twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'వికమ్రసింహ': నమ్మలేని నిజాలు (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : రజనీకాంత్‌ హీరోగా 'కోచ్చడయాన్‌' అనే యానిమేషన్‌ సినిమా తెరకెక్కి రేపు విడుదల అవుతోంది. ఈ సినిమా తెలుగులో 'విక్రమసింహ'గా వస్తోంది. ఇందులో వదనాదేవిగా దీపికా పదుకొణే నటిస్తోంది. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. త్రీడీ పెర్‌ఫార్మెన్స్‌ మోషన్‌ క్యాప్చరింగ్‌ విధానంలో సినిమాని తెరకెక్కించారు.

    ఈ సినిమా చిత్రీకరణ పద్ధతిని 'మోషన్‌ క్యాప్చరింగ్‌' విధానమంటారు. షూటింగ్‌ మొత్తం ఒకే గదిలో జరుగుతుంది. నటులు ఒకే రకమైన కాస్ట్యూమ్‌ ధరిస్తారు. ఆ దుస్తుల పైన, శరీరంపైన వేర్వేరు చోట కాంతిని ప్రతిఫలించే సెన్సార్లు అతికిస్తారు. నటీనటులు నటించేప్పుడు చుట్టూ అమర్చిన 40 కెమెరాలు వివిధ కోణాల్లో చిత్రీకరిస్తాయి. సెన్సార్ల ద్వారా ప్రతిఫలించే కాంతిని బట్టి నటీనటుల కదలికల్ని రికార్డు చేసి వాటిని కంప్యూటర్లో సృష్టించిన యానిమేషన్‌ పాత్రలకు అనుసంధానిస్తారు.

    అందువల్ల ఆ పాత్రల కదలికలన్నీ చాలా సహజంగా ఉంటాయి. ఇక నటీనటుల ముఖకవళికలను చిత్రించడానికి మొహం మీదకు వచ్చేలాగా తలపై ఓ హెల్మెట్‌ని పెట్టి దానికో కెమెరా అమరుస్తారు. ఇలా చిత్రించిన హావభావాలను కూడా యానిమేషన్‌ పాత్రలకు అనుసంధానిస్తారు. యానిమేషన్‌ పాత్రలన్నింటినీ ఆయా నటీనటుల రూపంలోనే రూపొందిస్తారు. ఇలా మొత్తం సినిమా డిజిటలైజ్‌ అవుతుంది. ఇక నటుల నేపథ్య దృశ్యాలన్నీ కంప్యూటర్‌ విజువల్‌ ద్వారా రూపొందినవే.

    సునీల్‌ లుల్ల నిర్మాత. శరత్‌కుమార్‌, స్నేహ, ఆది, శోభన, నాజర్‌, జాకీ ష్రాఫ్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఎరోస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, మీడియా వన్‌ గ్లోబర్‌ సహ నిర్మాతలు. చిత్రానికి కథ: కె.ఎస్‌.రవికుమార్‌, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: రాజీవ్‌ మీనన్‌, కూర్పు: ఆంటోని. ఇంతేనా ఈ సినిమాలో మరిన్ని ప్రత్యేకతలున్నాయి.

    అవేంటో ఓ సారి చూద్దాం.. స్లైడ్ షో లో...

    త్రిపాత్రాభినయం...

    త్రిపాత్రాభినయం...

    8వ శతాబ్దానికి చెందిన కోచ్చడయాన్‌ రందిరన్‌ అనే పాండ్య రాజు కథ ఇది. ఈ సినిమాలో రజనీకాంత్‌ త్రిపాత్రిభినయం చేశారు. తండ్రి, అతని ఇద్దరి కొడుకులుగా రజనీ కనిపించబోతున్నారు. కోచ్చడయాన్‌ అంటే భుజాలపైకి వేలాడే పొడవాటి జుట్టు ఉన్న రాజు అని ఓ అర్థం.

    నగేష్...

    నగేష్...

    సినిమాలో విజువల్‌ గ్రాఫిక్స్‌ ద్వారా అలనాటి హాస్యనటుడు నగేష్‌ని చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం సముద్రం అడుగున రజనీకాంత్‌ డాల్ఫిన్లతో పోరాడే సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమాకిది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

    ఎన్ని భాషలో..

    ఎన్ని భాషలో..

    సినిమాని తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠి, ఒడియాలతో పాటు ఇంగ్లిష్‌లో తెరకెక్కిస్తున్నారు. జర్మన్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, జపనీస్‌ భాషల్లో అనువాదం చేసే అవకాశాలున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చని సమాచారం.

    ఎంత ఖర్చు

    ఎంత ఖర్చు

    టూడీ, త్రీడీ విధానాల్లో సినిమా రూపొందిన ఈ చిత్రానికి రూ.125 కోట్లు దాకా ఖర్చయింది. దాదాపు మూడు వేల తెరలపై సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్‌ ఓ పాటలో తన గొంతుని కూడా వినిపించారు. మన్నన్‌ తర్వాత రజనీ ఈ సినిమా కోసమే గొంతును శ్రుతి చేశారు. రజనీ భార్య లతా రజనీకాంత్‌ కూడా ఈ సినిమాలో ఓ పాట పాడారు.

    హాలీవుడ్ స్టాండర్డ్స్ లో..

    హాలీవుడ్ స్టాండర్డ్స్ లో..

    ఇప్పటిదాకా ఈ విధానంలో హాలీవుడ్‌ చిత్రాలు 'అవతార్‌', 'టిన్‌ టిన్‌' లాంటి చిత్రాలు రూపొందాయి. ఈ చిత్రాల్ని రూపొందించడానికి పట్టిన సమయం కంటే తక్కువ సమయంలోనే అంటే రెండేళ్లలోనే దర్శకురాలు సౌందర్య 'కోచ్చడయాన్‌'ని పూర్తి చేశారు.

    వీటీ ఫలితం

    వీటీ ఫలితం

    దర్శకురాలు సౌందర్య ఐదేళ్ల క్రితం నుంచి ఈ సినిమా గురించి ఆలోచనలు ప్రారంభించారు. వివిధ సెమినార్లు, పరిశోధనల ఫలితం ఈ సినిమా. 2011 సెప్టెంబరులో ఈ సినిమా పూర్వ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 2012 మార్చిలో చిత్రీకరణ ప్రారంభమైంది.

    తొలి చిత్రం..

    తొలి చిత్రం..

    ఈ సినిమా కోసం చైనా, హాంకాంగ్‌, అమెరికాకి చెందిన నిపుణులు రెండేళ్ల పాటు పని చేశారు. నిజ జీవితంలోని వ్యక్తుల్ని యానిమేషన్‌ రూపాల్లో చూపించబోతున్న తొలి చిత్రమిది.

    తొలి హీరో

    తొలి హీరో

    భారతీయ చిత్రపరిశ్రమలో వచ్చిన నాలుగు ఫార్మేట్లు అంటే బ్లాక్‌ అండ్‌ వైట్‌, ఈస్ట్‌మన్‌ కలర్‌, కలర్‌, యానిమేషన్‌లో నటించిన తొలి హీరో రజనీకాంత్‌.

    ఆడియోకి..

    ఆడియోకి..


    ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించారు. దీనికి బాలీవుడ్‌ కథానాయకుడు షారుఖ్‌ఖాన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమాన్ని ముంబయి, హైదరాబాద్‌లో నిర్వహించారు. ముంబయిలో జరిగిన కార్యక్రమానికి అమితాబ్‌ బచ్చన్‌, హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి దాసరి నారాయణరావు, రాజమౌళి, మోహన్‌బాబు, రామానాయుడు లాంటి ప్రముఖులు హాజరయ్యారు.

    ఇదొక అద్భుతం...

    ఇదొక అద్భుతం...

    ''ఇది సినీరంగంలో కీలక మార్పు తీసుకురాబోతున్న గొప్ప చిత్రం. రజనీ కాంత్‌, అతని తనయ సౌందర్య చేస్తున్న ఓ అద్భుతం. ఈ అద్భుతంలో నేను భాగమవ్వడం నా అదృష్టం''. - దీపికా పదుకొణే, నాయిక

    సినీ చరిత్రలో మలుపు...

    సినీ చరిత్రలో మలుపు...

    ''దేశ సినిమా చరిత్రను కీలక మలుపు తిప్పే సినిమాలో నేను పని చేశాను అంటే గర్వంగా ఉంది. రజనీకాంత్‌ని తెరపై చూస్తుంటే ఆ ఆనందానికి హద్దుల్లేవు'' - ఎ.ఆర్‌.రెహమాన్‌, సంగీత దర్శకుడు

    ఆరేళ్ల కృషి...

    ఆరేళ్ల కృషి...

    ''ఈ సినిమా కోసం గత ఆరేళ్లుగా పని చేస్తున్నాను. ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నా సినిమా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా కొత్తగా, వినూత్నంగా ఉండాలన్నదే నా ఆలోచన. అందుకే మోషన్‌ క్యాప్చరింగ్‌ విధానాన్ని ఎంచుకున్నాం. సాధారణ చిత్రాల్లోనూ, నిజజీవితంలో కుదరని ఎన్నో అంశాల్ని ఈ విధానంలో తెరకెక్కించవచ్చు. ఎన్ని చేసినా సహజత్వానికి దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో రూపొందించాం.'' - సౌందర్య, దర్శకురాలు

    English summary
    KOCHADAIIYAAN – The Legend, a Mediaone Global Entertainment Limited production, directed by Soundarya Rajnikanth Ashwin, worldwide in cinemas on May 23rd 2014,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X