా బయిటకు వస్తాడు. జైల్లో కూడా చాలా రిచ్ నెస్ కనిపించింది. ఇక నిర్మాత ఈ విషయమై స్పందించాడు.రజనీ ఎంట్రీని ఫోన్ లేదా కంప్యూటర్ లో చూస్తే కిక్ రాదు. కాబట్టి ధాంక్యూ పైరట్స్ , ధియోటర్స్ లో శుక్రవారం ఈ సినిమాని చూద్దాం అన్నారు. ఈ విషయమై దర్శకుడు వెంకట్ ప్రభు ఇలా ట్వీట్ చేసాడు.ఇక ఈమధ్య కబాలి సీన్స్ కొన్ని లీక్ అయ్యాయి. అది తెలిసి ప్రొడ్యూసర్ కలైపులి ఎస్. థాను షాక్ అయ్యాడు. అయితే ఆ లీకులు కబాలిపై క్రేజ్ ను ఏమాత్రం తగ్గించలేకపోయాయి. దాంతో ప్రొడ్యూసర్ కు తన పిక్చర్ పై కాన్ఫిడెన్స్ వచ్చింది. కబాలి ఇప్పటికే...అంటే రిలీజ్ కు ముందే 500 కోట్లు బిజినెస్ చేసిందని చెప్పాడు.English summary
A two-minute introduction scene of superstar Rajinikanth from Kabali has leaked online, much to the disappointment of Thalaivar’s hardcore fans. While the exact source of leak is not yet known, sources claim that it could have happened from the screening of the film in the US on Wednesday night. Apparently, Rajinikanth along with his daughter Aishwarya and a few guests watched the film in a private screening in Bay Area.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu