twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా శవాన్ని కూడా తాకనివ్వద్దు: శేఖర్ మాస్టర్ మీద గురువు రాకేష్ మాస్టర్ సంచలనం!

    By Bojja Kumar
    |

    రాకేష్ మాస్టర్... తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని డాన్స్ మాస్టర్. స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన ఆయన ఎంతో మందికి విద్య నేర్పించి సినీ ఇండస్ట్రీలోకి దారి చూపించారు. అలా ఆయన వద్ద శిష్యరికం చేసి, విద్య నేర్చుకుని వచ్చిన వారిలో శేఖర్ మాస్టర్ టాప్ పొజిషన్ కు వెళ్లారు.

    రాకేష్ మాస్టర్ తన ప్రియ శిష్యుల్లో మొదటి స్థానం శేఖర్ మాస్టర్‌కే ఇవ్వడం కాకుండా.... తన సొంత బిడ్డలా చూసుకున్నారు. అలా సొంత బిడ్డలా చూసుకున్న వ్యక్తిపైనే రాకేష్ మాస్టర్ తాజాగా పలు సంచలన కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. నేను చనిపోతే నా శవాన్ని కూడా శేఖర్ గాడిని తాకనివ్వద్దు అని అన్నారు. రాకేష్ మాస్టర్.... శేఖర్ మాస్టర్ గురించి ఇలా ఎందుకు అన్నారో ఓసారి చూద్దాం.

    శేఖర్ కోసం నా భార్యను వదులుకున్నా

    శేఖర్ కోసం నా భార్యను వదులుకున్నా

    నేను తిరుపతిలో ఇనిస్టిట్యూట్ పెట్టినపుడు శేఖర్ నా వద్ద జాయిన్ అయ్యాడు. నాకు చాలా దగ్గరయ్యాడు. వాడు ఉండగానే నా పెళ్లి జరిగింది. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నా శిష్యులను కమాండ్ చేయడం మొదలు పెట్టింది. నేను వారికి తిండి పెట్టడం సహించేది కాదు. ఎంత చెప్పినా మారకపోవడంతో ఓసారి కొట్టాను. వీరంతా నా శిష్యులు, మన బిడ్డలు... వారు నా వద్ద కాకుండా ఎక్కడ తింటారు? అని చెప్పడంతో మాట మాట పెరిగింది. నీకు శేఖర్ కావాలా? నేను కావాలా? శేఖర్ ను వదిలేస్తేనే నీతో ఉంటాను అని చెప్పింది. వాడూ నా బిడ్డే ఎలా వదిలేస్తాను? నువ్వన్నా వెళ్లిపో కానీ నేను శేఖర్ ను వదిలిపెట్టను అని చెప్పాను. తను వెళ్లిపోయి వేరే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నేను కూడా మరో పెళ్లి చేసుకున్నాను..... అని రాకేష్ మాస్టర్ వెల్లడించారు.

    శేఖర్ ఆ మాట అనడంతో బాధ పడ్డాను

    శేఖర్ ఆ మాట అనడంతో బాధ పడ్డాను

    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాట్లాడుతూ..... రాకేష్ మాస్టర్ వల్లే మీరు ఈ స్థాయికి వచ్చారట కదా? అనే ప్రశ్నకు వెటకారంగా ఓ నవ్వు నవ్వాడు. అది నాకు బాగా గుచ్చుకుంది. వాడు ఆ మాట అనడంతో బాధ పడ్డాను అని రాకేష్ మాస్టర్ తెలిపారు.

    ఏరు దాటితే తెప్ప తగలేసే రకం

    ఏరు దాటితే తెప్ప తగలేసే రకం

    శేఖర్ నా దగ్గర ఉన్నపుడు ఓసారి వాళ్ల అమ్మ వచ్చి గొడవ చేసింది. నా కొడుకును నాశనం చేశావు, మందు పెట్టేశావ్ అంటూ బియ్యం తీసి నెత్తిన పోసుకుని నానా రచ్చ చేసింది. అపుడు నేను ఒకటే మాట అన్నాను.... ఇన్నాళ్లు ఇక్కడ ఉన్నాడు, తిన్నాడా? తినలేదా? ఏ రోజన్నా పట్టించుకున్నావా? అని అడిగాను. అప్పటికీ నువ్వు వెళ్లరా అన్నాను. కానీ నేను వెళ్లను సార్, మీ దగ్గరే ఉంటాను అని శేఖర్ అన్నాడు. వాడికి పెళ్లయ్యే వరకు, వాడిని మాస్టర్ చేసే వరకు తోడుగానే ఉన్నాను. కానీ వాడు ప్రభుదేవా మాస్టర్‌కు ఏక లవ్య శిష్యుడిని నేను అంటూ.... ఏరు దాటాక తెప్ప తగలేసే మాటలు అనే సరికి కాస్త బాధ అనిపించింది అని రాకేష్ మాస్టర్ తెలిపారు.

    బోరబండలో ఇడ్లీలు అమ్మిన ఆమె, ఆ మాట అంటే బాధేసింది

    బోరబండలో ఇడ్లీలు అమ్మిన ఆమె, ఆ మాట అంటే బాధేసింది

    ఆ మధ్య ఓసారి శేఖర్ కూతురు సాహితి పుట్టినరోజు జరిగింది. ఇనిస్టిట్యూట్ కుర్రాడొకడు అక్కడికి వెళ్లి వస్తే తెలిసింది. నేను శేఖర్ కు మూడు సార్లు ఫోన్ చేసినా తీయలేదు. మళ్లీ ఫోన్ చేస్తే వాళ్ల వైఫ్ ఎత్తింది. ఏంటమ్మా... బిడ్డ పుట్టినరోజుకు కూడా చెప్పలేదు అని అడిగాను. ఏంటి మీకు చెప్పాలా మేమంతా? అని ఆమె అనడంతో చాలా బాధేసింది. శేఖర్‌ను పెళ్లాడటానికి ముందు ఆమె బోరబండలో ఇడ్లీలు అమ్మేది. నేను దగ్గరుండి పెళ్లి చేయించాను. అపుడు నా వద్ద తలెత్తి కూడా మాట్లాడేది కాదు...అలాంటి అమ్మాయి నన్ను అలా అనడంతో చాలా బాధేసింది అని రాకేష్ మాస్టర్ తెలిపారు.

    నా అక్క కూతురును శేఖర్‌కు ఇవ్వమన్నా

    నా అక్క కూతురును శేఖర్‌కు ఇవ్వమన్నా

    శేఖర్ అంటే నాకు ప్రాణం అని మా ఇంట్లో కూడా తెలుసు. మా అక్క కూతురును నాకు ఇస్తానంటే వద్దమ్మా... నేను మందు తాగుతాను, శేఖర్‌కు కరెక్ట్ జోడి అని చెప్పాను అంటే వాడిని ఎంత ప్రేమించానో అర్థం చేసుకోండి... అని రాకేష్ మాస్టర్ తెలిపారు.

    నాన్న చనిపోయే పరిస్థితిలో ఉంటే రాలేదు

    నాన్న చనిపోయే పరిస్థితిలో ఉంటే రాలేదు

    అమ్మ, తమ్ముడు ఆరు నెలల గ్యాపుతో చనిపోయారు. నాకు దెబ్బ మీద దెబ్బ తాకింది. తర్వాత నాన్న హార్ట్ ఎటాక్ వచ్చి ఆసుపత్రిలో ఉన్నారు. నాన్న చూడాలంటున్నాడు రారా అంటే రాలేదు. మా నాన్న 15 రోజుల్లో చనిపోతాడు అనే స్థితిలో గృహ ప్రేవేశం పెట్టుకున్నాడు. నన్ను రమ్మని పిలిచాడు. అది కూడా ఎందుకు పిలిచాడంటే గురువు గారిని పిలవలేదు అని నలుగురు అంటారని పిలిచాడు... అని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

    నేను చనిపోతే నా శవాన్ని కూడా తకనివ్వద్దు

    నేను చనిపోతే నా శవాన్ని కూడా తకనివ్వద్దు

    నేను చనిపోతే నా శవాన్ని కూడా శేఖర్ గాడిని తాకనివ్వద్దు అని చెప్పాను. నేను చనిపోయాక ఎవరెవరు ఎలా యాక్టర్ చేస్తారో ముందే స్క్రీన్ ప్లే రాసి పెట్టాను. నేను చనిపోయాక పెద్ద పూల మాల పట్టుకుని గురువుగారు గురువుగారు అంటూ దొంగయాక్టింగులు చేసుకుంటూ వస్తారు. ఇవన్నీ నాకు నచ్చవు. ఏదైనా ఉంటే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. వాడికి ఇదే తగిన గుణపాఠం..... అని రాకేష్ మాస్టర్ అన్నారు.

    వాడు ఆడోళ్లను చూస్తే సొల్లు కార్చే రకం

    వాడు ఆడోళ్లను చూస్తే సొల్లు కార్చే రకం

    నాకు లైఫ్ ఇచ్చింది వినయ్ అంటూ శేఖర్ ఇటీవల చెప్పడం విన్నాను. వినయ్ అనేవాడు పెద్ద దొంగ. కో డైరెక్టర్. వాడు ఆడోళ్లను చూస్తే సొల్లు కార్చే ఎదవ, వాడి పేరు చెబితే నాకు ఎంత బాధగా ఉంటుంది....అంటూ రాకేష్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

    వాడిలాగా జబర్దస్త్ కి పంపించి బూతులు తిట్టించను

    వాడిలాగా జబర్దస్త్ కి పంపించి బూతులు తిట్టించను

    కొందరు అంటున్నారు మీరు శేఖర్ తో కొంచెం తగ్గండి, మీ కొడుక్కు కూడా లైఫ్ ఇస్తాడు అని.... ఎవ్వడు ఎవడికీ లైఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. శేఖర్ మాస్టర్ లాగా కొడుకు జబర్దస్త్ కు పంపించి బూతులు తిట్టించను, మంచి ఆర్టిస్టును చేస్తాను.... అని రాకేష్ మాస్టర్ తెలిపారు.

    English summary
    Choreographer Rakesh master sensation comments on Shekhar master.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X