»   » ఒకవైపు శ్రీదేవి విషాదం.. మరోవైపు దుమ్మురేపుతున్న కాలా టీజర్

ఒకవైపు శ్రీదేవి విషాదం.. మరోవైపు దుమ్మురేపుతున్న కాలా టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా టీజర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నది. గ్యాంగస్టర్‌గా కనిపించిన రజనీకాంత్ చిత్ర టీజర్ రికార్డు వ్యూస్‌ను సాధిస్తున్నది. ఈ టీజర్‌లో రజనీ చెప్పిన డైలాగ్స్, యాక్షన్ సీన్లకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రికార్డు స్థాయిలో కాలా టీజర్ సాధించిన వ్యూస్ మీకోసం..

19 గంటల్లో రికార్డు వ్యూస్

19 గంటల్లో రికార్డు వ్యూస్

రజనీకాంత్ అల్లుడు ధనుష్ రూపొందించిన ఈ చిత్రం టీజర్‌ను అర్ధరాత్రి విడుదల చేశారు. గత 19 గంటల్లో ఈ టీజర్ 7,242,819 వ్యూస్ సాధించింది. 3 లక్షల మంది ఈ టీజర్‌ను లైక్ చేశారు. అన్ని ఫ్లాట్‌ఫాంలో కలిపి సుమారు 10 మిలియన్లకు చేరువైంది.

పా రంజిత్‌తో వరుసగా

పా రంజిత్‌తో వరుసగా

కబాలి తర్వాత రజనీతో దర్శకుడు పా రంజిత్ వరుసగా రెండో చిత్రానికి దర్శకత్వం వహించారు. కాలా చిత్రానికి కూడా పా రంజిత్ దర్శకుడు కావడం విశేషం.

 పలు భాషల్లో కాలా

పలు భాషల్లో కాలా

కాలా చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్నది. ఈ చిత్రంలో విలక్షణ నటులు నానా పాటేకర్, హ్యుమా ఖురేషి, సంపత్, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు.

 ఏప్రిల్ 27న విడుదల

ఏప్రిల్ 27న విడుదల

సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్న కాలా చిత్రం ఏప్రిల్ 27న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రాన్ని వండర్‌బార్ పతాకంపై హీరో ధనుష్ నిర్మించారు.

 రోబోను వెనక్కి నెట్టి

రోబోను వెనక్కి నెట్టి

వాస్తవానికి కాలా చిత్రం రోబో2 చిత్రం తర్వాత విడుదల కావాల్సింది. రోబో2 చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడంతో ఆ చిత్ర రిలీజ్ వాయిదా పడింది. సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో శంకర్ దర్శకత్వంలో రోబో2.0 రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే.

 పిజ్జా డైరెక్టర్‌తో రజనీ

పిజ్జా డైరెక్టర్‌తో రజనీ

కాలా, రోబో2.0 చిత్రాల తర్వాత రజనీకాంత్ త్వరలోనే పిజ్జా చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ రూపొందిస్తున్నది.

 శ్రీదేవి మరణం నుంచి

శ్రీదేవి మరణం నుంచి

తన సన్నిహితురాలైన శ్రీదేవి మరణ విషాదం నుంచి బయటపడిన రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో హోళీ పండుగను జరుపుకొన్నారు. ముఖానికి రంగులు పూసుకొని కూతురు సౌందర్యతో సెల్ఫీ దిగారు. ఆ ఫోటోను సౌందర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు.

English summary
The teaser of Rajinikanth’s highly-anticipated gangster drama released yesterday in the midnight and received tremendous response from the audience. In just 16 hours, the teaser garnered over 8.5 million views across all the social media platforms.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu