»   » నాగార్జు, సమంత.... ‘రాజుగారి గది 2’ ట్రైలర్ రిలీజైంది

నాగార్జు, సమంత.... ‘రాజుగారి గది 2’ ట్రైలర్ రిలీజైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu
Raju Gari Gadhi 2 Trailer సినిమాపై అంచనాలు పెంచిన ట్రైలర్

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ 'రాజు గారి గ‌ది 2'. పి.వి.పి సినిమా, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రై.లి, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి.

లెజెండరీ యాక్టర్, దివంగత అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా నేడు(సెప్టెంబర్ 20) ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అక్టోబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున

మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున

ఈ చిత్రంలో నాగార్జున మెంటలిస్టు పాత్రలో కనిపించబోతున్నారు. తన పాత్ర గురించి నాగార్జున మాట్లాడుతూ.... ఇందులో మెంటలిస్టు పాత్ర చేస్తున్నాను. రియల్‌ లైఫ్‌లో అలాంటివారిని ఇద్దరు, ముగ్గుర్ని కలిశాను. వాళ్ళకి ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్స్‌ ఉంటాయి. మీ మనసులో వున్నది ఈజీగా కనిపెట్టేస్తారు. నిజంగా చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది.

దెయ్యం పాత్రలో సమంత

దెయ్యం పాత్రలో సమంత

ఈ చిత్రంలో సమంత దెయ్యం పాత్రలో కనిపించబోతోంది. త్వరలో నాగార్జున కోడలు కాబోతున్న సమంత.... నాగార్జునతో కలిసి ‘మనం' తర్వాత చేస్తున్న సినిమా ఇదే.

ట్రైలర్ అదుర్స్

ట్రైలర్ అదుర్స్

రాజుగారి గది 2 ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. నాగార్జున, సమంత లాంటి వారు ఇందులో ఉండటంతో సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు.

రాజుగారి గది 2

నాగార్జున‌, వెన్నెల కిషోర్, అశ్విన్ బాబు, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ - దివాక‌ర‌న్, మ్యూజిక్ - త‌మ‌న్, ఆర్ట్ - ఎ.ఎస్.ప్ర‌కాష్, డైలాగ్స్ - అబ్బూరి ర‌వి, నిర్మాత - పి.వి.పి, ద‌ర్శ‌క‌త్వం - ఓంకార్.

English summary
Raju Gari Gadhi 2 Theatrical Trailer released. #RajuGariGadhi2 latest 2017 Telugu movie ft. Akkineni Nagarjuna, Samantha, Seerat Kapoor and Ashwin Babu. The sequel for the 2015 Telugu movie Raju Gari Gadhi is directed by Ohmkar. Thaman S composed Music for #RGG2. #RGG2Movie is jointly produced by PVP Cinema and Matinee Entertainment, in association with OAK Entertainments. The movie also features Rao Ramesh, Vennela Kishore, Praveen and Shakalaka Shankar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu