»   » రజనీకాంత్ తో సీక్వెల్‌ ఖరారు

రజనీకాంత్ తో సీక్వెల్‌ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rajinikanth's Narasimha sequel confirmed
హైదరాబాద్ : 'నా దారి.. రహదారి!'.. అంటూ 'నరసింహ'లో రజనీకాంత్‌ పలికిన పంచ్‌ డైలాగులు మరిచిపోయేవారు ఉండరు. ఇప్పుడు అందుకు కొనసాగింపు డైలాగులు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు సూపర్‌స్టార్‌. ప్రస్తుతం రజనీకాంత్‌ నటించిన 'కోచ్చడయాన్‌' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో.. తదుపరి చిత్రంపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. అభిమానుల కోరిక మేరకు రజనీకాంత్‌ మాస్‌ కమర్షియల్‌ చిత్రంలో నటించబోతున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో రమ్యకృష్ణ, సౌందర్య కథానాయికలుగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలోని 'నరసింహ'కు సీక్వెలే ఈ చిత్రమని అనధికార సమాచారం. అనుష్క హీరోయిన్. రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి తరహా పాత్రలో అనుష్క నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రాధమిక దశలో ఉన్న ఈ సినిమా 'కోచ్చడయాన్‌' విడుదల అనంతరం సెట్స్‌పైకి వెళ్లనుందని వినికిడి.

'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ విడుదల చేశారు.

రజనీకాంత్ నటించిన చివరి చిత్రం 'రోబో' 2010లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన రజనీకాంత్, దర్శకురాలు సౌందర్య 'కొచ్చాడయాన్' చిత్రాన్ని ఈ దీపావళికి విడుదల చేస్తామని అభిమానులకు మాటిచ్చారు. కానీ ఫలితం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా చాలా పెండింగులో ఉంది. ఈ నేపథ్యంలో కొచ్చాడయాన్ చిత్రం విడుదల లేటవుతోంది.

'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

English summary
Rajinikanth has signed a new film with KS Ravi Kumar which is most probably going to be sequel to ‘Narasimha.’ After having many sit outs with Rajini, the script has been locked and shooting is going to be commenced once ‘Kochadaiyaan’ will be wrapped up. This is the best offers for anushka in her life time after ‘Arundathi.’ As of now, Sweety is busy with ‘Rudramadevi, Bahubali’ will take up ‘Narasimha 2’ only after these.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu