twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ ‘లింగా’: కోర్టు కెక్కిన కాపీ వివాదం

    By Srikanya
    |

    హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం విడుదలైన కత్తి చిత్రం కాపీ వివాదం ముగియకముందే మరో వివాదం మొదలైంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న ‘లింగా' చిత్రం తన కథనే కాపీ కొట్టారంటూ ఒకరు కోర్టు కెక్కారు. తుది మెరుగులు దిద్దుకుంటూ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ వివాదం యూనిట్ కు తలనొప్పిగా మారింది. పెద్ద సినిమాలకు ఇలాంటివి కామనే అని కొట్టిపారేస్తున్నా...కోర్టు కెక్కటంతో సినిమా విడుదలపై ఆ ఇంపాక్ట్ పడే అవకాసం ఉందని అంటున్నారు. వచ్చే ఆదివారం ‘లింగా' ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

    వివరాల్లోకి వెళితే..

    కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘లింగా' చిత్ర కథ, తను రాసిన ‘ముల్లైవనం 999' కథ ఒక్కటేనని రవిరత్నం అనే వ్యక్తి ఈ పిటీషన్‌ వేశారు. ఇందునిమిత్తం కాపీ కొట్టారంటూ మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌లో పిటీషన్‌ దాఖలైంది.దీనిని యూట్యూబ్‌లో కూడా విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన కోర్టు రజినీకాంత్‌, కేఎస్‌ రవికుమార్‌, నిర్మాతలతో సహా 11 మందికి సమన్లు పంపించినట్లు తెలిసింది. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది.

    చిత్రం ప్రత్యేకతలు

    సూపర్ స్టార్ రజనీకాంత్‌ అంటేనే స్త్టెల్‌. పాట, ఫైటు, డైలాగ్‌.. ఇలా ఎందులోనైనా తనదైన శైలిని చూపిస్తూ వస్తున్నారాయన. నటన, ఫైట్‌లలోనే కాదు పాటల్లోనూ తనదైన స్త్టెల్‌తో స్టెప్పులు వేసి అలరిస్తుంటారాయన. తన తాజా చిత్రం 'లింగా'లోనూ ఇదే తరహాలో వైవిధ్యమైన స్టెప్పులు వేస్తున్నారు.

    ''చిత్రంలో రజనీకాంత్‌ మాస్‌ మసాలా యాక్షన్‌ హీరోగా కనిపిస్తాడు. అన్ని వర్గాలవారినీ అలరించేలా దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. సినిమాలో రజనీ పాత్ర చిత్రణ సరికొత్తగా ఉంటుంద''ని చెబుతున్నారు నిర్మాత. చిత్ర హీరోయిన్స్ అనుష్క, సోనాక్షి సిన్హాలతో మాస్‌ పాటలు, క్లాస్‌ పాటలున్నాయట. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత.

    Rajinikanth’s Lingaa In Trouble!

    దర్శకుడు మాట్లాడుతూ...''రజనీకాంత్‌ను మరోసారి మాస్‌ లుక్‌లో చూపించే ప్రయత్నమీ చిత్రం. స్వాతంత్య్రం ముందు, తర్వాత తరాలకు చెందిన రెండు పాత్రల్లో రజనీకాంత్‌ కనిపిస్తారు'' అంటున్నారు దర్శకుడు.

    ఈ సినిమా కథ గురించి ఇటీవల ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య కట్టిన ముళ్ల పెరియార్‌ డ్యామ్‌ నేపథ్యంలో తీర్చిదిద్దన కథతో తెరకెక్కుతోందని కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పెరియార్‌ డ్యామ్‌పై వివాదం నడుస్తోంది. మరి ఈ సినిమాతో రజనీ ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలందిస్తున్నారు.

    రజనీకాంత్ స్వయంగా ఈ చిత్రం విడుదల తేది ప్రకటించి తన అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. 'లింగా' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు రజినికాంత్. ఈ సినిమా దీపావళికి విడుదల అవుతుందని వార్తలు వచ్చినా అవి నిజం కాదని చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ‘లింగా' విడుదల అవుతుందని ప్రకటించారు.

    ఈ చిత్రంలో రజనీ దొంగగా, ఇంజినీరు గా ద్విపాత్రలలో కనపించనున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో ఇంజినీరు పాత్ర వస్తుందని తెలుస్తోంది. సినిమాకు కీలకంగా ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఉండబోతోందని తెలుస్తోంది. దొంగ పాత్రకు, బ్రిటీష్ వారి సమయంలో కనిపించే ఇంజినీరు పాత్రకు ఉన్న లింకేంటి, ఇంజినీరు గా రజనీ ఏం చేసాడు...అది ప్రస్తుత కాలానికి ఎలా ముడిపెట్టారన్నది కీలకం కానుంది.

    తన తాజా చిత్రం 'లింగా' కోసం ఓ స్త్టెలిష్‌ ఫైట్‌ను తెరకెక్కిస్తున్నారు. దీని చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగింది. ఫైట్‌ మాస్టర్‌ లీ ఆధ్వర్యంలో రజనీకాంత్‌, జగపతిబాబుపై పోరాట సన్నివేశాలను షూట్ చేసారు.

    సినిమా పాటల చిత్రీకరణ కోసం త్వరలో యూరప్‌ వెళ్లనున్నారు. చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపిస్తారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమాలో నయనతార ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు

    English summary
    Ravi Ratnam, a petty producer has lodged a petition in the Chennai high court demanding the stall on release of Lingaa. He claims that the story is copy of his film Mullai Vanam 999 that released in 2013.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X