»   »  కృష్ణార్జునుల వద్దకు రజనీకాంత్!!

కృష్ణార్జునుల వద్దకు రజనీకాంత్!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
విష్ణువర్థన్, మమతా మోహన్ దాస్ హీరోహీరోయిన్లుగా చేస్తున్న సినిమాకు కృష్ణార్జున పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 1.కృష్ణార్జునులు 2.కృష్ణార్జున 3.మిత్రమా అనే టైటిల్స్ ను అనుకొని ఈ మూడింటిలో ఒక పేరును సూచించాలని ప్రేక్షకులను కోరిన సంగతి తెలిసిందే. ఇందులో అత్యధికంగా కృష్ణార్జున పేరును ఎక్కువగా సూచించినట్టు తెలుస్తోంది. ఇకపోతే గురువారంనాడు ఈ సినిమా షూటింగ్ స్పాట్ కు ఈ సినిమాను నిర్మిస్తున్న మోహన్ బాబు మిత్రుడు రజనీకాంత్ వచ్చాడు. ఈ సందర్భంగా రజనీకాంత్ విష్ణువర్థన్ ను అశీర్వదించాడు కూడా. పి. వాసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాగర్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X