»   » హిట్టవ్వకపోతే నేను, కోడలు సమంత మొహం చూసుకోలేం, డైరెక్టర్ పెద్ద ఓసీడీ: నాగార్జున

హిట్టవ్వకపోతే నేను, కోడలు సమంత మొహం చూసుకోలేం, డైరెక్టర్ పెద్ద ఓసీడీ: నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున ప్రధాన పాత్రలో పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రాజు గారి గది-2'. ఈ సినిమాకు ఓంకార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో సమంత, సీరత్ కపూర్, వెన్నెలకిషోర్, అశ్విన్ కీలకపాత్రల్లో న‌టించారు.

'రాజుగారి గ‌ది-2' సినిమా రేపు(అక్టోబర్ 13) విడుద‌ల కానున్న నేప‌థ్యంలో గురువారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో నాగార్జున మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాగార్జున జోకులు వేస్తూ మాట్లాడుతుంటే కోడలు సమంత, చిత్ర యూనిట్, మీడియా వారు పడీ పడీ నవ్వారు.


 సినిమా బావుందనగానే వచ్చారు

సినిమా బావుందనగానే వచ్చారు

నాగార్జున మాట్లాడుతూ... ఈ సినిమా బాగుంది అనగానే న‌టీన‌టులు అంద‌రూ నాతో పాటు వచ్చి కూర్చున్నారు. చిన్న చిన్న మాటలతో చక్కగా చెప్పిన అబ్బూరి రవి, హార్ట్ నుండి మైండ్ కి కనెక్ట్ అయిన తమన్, రెండు స్టేట్స్ లో అందరినీ ఆడించే సీరత్ కపూర్, ఎప్పుడూ నవ్వుతూ ఉండే పీవీపీ, సీరత్ కపూర్‌ను హగ్ చేసేందుకు ఫస్ట్ చాన్స్ ఇచ్చిన ప్రవీణ్, ఆయన డేట్స్ ఇస్తే మేము షూటింగుకు వెళ్లిన వెన్నెల కిషోర్, అన్నయ్య పాపం ప్లీస్ అని అడిగితే ఒప్పుకున్న అశ్విన్, క్లైమాక్స్‌లో నాకంటే బాగా చేసిన కోడలు సమంత ఇలా అందరూ సినిమా బావుంది అనగానే... నాతో పాటు ఈ ప్రెస్ మీట్ కు వచ్చారు అని నాగార్జున చమత్కరించారు.


హిట్టవ్వకపోతే నేను, సమంత మొహం చూసుకోలేం

హిట్టవ్వకపోతే నేను, సమంత మొహం చూసుకోలేం

ఈ సినిమా తనకు చాలా స్పెష‌ల్ అని, ఇది హిట్టవ్వకపోతే సమంత, నేను ఒకరి మొహం ఒకరు చూసుకోలేమని నాగార్జున అన్నారు. ఎందుకంటే అక్టోబ‌ర్ 6న స‌మంత‌, చైతూ పెళ్ల‌యింది, పెళ్లయిన తర్వాత కోడలు హిట్టు తీసుకొచ్చింది నా ఇంటికి అని చెప్పుకునేలా ఉండాలి. ఇది వెరీ ఇంపార్టెంట్... అని నాగార్జున అన్నారు.


పెళ్లయ్యాక ప్లాప్ వచ్చింది అనే పేరు రావొద్దు

పెళ్లయ్యాక ప్లాప్ వచ్చింది అనే పేరు రావొద్దు

ఎప్పుడూ లేని టెన్షన్ ఈ సినిమా విషయంలో ఉంది. ఈ సినిమా హిట్ అవ్వాలి, లేక పోతే కష్టం... ఎందుకంటే ఫ్యామిలీలో ఎప్పుడూ చక్కగా నవ్వుకుంటూ ఉంటాం. ఎంతో కాలం చెప్పుకునేలా ఈ సినిమా ఉండాలి. పెళ్లయ్యాక ప్లాప్ వచ్చింది అని చెప్పుకోకుండా ఉండాలి అని నాగార్జున ఆకాంక్షించారు.


 ఆడియో ఫంక్షన్ లేదు

ఆడియో ఫంక్షన్ లేదు

ఈ సినిమాకు ఆడియో ఫంక్షన్ నిర్వహించడం లేదు. ప్రతిసారి ఆడియో ఫంక్షన్ చేస్తున్నాం, హిట్టుకొడుతున్నాం అని చెప్పేవాళ్లం. ఈ సినిమాకు అలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా బావుంది, హిట్టవుతుందనే నమ్మకం ఉంది అని నాగార్జున తెలిపారు.


డైరెక్టర్ పెద్ద ఓసీడీ, అందరినీ చంపాడు

డైరెక్టర్ పెద్ద ఓసీడీ, అందరినీ చంపాడు

మా డైరెక్టర్ ఓంకార్‌కి చిన్న ప్రాబ్లం ఉందని, ఓసీడీ అనే డిజార్డర్ ఉంది. ఆ ఓసీడీ వల్ల సినిమా మీద విపరీతమైన ప్రేమ. అది కరెక్టుగా వచ్చే వరకు మా అందరినీ చంపాడు, ఆల్రెడీ అంద‌రూ దెయ్య‌ల‌యిపోయారని... నాగార్జున వ్యాఖ్యానించారు.


చిరాకు పడ్డా, నీ సినిమాకో దండం అని వెళ్లిపోయాను

చిరాకు పడ్డా, నీ సినిమాకో దండం అని వెళ్లిపోయాను

సాధారణంగా నేను చిరాకు పడను, నేను కూడా లాస్ట్ డే చిరాకు పడిపోయి నీకు, నీ సినిమాకో దండం... అని చెప్పి సినిమా అయిపోయింది అని చాలా హ్యాపీగా వెళ్లిపోయాను. అంతలా మమ్మల్ని సినిమా పెర్ఫెక్షన్ కోసం హింసించాడు అని నాగార్జున చమత్కరించారు.


ఓంకార్ శ్రమకు ఫలితం దక్కుతుంది

ఓంకార్ శ్రమకు ఫలితం దక్కుతుంది

రేపు సినిమా విడుదలైన తర్వాత ఓంకార్ ప‌డిన క‌ష్టానికి, త‌పనకి, శ్ర‌మ‌కి ఫ‌లితం వ‌స్తుంద‌ని నాగార్జున నమ్మకంగా చెప్పారు.


సమంత, చైతు డేట్స్ అడుగుతున్నా

సమంత, చైతు డేట్స్ అడుగుతున్నా

సమంత, చైతు రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించాలని ఉంది. నేను కూడా వాళ్ల డేట్స్ అడుగుతున్నాను... కానీ వాళ్లే ఇవ్వడం లేదు అని నాగార్జున ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.


బెస్ట్ ఫ్రెండును పెళ్లాడాను

బెస్ట్ ఫ్రెండును పెళ్లాడాను

నాగ చైతన్యతో తనకు 8 సంవత్సరాల ప్రెండ్షిప్ ఉందని, తన జీవితంలోని బెస్ట్ ఫ్రెండును పెళ్లాడటం ఆనందంగా ఉందని సమంత తెలిపారు.
English summary
Raju Gari Gadhi 2 press meet held at Hyderabad. Raju Gari Gadhi - 2 is a 2017 Telugu Horror comedy film, produced by Prasad V Potluri under PVP Cinema, Matinee Entertainments banner and OAK Entertainments. It is directed by Ohmkar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu