»   » అతడిపై సినిమా మొదలైంది: ఆ నీచమైన పనులన్నీ చూపిస్తారా?

అతడిపై సినిమా మొదలైంది: ఆ నీచమైన పనులన్నీ చూపిస్తారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Baba Gurmeet Biopic : Rakhi Sawant to play Honeypreet role నీచమైన పనులన్నీ..

డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ అరెస్టు వ్యవహారం ఇండియాలో సంచలనం అయింది. అత్యాచారాల కేసులో కటకటాల పాలై 20 ఏళ్ల జైలు శిక్షకు గురైన డేరా బాబా అరెస్టు సమయంలో జరిగిన విధ్వంసం, ప్రాణ, ఆస్తి నష్టం అంతా ఇంతా కాదు.

'డేరా సచ్చ సౌధా' అనే ఆధ్యాత్మిక సంస్థ ముసుగులో బాబా ఏలుబడి అవుతూ అతడు చేసిన నీచమైన, దుర్మార్గమైన పనుల విషయం తెలిసి యావత్ దేశ మొత్తం నివ్వెరపోయింది. బాబా మాత్రమే కాదు, సినిమా స్టార్ కూడా అయిన ఈ రామ్ రహీమ్ సింగ్.... జీవితంపై ఇపుడు ఓ సినిమా రాబోతోంది.

రాఖీ సావంత్

రాఖీ సావంత్

డేరా బాబా జీవితం ఆధారంగా బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ సినిమా తీసేందుకు సిద్ధమైంది. ఆమె సోదరుడు రాకేష్ సావంత్ ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

డేరా బాబా పాత్రలో

డేరా బాబా పాత్రలో

డేరా బాబా పాత్రలో సంజయ్ గోరీ నటిస్తుండగా.... అతడి దత్త పుత్తికగా చెప్పబడుతున్న హనీ ప్రీత్ ఇన్సాన్ పాత్రను రాఖీ సావంత్ పోషిస్తోంది. ఈ సినిమాలో కేసు విచారణాధికారిగా ఎజాజ్ ఖాన్ నటిస్తున్నాడు.

షూటింగ్ మొదలైంది

షూటింగ్ మొదలైంది

డేరా బాబా జీవితం ఆధారంగా ఈ సినిమా ఆల్రెడీ మొదలైంది. డేరా బాబా జీవితంలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలతో ఈ సినిమా రాబోతోంది. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసి డిసెంబర్ మూవీ విడుదలయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు.

సినిమా టైటిల్

సినిమా టైటిల్

ఈ సినిమా పేరు 'సినిమా స్కాండల్ అబ్ ఇన్సాఫ్ హోగా'గా నిర్ణయించారు. అయితే ఈ సినిమాలో బాబా చేసిన ఘోరాలు, నీచాలు చూపిస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్ అయింది.

ఆ ఎపిసోడ్ ఉంటుందా?

ఆ ఎపిసోడ్ ఉంటుందా?

డేరా బాబా దత్త పుత్తికగా చెప్పబడుతున్న హనీ ప్రీత్ సింగ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. లోకం దృష్టిలో తండ్రీ కూతుళ్లలా చలామణి అవుతున్న వీరు....... డేరా ఆశ్రమంలో భార్యాభర్తల్లా ఉంటారని, ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్ సినిమాలో ఉంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

English summary
Baba Gurmeet Ram Rahim Singh Biopic Film shooting started. Rakhi Sawant to play Honeypreet role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X