»   » ఆ పాత్ర వయస్సు 324 ఏళ్లు : ఆసక్తి గొలుపుతున్న "రాబ్తా"

ఆ పాత్ర వయస్సు 324 ఏళ్లు : ఆసక్తి గొలుపుతున్న "రాబ్తా"

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాజాగా బాలీవుడ్లో మరోసారి 'మగధీర' లాంటి సినిమా వస్తోంది. సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, కృతి సనన్‌ జంటగా తెరకెక్కుతున్న హిందీ ఫిల్మ్"రాబ్తా" ట్రైలర్ తాజాగా రిలీజైంది. ఈ సినిమాలో నేషనల్ ఫిలిం అవార్డ్ విన్నింగ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు 324 ఏళ్ళ వయస్సు ఉన్న వ్యక్తి పాత్రలో నటించాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరియు కృతిసనన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న రాబ్తా చిత్రంలో రాజ్ కుమార్ విచిత్ర గెటప్ లో కనిపించనున్నాడట. దినేష్ విజన్ దర్శకత్వంలో రాబ్తా మూవీ తెరకెక్కగా ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఓ సర్ ప్రైజ్ తో ఎండ్ అయింది. ఆ సర్ ప్రైజ్ మరేదో కాదు రాజ్ కుమార్ రావు పాత్రే.

324 ఏళ్ల వృద్ధుడిలా

324 ఏళ్ల వృద్ధుడిలా

ఇప్పుడీ పాత్ర కి సంబందించిన ఒక ఫొటో ఇంటర్నెట్లో విపరీతంగా పాపులర్ అయ్యింది. ‘రాబ్తా' సినిమా కోసం రాజ్‌ కుమార్‌ రావ్ ను 324 ఏళ్ల వృద్ధుడిలా మార్చేశారు. ఈ పాత్ర పోషించే నటుడి కోసం 16 మందికి స్క్రీన్ టెస్టు నిర్వహించగా రాజ్ కుమార్ రావ్ ను ఫైనల్ చేశారు.

మేకప్ కోసమే ఆరుగంటలు

మేకప్ కోసమే ఆరుగంటలు

రోజూ ఆరుగంటల సమయం కేవలం మేకప్ కోసమే పడుతుండగా, 324 సంవత్సరాల వయసుతో ఉన్న పోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి మరి తానే చెప్పాడంటే అర్థం చేసుకోండి ఎవరూ గుర్తు పట్టని విధంగా ఉన్నాడో. అయితే రాబ్తా సినిమాలో కృతి సనన్, సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ జంటగా నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది.

జూన్‌ 9న

జూన్‌ 9న

జూన్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'మగధీర' సినిమాను గుర్తుకు తెస్తోందన్న విమర్శౌంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇతర విషయాలు మాత్రం ఇప్పటి వరకు బహిర్గతం కాకుండా చిత్ర బృందం జాగ్రత్త పడుతోంది.

 రొమాంటిక్ సీన్లు

రొమాంటిక్ సీన్లు

ఇక సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్ మధ్య రొమాంటిక్ సీన్లు, ముద్దు సన్నివేశాలు జోరుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంత హాటుగా, ఘాటుగా కృతిసనన్ గతంలో ఎప్పుడూ, ఏ హీరోతోనూ రొమాన్స్ చేయలేదు. 'రబ్‌తా' చిత్రానికి దినేష్ విజన్ దర్శకత్వం వహించగా, జూన్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

rn

24 గంటల్లో కోటిపైగా హిట్స్

అదేసమయంలో రెండు నిమిషాల నిడివిగల ఈ వీడియో సినీ లవర్స్ విపరీతంగా ఎట్రాక్ట్ చేసుకుంది. 24 గంటల్లో కోటిపైగా హిట్స్ రావడంతో యూనిట్ ఫుల్‌ఖుషీ అయిపోయింది. ఇక సుషాంత్ యాక్షన్ అదిరిపోయిందని, కృతిసనన్ గత సినిమాల కంటే అన్నివిధాలుగా దూకుడు పెంచిందని అంటున్నారు. ఈ తరహా సినిమాలు బాలీవుడ్‌లో వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేదు. మరి రబ్‌తా ఏం చేస్తుందో చూడాలి.

English summary
Bollywood Latest Movie "Raabta" trailer ends with an element of surprise. At the end of the trailer, one can spot a mysterious looking character, played by the Trapped actor
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu