»   » అఫీషియల్ : మూడో పార్ట్ కు రంగం సిద్దం..స్క్రిప్టు పూర్తైంది

అఫీషియల్ : మూడో పార్ట్ కు రంగం సిద్దం..స్క్రిప్టు పూర్తైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సంజయ్‌దత్‌కు మారుపేరులా నిలిచిపోయిన మున్నాభాయ్‌ సీరిస్ ఇప్పుడు మూడోపార్ట్ కు సిద్దమవుతోంది. అయితే ఇప్పటికే 'మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌', 'లగేరహో మున్నాభాయ్‌'ల్లో మున్నాభాయ్‌గా కనిపించి ఆకట్టుకున్న సంజయ్‌దత్... కు మాత్రం మొండి చేయి చూపించి రణ్ బీర్ కపూర్ తో ముందుకు వెళ్లనున్నారనే వార్త ఆ మధ్య ముంబై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడింది. అయితే ఇప్పుడు సంజయ్ దత్ తోనే ముందుకు వెళ్తానని దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ అఫీషియల్ గా ప్రకటించారు.

'మున్నాభాయ్‌' సిరీస్‌లో మూడో చిత్రాన్ని చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించాడు హిరాణీ. తాజాగా ముంబయిలో జరుగుతున్న 'మామి' చిత్రోత్సవంలో హిరాణీ మాట్లాడుతూ ''మున్నాభాయ్‌' మూడో భాగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తొలి రెండు చిత్రాలను మించేలా అద్భుతమైన కథ సిద్ధమైంది. స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఇందులోనూ సంజయ్‌, అర్షద్‌ వార్సి నటిస్తారు''అన్నారు.

Rajkumar Hirani 's ‘Munnabhai-3’ Confirmed

మరో ప్రక్క సంజయ్‌దత్‌ జీవితకథతో రాజ్‌కుమార్‌ హిరాణీ ఈ చిత్రాన్ని రూపొందించే సన్నాహాల్లో ఉన్నారు. సంజయ్‌ జీవితాన్ని యదార్థంగా చిత్రీంచేలా ఉంటుందని హిరాణీ చెప్పారు.

''తొలుత సంజయ్‌ జీవితకథతో సినిమా చేయడానికి సందేహించాను కానీ దీనిలో ముంబయి మాఫియాకు సంబంధించిన విషయాలూ ఇందులో ఉన్నందున దీనిపై సంజయ్‌తో నెల రోజులు జరిపిన చర్చలతో నా నిర్ణయం మారింది. ఆయన జీవితంలో ఉన్న మానవీయత, భావోద్వేగాలు నన్ను కట్టిపడేశాయి. సంజయ్‌ను ఉత్తముడిగా చిత్రీకరించేలా కాక జరిగిన సంఘటనలను వివరించేలా ఇది ఉంటుంది''అన్నారు.

English summary
"When we write, we do not think of casting. We are making third part of 'Munnabhai' and it will definitely have Sanjay and Arshad. Writing should be free flowing. We are still writing the script, we have not reached casting yet (for other actors)," Hirani said.
Please Wait while comments are loading...