»   » ఈ దేశం లో సెన్సార్ బోర్డ్ నే తీసేయాలి..నాకే ఏ సర్టిఫికెట్ ఇస్తారా? రెచ్చిపోయిన రాఖీ సావంత్ (ఫొటోలు)

ఈ దేశం లో సెన్సార్ బోర్డ్ నే తీసేయాలి..నాకే ఏ సర్టిఫికెట్ ఇస్తారా? రెచ్చిపోయిన రాఖీ సావంత్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ ఇంకోసారి తీవ్రంగానే ఫైరయ్యింది... ఈ సారి సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మీద విరుచుకు పడింది. సెన్సార్ బోర్డ్ చైర్మన్ నిహ్లానీ నీ తీసేస్తే తాను అక్కడ కూర్చుని "పని" చేస్తాననీ. ఇప్పుడున్నవాళ్ళు డబ్బులు సంపాదించుకోవటం తప్ప చేసే పనేం లేదనీ ఘాటుగానే విమర్షించింది. ఇంతకీ ఎందుకుంత ఫైర్ అయ్యిందీ అంటారా...??

ప్రస్తుతం రాఖీ సావంత్ నటించిన రాఖీ సావంత్ నటించిన మూవీ 'ఏక్ కహానీ జూలీ కీ' అనే మూవీ రిలీజ్ కి రెడీ అయింది. రీసెంట్ గా ఫైనల్ కాపీని సెన్సార్ కి పంపిస్తే.. వాళ్లు ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. మరి రాఖీ సావంత్ మూవీ కి ఏ సర్టిఫికెట్ ఇవ్వక పోతే ఆశ్చర్యం కానీ ఇస్తే కోపమెందుకంటారా..? అనాల్నిపిస్తే ఒక్కసారి రాఖీకి కనిపించేలా అనండి... అప్పుడు తెలుస్తుంది "సెన్సార్ బోర్డ్" అవసరమేమిటో.

చిన్న నిర్మాతలను వేదిస్తున్నారు

చిన్న నిర్మాతలను వేదిస్తున్నారు

అమ్మడికి కోపం రావడానికి రీజన్ ఇదే. 'సెన్సార్ బోర్డ్ ను మూసేయాలి. బడా ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి సొమ్ములు దండుకోవడం తప్ప వాళ్లు ఏం చేయడలేదు. పైగా చిన్న నిర్మాతలను వేధింపులకు గురి చేస్తున్నారు.

హ్లానీని తొలగించాలి

హ్లానీని తొలగించాలి

ని ఛైర్మన్ పదవి నుంచి నిహలానీ తొలగించాలి. అవసరమైతే ఆ ప్లేస్ లో నేను కూర్చుంటాను. అతని కంటే బాగానే పని చేయగలను. మేం సెన్సార్ వాళ్లకు డబ్బులివ్వలేదనే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు' అని కస్సుబుస్సులాడింది రాఖీ సావంత్.

నేనే బాగా పని చేయగలను

నేనే బాగా పని చేయగలను

అక్కడున్నోళ్లు ఏమీ తెలియ‌దు. సెన్సార్ బోర్డు చైర్మన్ పదవి నుంచి నిహ్లానీని తప్పించాలి. ఆయనకు ఏమీ తెలియకుంటే పదవికి రాజీనామా చేయాలి. ఆ స్థానంలో నేను కూర్చుంటాను. ఆయ‌న కంటే సమర్థవంతంగా పనిచేయగలను.

లంచం ఇవ్వనందుకే

లంచం ఇవ్వనందుకే

వాళ్లకు మా నిర్మాత‌లు డబ్బులు ఇవ్వనందుకే ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాలో నేను న‌టించాన‌నే ఇలా చేశారు. నేను బాలీవుడ్ స్టార్ న‌టిని.

ఈ దేశ బిడ్డను.

ఈ దేశ బిడ్డను.

పోర్న్ స్టార్ కాదు. ఈ సినిమాలో అసభ్య దృశ్యాలు లేకున్నా ఎ స‌ర్టిఫికెట్ ఎందుకిచ్చారో చెక‌ప్పాలి. ఈ విషయంపై బాంబే హైకోర్టుకు వెళ్తున్నాం. సెన్సార్ బోర్డుకు గుణ‌పాఠం చెబుతాం'' అని రాఖీ పేర్కొంది.

సన్నీ ని కూడా

సన్నీ ని కూడా

అయితే పనిలిఓ పనిగా తన అవకాశాలను లాగేసుకుంటున్న "సన్నీ లియోన్" ని కూడా ఇక్కడికి లాగిందీ.'నేనేమీ పోర్న్‌స్టార్‌ని కాదు.. నా సినిమాకి ఎ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి, నేను ఈ దేశపు బిడ్డనూ అంటూ సన్నీ లియోన్ ని పరోక్షంగా ఎత్తిపొడిచింది.

ఎక్స్‌పోజింగ్‌ చేసినా

ఎక్స్‌పోజింగ్‌ చేసినా

సన్నీలియోన్‌ వచ్చేశాక.. హీరోయిన్లే ఐటమ్‌ సాంగ్స్‌ చేసేస్తున్నాక.. రాఖీ సావంత్‌కి డిమాండ్‌ అమాంతం పడిపోయింది. పూనమ్‌ పాండే లాంటోళ్ళ పుణ్యమా అని, రాఖీ సావంత్‌ పనిగట్టుకుని ఎక్స్‌పోజింగ్‌ చేసినా పనిలేకుండా పోతోంది.

రేవు పెట్టేసింది

రేవు పెట్టేసింది

రాక రాక ఒక్క అవకాశం వస్తే ఇదికాస్తా సెన్సార్ కత్తెరకు బలైపోతూంటే ఉక్రోషం వచ్చి... అందరీ కలిపి ఒక రేవు పెట్టేసింది.

ఈ దేశపు ఆడబిడ్డని

ఈ దేశపు ఆడబిడ్డని

తమ చిత్రానికి ఇలా ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి కారణం.. తాను నటించడమే అన్నది రాఖీ వాదన. తాను పోర్న్ స్టార్ ని కాదని.. ఈ దేశపు ఆడబిడ్డనని.. ఎలాంటి అసభ్య దృశ్యాలు లేని తమ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఎలా ఇస్తారని నిలదీస్తోంది రాఖీ సావంత్.

సెన్సార్ బోర్డ్ ని తొలగించాలట

సెన్సార్ బోర్డ్ ని తొలగించాలట

ఏక్ కహానీ జూలీ కీ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇవ్వడంపై ఇప్పటికే బాంబ్ హైకోర్టును కూడా అప్రోచ్ అయిన రాఖీ.. దేశంలో సెన్సార్ బోర్డ్ ని తొలగించాలని డిమాండ్ చేస్తోంది.

 ఈ దేశం లో సెన్సార్ బోర్డ్ నే తీసేయాలి..నాకే ఏ సర్టిఫికెట్ ఇస్తారా? రెచ్చిపోయిన రాఖీ సావంత్ (ఫొటోలు)

ఈ దేశం లో సెన్సార్ బోర్డ్ నే తీసేయాలి..నాకే ఏ సర్టిఫికెట్ ఇస్తారా? రెచ్చిపోయిన రాఖీ సావంత్ (ఫొటోలు)

అయితే తనని కించపరచటం లో గానీ, తన విదేశీయతను ఎత్తి చూపినందుకు గానీ సన్నీ తొందర పడి నోరుజారకుండా హుందాగానే ఉంది. మరీ పోయి పోయి రాఖీ నోట్లో నోరుపెట్టటం ఎందుకూ అనుకుందేమో....

నిర్ణయాన్ని మార్చుకునే ఉద్దేశమే లేదట

నిర్ణయాన్ని మార్చుకునే ఉద్దేశమే లేదట

అమ్మడు ఇంతగా ఫైర్ అవుతున్నా సెన్సార్ బోర్డ్ మాత్రం "ఏ" సర్టిఫికెట్ నిర్ణయాన్ని మార్చుకునే ఉద్దేశమే లేదని స్పష్టం చేసేసింది. అసభ్యత విశయం లో ఇప్పటికే సీన్లని తొలగించే హక్కు సెన్సార్ బోర్డ్ కి లేదనీ... కేవలం సర్టిఫికెట్ మాత్రమే ఇవ్వాలనీ గతం లో ముంబై హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే...

English summary
Bollywood item girl-turned actress Rakhi Sawant was spotted in an all infuriated avatar thrashing the censor board after it issued an 'A' certificate for her upcoming movie 'Ek Kahani Julie Ki
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu