»   » రేర్ వీడియో : రాజీవ్ గాంధీ, సోనియా వివాహం

రేర్ వీడియో : రాజీవ్ గాంధీ, సోనియా వివాహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

డిల్లీ :మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల వివాహం 1968లో జరిగింది. వారి వివాహం వీడియో చాలా మంది చూసి ఉండరు. ఇప్పుడు వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో చక్కర్లు కొడుతోంది. మీరూ ఆ వీడియోని చూడండి.

బ్రిటీష్ మూవీ టోన్ వారు ఈ వీడియోని విడుదల చేసారు. అప్పట్లో ఇందిర నివాసంలో జరిగిన ఈ వివాహ వేడుక వీడియోలో రాజీవ్, సోనియా లను మాత్రమే కాక విజయలక్ష్మీ పండిట్, సంజయ్ గాంధీ, సోనియా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే ఈ వేడకల్లో సోనియా తండ్రి మాత్రం కనపడలేదు.

Rajiv Gandhi & Sonia's Wedding Video

రాజీవ్ అందగాడు కాబట్టే పెళ్లి చేసుకున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారని పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరి వెల్లడించారు. తన కొత్త పుస్తకం నైదర్ ఎ హాక్ నార్ ఎ డోవ్‌లో కసూరీ ఈ విషయాలు రాశారు. 2005లో ముషారఫ్‌తో కలిసి తాను భారత్ వచ్చినప్పుడు సోనియాను కలుసుకున్నానని, ఆ సందర్భంలో తాను రాజీవ్ అందగాడని గుర్తు చేసినట్లు చెప్పారు. అది విన్న సోనియా చిరునవ్వుతో రిసీవ్ చేసుకున్నారని చెప్పారు.

రాజీవ్ అందగాడు కాబట్టే తాను వివాహమాడానని సోనియా చెప్పినట్లు కసూరీ పుస్తకంలో రాశారు. తాను సోనియాను కలిసిన సమయంలో ఆమె వెంట నట్వర్ సింగ్ కూడా ఉన్నారని కసూరి చెప్పారు. వాస్తవానికి కసూరి కేంబ్రిడ్జిలో రాజీవ్‌తో స్నేహంగా ఉన్న పాకిస్థానీ మిత్రుల గురించి కూడా చెప్పాలనుకున్నారట. కానీ వీలుపడలేదట. 1965లో రాజీవ్ కేంబ్రిడ్జిలో ఇంజనీరింగ్ చదువుకున్నారు.

Rajiv Gandhi & Sonia's Wedding Video

అదే సంవత్సరంలో ఆయనకు సోనియా పరిచయమయ్యారు. ఆ సమయంలో సోనియా అసలు పేరు ఆంటోనియా మైనో. రాజీవ్ కూడా సోనియాను అమితంగా ప్రేమించేవారని ఆయన కేంబ్రిడ్జి స్నేహితులు చెప్పినట్లుగా అనేక కథనాలు వెలువడ్డాయి. కేంబ్రిడ్జిలో రాజీవ్ సోనియాపై కవితలు కూడా రాశారట. ఆ తర్వాత 1968 ఫిబ్రవరి 25న రాజీవ్-సోనియాల వివాహం ఇందిర సమక్షంలో జరిగింది

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

English summary
Mrs. Indira GandhI's son Rajiv marries Miss Sonia Maino (Italian). Various shots of the wedding ceremony - Mrs. Indria Gandhi and Mrs. Vijay Lakshmi Pandit - Ceremony and cutting the cake - Shots of the happy couple with Indian President Dr. Zakir Hussain.
Please Wait while comments are loading...