twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అద్బుతంగా సర్వం తాళమయం.. రాజీవ్ మీనన్‌పై విశ్వనాథ్, నాగ అశ్విన్, మహీ ప్రశంసలు

    |

    ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ రూపొందించిన 'సర్వం తాళమయం'పై ప్రముఖ దర్శకులు ప్రశంసలు కురిపించారు. వ్యాపార చిత్రాలకు పెద్ద పీట వేస్తున్న ఈ రోజుల్లో శంకరాభరణం, సాగర సంగమం లాంటి అద్భుత సంగీత భరిత చిత్రాల కోవలో సర్వం తాళమయం చిత్రం రావడం ఎంతో అభినందనీయమన్నారు. రాజీవ్ మీనన్ చిత్రీకరించిన తీరు పలువురిని ఆకట్టుకొంటున్నది. దర్శకులు కే విశ్వనాథ్, చంద్రశేఖర్ యేలేటి, నాగ అశ్విన్, మహి వీ రాఘవ్ తదితరులు ఈ చిత్రంపై ఏమన్నారంటే..

    చాలాకాలం తర్వాత సంగీత భరితమైన చిత్రం

    చాలాకాలం తర్వాత సంగీత భరితమైన చిత్రం

    విశ్వనాథ్ మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్ కి నా ఆశీర్వాదాలు అని అన్నారు. దర్శకుడు రాజీవ్ మీనన్‌ను అభినందించి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.

    నాగఅశ్విన్, మహీ వీ రాఘవ ప్రశంసలు

    నాగఅశ్విన్, మహీ వీ రాఘవ ప్రశంసలు

    అలాగే ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, నాగ అశ్విన్, మహి వీ రాఘవ్ ఈ చిత్రాన్ని చూసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాజీవ్ మీనన్‌ తెరకెక్కించిన విధానాన్ని ఎంతగానో వారు ప్రశంసించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత మాంత్రికుడు ఏఆర్ రహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచిందంటూ పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

    సంగీత, నృత్య ప్రధానమైన సినిమా

    సంగీత, నృత్య ప్రధానమైన సినిమా

    సర్వం తాళమయం మార్చి 8 తేదీన విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో దర్శకుడు రాజీవ్ మీనన్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని అన్ని మల్టిప్లెక్స్ థియేటర్లలోనూ విడుదల చేస్తున్నాం. సంగీత, నృత్య ప్రధానమైన ఈ చిత్రాన్ని తప్పకుండా చూసి ఆదరించాలి అని చెప్పారు. ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ నిర్మాత కావడం గమనార్హం.

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు:
    జి వి ప్రకాష్, అపర్ణ బాలమురళి, నేడుముడి వేణు, వినీత్, దివ్యదర్శిని

    సంగీతం: ఏ ఆర్ రహమాన్,
    సినిమాటోగ్రఫీ: రవి యాదవ్,
    ఆర్ట్: సి ఎస్ ఆనందన్,
    లిరిక్స్: రాకెందు మౌళి,
    డైలాగ్స్: ఘంటసాల రత్న కుమార్,
    ఫైట్స్: దినేష్ సుబ్బరాయన్,
    ఎడిటింగ్: అంథోని,

    నిర్మాత: లత,

    కథ, కథనం, దర్శకత్వం: రాజీవ్ మీనన్

    English summary
    Cinematographer Rajiv Menon's latest movie is Sarvam Talamayam. Music based movie was prodeced by Rajiv Menon himself. This movie showed for K Vishwanath, Chandra Shekhar Eleti, Naga Ashwin, Mahi V Raghava. They have appreciated Rajiv Menon works.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X