Don't Miss!
- News
కోటంరెడ్డి కీలక నిర్ణయం - రిటర్న్ గిఫ్ట్..!!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పేటా ప్రీ రిలీజ్ రివ్యూ: ఎన్టీఆర్.. వినయ విధేయపై పైచేయి.. ‘అడ్వాన్స్’ హంగామా!
సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న పేటా చిత్రం రిలీజ్‌కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. గతంలోని రజనీకాంత్ మాస్ అప్పీల్‌ను తలపించే విధంగా ఈ చిత్రం రూపొందిందని ప్రమోషన్ సందర్భంగా దర్శకుడు భరోసా ఇస్తున్నాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేస్తున్న సందడి ఇలా ఉంది..

అడ్వాన్స్ బుకింగ్ హంగామా
తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న పేటా సినిమా అడ్వాన్సు బుకింగ్ నంబర్లు హంగామా చేస్తున్నాయి. సంక్రాతి బరిలో నిలిచిన ఎన్టీఆర్ కథానాయకుడు, విశ్వమ్, వినయ విధేయ రామ కంటే భారీగా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నట్టు సమాచారం.

ఓవర్సీస్‌లో భారీగా ప్రదర్శనలు
ఓవర్సీస్‌లో పేటా సినిమా రిలీజ్‌కు భారీగా ఏర్పాట్లు చేశారు. అమెరికాలో ఈ చిత్రం రెండు భాషల్లో కలిపి 500పైగా స్క్రీన్లలో ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు చేశారు అని ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ట్వీట్ చేశారు. సినిమా ప్రీ రిలీజ్ సేల్స్ భారీగా ఉన్నట్టు పేర్కొన్నారు.

వేగంగా 1 మిలియన్ క్లబ్‌లో
పేటా చిత్రం అమెరికా బాక్సాఫీస్ వద్ద సుమారు 4 లక్షలకుపైగా డాలర్లను వసూలుచేసినట్టు ట్రేడ్ రిపోర్టు. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 2.0 చిత్రం రికార్డులను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తక్కువ వ్యవధిలోనే 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం ఖాయం అంటున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ కంటే ఎక్కువగా
ట్రేడ్ వర్గాల ప్రకారం మంగళవారం రాత్రి వరకు.. అమెరికాలో 135 లోకేషన్ల విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు సుమారు 3 లక్షల డాలర్లు, వినయ విధేయ రామ 40 లొకేషన్లలో 20 వేల డాలర్ల మేర, విశ్వం సినిమా 20 లొకేషన్లలో 15 వేల డాలర్లు కలెక్ట్ చేసినట్టు తెలిసింది.

ప్రీమియర్లకు రంగం సిద్దం
సూపర్‌స్టార్ రజనీకాంత్ క్రేజ్ అమెరికాలో బీభత్సంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్ర ప్రీమియర్ జనవరి 9న భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మొదలు కానున్నాయి. ఇప్పటికే రజినీ మానియా భారీగా ఉన్నట్టు తెలుస్తున్నది.

మాస్ ఎలిమెంట్‌తో రచ్చ
పేటాలో పాటలు, మాస్ ఫైట్స్, యాక్షన్ల సీన్లతో ట్రైలర్లు ఇరుగదీశాయి. సిమ్రాన్, త్రిషా, మేఘా ఆకాష్ లాంటి అందాల తారలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. ఇప్పటికే ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రజనీ తరహా డైలాగ్స్ టీజర్లతో కేక పుట్టిస్తున్నాయి.

ఇక రజనీకాంత్ నిరాశ పరచడు
పెట్టా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. దర్శకుడి కంటే ముందు నేను రజనీ అభిమానిని. రజనీ ఫ్యాన్స్‌కు ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమాను నేను పేట రూపంలో అందించబోతున్నాను. పేట చిత్రంలో పాత రజనీకాంత్‌ను చూస్తారు. ఫ్యాన్స్‌ను రజనీ నిరాశపరచరు అని అన్నారు.

రజనీకాంత్‌కు పూర్వ వైభవం
రజనీ కాంత్‌కు పేట మూవీ పూర్వ వైభవాన్ని రజనీకి తెచ్చిపెడుతుంది. కాలా, కబాలి మంచి చిత్రాలే కాని ప్రేక్షకులకు కొంత నిరాశ కలిగించాయి. రజనీ సినిమాల నుంచి ఆశించే అంశాలు కొరవడంతో అభిమానులు సంతృప్తి చెందలేదు. కానీ ఈ సినిమా మాస్ అంశాలతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది అని కార్తీక్ సుబ్బరాజు తెలిపారు.