For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లక్ష్మీస్ ఎన్టీఆర్‌ తీయడానికి అసలు కారణం అదే.. వర్మ సీక్రెట్ బయటపెట్టిన నిర్మాత

  |

  తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏదైనా సినిమా భారీ స్థాయిలో వివాదాస్పదమైందంటే అది దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మాత్రమే. దీనిపై ఇంత హైప్ క్రియేట్ అవడానికి ఎన్టీఆర్ ఒక కారణం అయితే, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో కారణం. దీనికితోడు ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత నిర్మించడం చర్చనీయాంశం అయింది. అంతేకాదు, ఇందులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును విలన్‌గా చూపించడం వివాదాస్పదమైంది. అందుకే ఈ సినిమాను విడుదల కాకుండా ఆపేందుకు గత ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. ఇన్ని హైలైట్స్ ఉన్నాయి కాబట్టే 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అసలు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎందుకు తెరకెక్కించారు..? దానికి రాంగోపాల్ వర్మనే ఎందుకు డైరెక్టర్‌గా తీసుకున్నారు...? భవిష్యత్‌లో ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు..? అనే విషయాలపై ఆ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి తాజాగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

  మజా ఉంటుందని ఆర్జీవిని కలిశాను

  మజా ఉంటుందని ఆర్జీవిని కలిశాను

  ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్ కావాలనుకుని అప్పటికప్పుడు తీసిన సినిమా కాదు. నాకు చిన్నప్పటి నుంచే సినిమా రంగంపై ఆసక్తి ఉంది. వ్యాపారం చేసే సమయంలోనే సినిమా నిర్మాత అవ్వాలని అనుకున్నాను. నా ఎంట్రీ సాదాసీదాగా ఉంటే ఏం బాగుంటుంది అనుకున్నా. అందుకే మొదటి సినిమాతోనే చరిత్ర సృష్టించాలని భావించా. అందుకే తెలుగును ప్రపంచానికి పరిచయం చేసిన ఎన్టీఆర్ బయోపిక్ తీయాలని అనుకున్నాను. మామూలు డైరెక్టర్ అయితే మజా ఉండదనే కొంత మంది ద్వారా రాంగోపాల్ వర్మను కలిశాను. ఎన్టీఆర్ జీవితంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిద్దాం అని రాకేష్ రెడ్డి అన్నారు.

  సాహో టీజ‌ర్‌పై మ‌నుసు పారేసుకొన్న అనుష్క‌.. ప్ర‌భాస్‌కు ప్ర‌త్యేకంగా

   వర్మకే క్రెడిట్ ఇవ్వాలి

  వర్మకే క్రెడిట్ ఇవ్వాలి

  కొన్ని చర్చల తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ పట్టాలెక్కింది. అంతకుముందు ఎంతో మందిని సంప్రదించాం. ఎందరినో కలిసి వాస్తవాలను రాబట్టేందుకు ప్రయత్నించాం. మేము చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అందుకే ఇందులో కల్పితాన్ని జోడించకుండా వాస్తవాలను చూపించగలిగాం. అందుకు మా సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. దీనికి వర్మగారికే క్రెడిట్ ఇవ్వాలి అని రాకేష్ రెడ్డి అన్నారు.

  త్వరలో కేసీఆర్, జయలలిత బయోపిక్

  త్వరలో కేసీఆర్, జయలలిత బయోపిక్

  సినిమా పట్ల వర్మ డెడికేషన్ సూపర్బ్. నిర్మాతలతో మెలిగే విధానం కూడా బాగుంటుంది. ఈ కారణంగానే త్వరలోనే మా కాంబినేషన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రలు తీయబోతున్నాం. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం'' అని రాకేష్ రెడ్డి చెప్పుకొచ్చారు.

  నిర్మాత రాకేష్ రెడ్డి గురించి

  నిర్మాత రాకేష్ రెడ్డి గురించి

  రాకేష్ రెడ్డి విషయానికొస్తే.. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ఆయన వైసీపీలో క్రీయాశీలకంగా పని చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా పని చేశారు. అయితే, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత జగన్.. రాకేష్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు. దీంతో రాజకీయాలకు తాత్కాలికంగా గుడ్‌బై చెప్పిన ఆయన ఆ తర్వాత సినిమాలపై మక్కువతో నిర్మాణ రంగం వైపు మళ్లారు. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో కలిసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' రూపొందించారు. ఈ సినిమా ఇచ్చిన కిక్కుతో త్వరలోనే మరిన్ని సినిమాలు చేస్తానంటున్నారు.

  English summary
  Lakshmi's NTR movie producer happy over the way he got results thru Cinema. Rakesh reddy reveals secrets behind the movie making. He praised RGV.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X