»   » రాజుగారి గది 2 పబ్లిక్ రివ్యు: కామెడీ విత్ పెర్ఫార్మెన్స్, నాగ్, సమంతాలకి ఫుల్ మార్క్స్

రాజుగారి గది 2 పబ్లిక్ రివ్యు: కామెడీ విత్ పెర్ఫార్మెన్స్, నాగ్, సమంతాలకి ఫుల్ మార్క్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Raju Gari Gadhi 2 Movie Public Review : A Must Watch Movie For This Weekend - Filmibeat Telugu

రాజుగారి గది కొన్నాళ్ళ వరకూ మామూలుగానే ఉన్న ఈ సినిమా హైప్ మూడువారాల్లో బాగానే పెరిగింది. నాగార్జున ఓమ్‌కార్ డైరెక్షన్ లో చేయటం ఒక సంగతైతే. నాగ చైతన్యతో పెళ్ళి తర్వాత విడుదల అవుతున్న సమంతా తొలి చిత్రం ఇదే కావటం కూడా ఒక కారణం అనే అనుకోవాలి. మొత్తానికి రాజుగారు ఈ సారి కూడా మంచి మార్కులే వేయించుకున్నట్టున్నారు. నాగ్, సమంతాల నటనకి ఫుల్ మార్క్స్ వేస్తున్నారు ఆడియన్స్.

 ఆత్మ చుట్టూ సినిమా

ఆత్మ చుట్టూ సినిమా

సినిమా మొత్తం కథ ఒక ఆత్మ చుట్టూ తిరుగుతుంది. ఆ ఇంట్లోకి నలుగురు ఫ్రెండ్స్ వెళతారు, రోజూ రాత్రి కాగానే రకరకాల శబ్దాలతో ఇళ్ళంతా భయంకరంగా అయిపోతూంటుంది. దీంతో మానసిక వైద్యుడైన నాగార్జునని పిలిపిస్తారు, ఆ ఇంటిని చూసిన నాగ్ ఆ ఇంట్లో ఆత్మ ఉందని చెప్తాడు.

 సమంత ఆత్మ గా ఎందుకు అయ్యింది..?

సమంత ఆత్మ గా ఎందుకు అయ్యింది..?

ఆ ఆత్మని బయటకి పంపేందుకు నాగార్జున ప్రయత్నిస్తూంటాడు, అయితే అసలు ఆ ఆత్మ ఆ ఇంత్లో ఎందుకు ఉందీ? ఆ ఆత్మ బయటకు వెళ్ళిపోతుందా, అసలు ఈ పాత్ర ని సమంతా అంతైష్టంగా ఎందుకు చేసిందీ అన్న ప్రశ్నలకు సమాధానాలు తెరమీద చూడాల్సిందే. ఈ లైన్ ఆకట్టుకోవటం తో పాటు గా నటీనటుల పర్ఫార్మెన్స్ పరిధులు దాటకుండా ఆకట్టుకుందనే టాక్ వినిపిస్తోంది.


నాగ్ మానసిక వైద్యుడిగా

నాగ్ మానసిక వైద్యుడిగా

ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రేక్షకుల అభిప్రాయాలు ఇవీ... చంద్రముఖి, నాగవళ్ళి తర్వాత అదే ప్రభావం, అవే పోలికలతో ఉంటుందనుకున్న పాత్రని నాగ్ తనదైన స్టైల్లో చేసి సరిగ్గానే ఆకట్టుకున్నాడని చాలామంది చెప్పిన మాట. నాగ్ మానసిక వైద్యుడిగా అదరగొట్టాడు.


 కావాల్సినంత కామెడీ

కావాల్సినంత కామెడీ

ఇక కావాల్సినంత కామెడీతో వెన్నెలకిషోర్, అశ్విన్, షకలక శంకర్ ల కామెడీ బాగుంది. నిజానికి పార్ట్ వన్ లోనూ షకలక శంకర్ కామెడీ మంచి పేరేతెచ్చింది. అయితే ఓంకార్ డైరెక్షన్ ఆకట్టుకున్నా రాజాగారి గది పార్ట్ వన్ లోని సీన్లనే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసినట్టుగా ఉంది. ఆ ఛాయలు చాల వరకు కనిపించాయి.


సీరత్ కపూర్

సీరత్ కపూర్

ఇక సినిమాకే హాట్ ఫేవరెట్ సమంతా ఆత్మగా నటించటాన్ని సవాల్ గా తీసుకున్నట్టు నటించి తనవరకూ బాగానే ఆకట్టుకుంది. ఊహించినట్టే సీరత్ కపూర్ గ్లామర్తో కేపరిమితం అయినా తన అందచందాలతో యూత్ ను ఫిదా చేసింది. ఓవరాల్ గా చూస్తే మంచి నిర్మాణ విలువలతో వచ్చిన రాజు గారి గది సినిమా అంతా కామెడీ, పెర్ఫార్మెన్స్ తో బాగానే ఆకట్టుకుమంటుందని ఇప్పటివరకూ వచ్చిన టాక్.


English summary
Nagarjuna, Samantha LatesT Movie Rajugari Gadi 2 Directed by Omkar Released Today, here is the Public Talk .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu