»   » కబాలి విషయంలోనే ఎందుకిలా..?

కబాలి విషయంలోనే ఎందుకిలా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి రిలీజ్ డేట్‌పై నెలకొన్న సందిగ్ధం ఇంకా వీడలేదు. వరుస ఫ్లాప్ లతో ఉన్న రజినీ కాంత్ హిట్ కోసం చూస్తున్నాడు. అందుకోసం ఈ సారి మాఫియా డాన్ గా "కబాలి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరో వైపు ఫ్యాన్స్ కూడా రజిని సినిమా కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

కానీ ఈ సారి కూడా ప్రేక్షకులకు నిరాశే ఎదురవ నుంది.గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ సీజన్ ప్రధమార్ధంలోనే విడుదల కావలసి ఉండగా మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతూనే వస్తోంది. మొదట ఈ సినిమాను మే నెల చివరి వారంలోనే రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.


Rajinikanth's 'Kabali' to release in July

షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ఇక ఆ తరువాత తమిళనాట ఎన్నికల హడావిడి మొదలు కావడంతో చిత్ర రిలీజ్ డేట్‌ని జూన్‌కు పోస్ట్ పోన్ చేశారు... అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అవ్వనుంది.ఇప్పుడు మరో సారి సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడ్డట్టు తెలుస్తుంది.


జూలై 1న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి చిత్రంలో రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటించగా, రజనీ ముసలి డాన్‌గా కనిపించనున్నాడు. మరి కబాలి రిలీజ్ విషయంపై నిర్మాతలు అఫీషియల్ ప్రకటన ఎప్పుడు చేస్తారో చూడాలి.

English summary
Kabali release date will be decided only after a new government takes over in Tamil Nadu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu