»   » కేసీఆర్ గా కనిపించనున్నది ఇతనే, ఉద్యమ నేత కేసీఆర్ బయోపిక్ మొదలు

కేసీఆర్ గా కనిపించనున్నది ఇతనే, ఉద్యమ నేత కేసీఆర్ బయోపిక్ మొదలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవితం ఆధారంగా మధుర శ్రీధర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. 'పెళ్లి చూపులు' ఫేం రాజ్‌ కందుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ బయోపిక్‌లో బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావును అనుకుంటున్నట్లు దర్శక-నిర్మాత మధుర శ్రీధర్‌ తెలిపారు.

రాజ్‌కుమార్‌ రావు

రాజ్‌కుమార్‌ రావు

‘నేను మొదటి నుంచి రాజ్‌కుమార్‌ రావును అనుకుంటున్నా. రాజ్‌కుమార్‌ రావు ముఖంలో కేసీఆర్‌కు దగ్గరి పోలికలు ఉంటాయి. ఆయన్ను కలిశాను, నటించడానికి సిద్ధంగా ఉన్నారు. మొదట తమిళంలో విజయ్‌ ఆంటోనీ అనుకున్నాం. హిందీలో రాజ్‌కుమార్‌ అనుకున్నాం. చూడాలి.. ఈ చిత్రం (ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ సత్యమూర్తి) విడుదల అయితే అవన్నీ ప్రశాంతంగా కూర్చొని ఆలోచించాలి' అంటూ చెప్పుకోచ్చారు.

967లో ప్రారంభమై, 2014 జూన్‌ 2

967లో ప్రారంభమై, 2014 జూన్‌ 2

‘ఈ సినిమా 1967లో ప్రారంభమై, 2014 జూన్‌ 2కు ముగుస్తుంది. ఈ ఏడాదిలోనే చిత్రాన్ని ప్రారంభిస్తాం. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఇది లీడర్‌ కథ. తెలంగాణ-ఆంధ్రా ఉద్యమం నుంచి ప్రారంభమవుతుంది' అని మధుర శ్రీధర్‌ చెప్పారు.

ఒక దర్శకుడిగా నిర్ణయం తీసుకున్నా

ఒక దర్శకుడిగా నిర్ణయం తీసుకున్నా

మహాత్మా గాంధి, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలకు ఏమాత్రం తీసిపోని అత్యంత సంక్లిష్టమైన, భయంకరమైన సవాళ్లు కేసీయార్ ఎలా ఎదుర్కున్నారనే విషయాలు తెలుసుకున్నాక ఇక ఈ చరిత్రని తెరపైకి ఎక్కించాల్సిందేనని ఒక దర్శకుడిగా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.

2018 ఫిబ్రవరి 17న

2018 ఫిబ్రవరి 17న

2017 జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా షూటింగ్ మొదలుపెట్టి... 2018 ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తామని గతంలోనే వెల్లడించారు మధుర శ్రీధర్. తాజాగా కేసీఆర్ బ‌యోపిక్ ను త్వరలోనే సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నట్టు మ‌ధుర శ్రీధర్ ప్రకటించాడు. ఇందుకోసం ఇప్ప‌టికే కేసీఆర్ పుట్టిన ఊరు దుబ్బాక‌కు వెళ్లి అక్క‌డి స్థానికుల‌తో మాట్లాడిన‌ట్లు తెలిపారు. ఇంకా ప‌రిశోధ‌న జ‌రుగుతోంద‌ని చెప్పారు.

అవార్డ్ విన్నింగ్ యాక్టర్

అవార్డ్ విన్నింగ్ యాక్టర్

జాతీయ ఉత్త‌మ న‌టుడు రాజ్ కుమార్ రావు ఇప్ప‌టికే అనేక పాత్ర‌ల‌కు జీవం పోయ‌గా, కేసీఆర్ పాత్ర‌కి ఈ న‌టుడు అయితేనే స‌రిగ్గా స‌రిపోతాడ‌ని మేక‌ర్స్ భావించిన‌ట్టు తెలుస్తుంది. సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, కృతి సనన్‌ జంటగా తెరకెక్కుతున్న హిందీ ఫిల్మ్"రాబ్తా" లో నేషనల్ ఫిలిం అవార్డ్ విన్నింగ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు నటించారు.

విచిత్ర గెటప్ లో

విచిత్ర గెటప్ లో

324 ఏళ్ళ వయస్సు ఉన్న వ్యక్తి పాత్రలో రాజ్ కుమార్ విచిత్ర గెటప్ లో కనిపించాడు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తన దర్మపధ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

రాబ్తా

రాబ్తా

తాజాగా బాలీవుడ్లో మరోసారి 'మగధీర' లాంటి సినిమా వస్తోంది. సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, కృతి సనన్‌ జంటగా తెరకెక్కుతున్న హిందీ ఫిల్మ్"రాబ్తా" ట్రైలర్ తాజాగా రిలీజైంది. ఈ సినిమాలో నేషనల్ ఫిలిం అవార్డ్ విన్నింగ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు 324 ఏళ్ళ వయస్సు ఉన్న వ్యక్తి పాత్రలో నటించాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

English summary
Producer Madhura Sridhar revealed some time back that he is planning make a biopic on Telangana CM Kalvakuntla Chandrasekhar Rao. He said that "We are considering Bollywood actor Rajkumar Rao for KCR role
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu