»   » నేనేమైనా సల్మాన్‌ఖాన్‌నా? సంఘ సేవకురాలిని.. నన్ను అరెస్ట్ చేసి ఏమీ చేయలేరు.. రాఖీ సావంత్

నేనేమైనా సల్మాన్‌ఖాన్‌నా? సంఘ సేవకురాలిని.. నన్ను అరెస్ట్ చేసి ఏమీ చేయలేరు.. రాఖీ సావంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

గాయకుడు మికా సింగ్‌ను వాల్మికితో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాఖీ సావంత్‌కు చేదు అనుభవం ఎదురైంది. లూధియానా కోర్టు ఆదేశాల మేరకు పంజాబ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్‌కు ముందు ఆ వివాదంపై మీడియాకు రాఖీ సావంత్ వివరణ ఇచ్చింది.

 వాల్మీకిని పోల్చుతూ..

వాల్మీకిని పోల్చుతూ..

వాల్మీకిని పోల్చుతూ మికా సింగ్‌పై కామెంట్ చేసిన విషయం వాస్తవమే. దోపిడి దొంగ నుంచి రుషిగా మారిన వాల్మీకి మాదిరిగానే మికా మారాడు. అది ఒక ఉదాహరణ మాత్రమే. అంతేగాని వాల్మీకిని దూషించడం నా అభిమతం కాదు అని రాఖీ సావంత్ తెలిపింది.

 వారెంట్లు, నోటీసులు రాలేదు..

వారెంట్లు, నోటీసులు రాలేదు..

ఇప్పటివరకు నాకు ఎలాంటి నోటీసులు గానీ, సమన్లు గానీ రాలేదు. వారెంట్ల విషయం, పోలీసులు వస్తున్న వార్త మీడియా ద్వారా నాకు తెలిసింది. నాకు మహారుషి వాల్మీకి అంటే ద్వేషభావం లేదు. వాల్మీకి కుటుంబం అంటే కూడా గౌరవం ఉంది. ఈ విషయంలో నన్ను ప్రత్యేకంగా ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదు అని రాఖీ పేర్కొన్నది.

నన్ను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు.

నన్ను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు.

నన్ను ఎదో విధంగా ఇబ్బంది పెట్టి సాధించడానికి నేను సల్మాన్‌ఖాన్ కాదు. నేను రాఖీ సావంత్‌ను. నాపై నేరారోపణలు చేసే శక్తి ఎవరికీలేదు. సామాజిక సేవకు అకింతమైన, సినిమాల్లో నటించే సాదాసీదా యువతిని నేను అని ఆమె అన్నారు.

నోటీసుల పంపినా నో రెస్పాన్స్

నోటీసుల పంపినా నో రెస్పాన్స్

గతంలో కూడా పలు సందర్బాల్లో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ వివాదంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. తాజాగా వాల్మీకిని పోల్చుతూ గాయకుడు మికా సింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంపై వాల్మికీ కమ్యూనిటీ భగ్గుమన్నది. రాఖీపై వాల్మీకి కమ్యూనిటీ మండిపడుతూ కోర్టులో దావా వేసింది. ఈ వ్యవహారంలో పలుమార్లు కోర్టు నోటీసులు పంపినా న్యాయస్థానానికి హాజరుకాకపోవడంతో రాఖీ సావంత్‌కు లూధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

English summary
Rakhi Sawant gets an arrest warrant for comparing Mika Singh to Valmiki & the actress says that slapping charges against her will not fetch anyone anything as she's not Salman Khan. Rakhi Sawant said that she's not Salman Khan and there's no use of filing charges against her as nobody will gain anything from
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu