For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్టార్ హీరోను ‘ఐటం బాంబ్’ అంటూ సెక్సీలేడీ కామెంట్!

  By Bojja Kumar
  |

  ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‍పై బి-టౌన్ సెక్స్ బాంబ్ రాఖీసావంత్ సంచనలన వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ ఖాన్ ఐటం బాంబ్ అంటూ కామెంట్స్ చేసింది. ఇటీవల మీడియా వారు ఆమె పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చిన సందర్భంలో రాఖీ సావంత్ ఈ వ్యాఖ్యలు చేసింది.

  తన పెళ్లి గురించి రాఖీ సావంత్ మాట్లాడుతూ...2014లో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం తనకు సరిపోయే మిస్టర్ పర్‌ఫెక్ట్ కోసం వెతుకుతున్నట్లు రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో బాలీవుడ్ బ్రహ్మచారి సల్మాన్ ఖాన్ ప్రస్తావన తెస్తూ, 'సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న రోజే నేను పెళ్లి చేసుకుంటాను. అయితే ఒకే వేదికపై మాత్రం కాదు. ఎందుకంటే రెండు ఐటం బాంబులు ఒకే సమయంలో పేలవు, పేలినా తట్టుకోవడం కష్టం' అంటూ ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది రాఖీ.

  వివాదాలతో సావాసం చేయడం రాఖీ సావంత్‌కు కొత్తేమీ కాదు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగించే రకం. ఐటం సాంగులు, శృతి మించిన ఎక్స్ ఫోజింగుతో పాపులర్ అయిన రాఖీ...తన పేరు తరచూ మీడియాలో మార్మోగేందుకు స్టార్ సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని కామెంట్స్ చేస్తుండటం గతంలో చాలా సార్లు చూశాం. రజనీకాంత్ నా డ్రీమ్ మ్యాన్. ఆయన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ స్పా సెంటర్‌ను ఓపెన్ చేసేందుకు ఆ మధ్య హైదరాబాద్ వచ్చిన రాఖీ...రామ్ చరణ్‌ పేరును తన పబ్లిసిటీ కోసం వాడేసుకుంది. ఓపెనింగ్ సందర్భంగా....మీరు సౌత్‌‌లో ఎక్కువగా లవ్ చేసే మగాడు ఎవరు? అని మీడియా వారు ప్రశ్నించగా....చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అంటూ సమాధానం ఇచ్చింది రాఖీ.

  రాఖీ సావంత్ గురించిన మరిన్నివిషయాలు తెలుసుకుంటూ హాట్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

  రాఖీ సావంత్ సావంత్ నీరు బేడ-జయ బేడల సంతానం. జయ వర్లీ పోలీస్ స్టేషన్లో పని చేసే సావంత్ అనే కానిస్టేబుల్ ని రెండో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి జయ తన పిల్లల పేరు చివరన సావంత్ అని చేర్చడం జరిగింది. అలా రాఖీ పేరు రాఖీ సావంత్ అయింది.

  రాఖీ తన చిన్న తనంలో గోక్లీభాయ్ పాఠశాలలో చదువుకుంది. ఆ తర్వాత మిథిభాయ్ కాలేజీలో చదివి ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ పట్టా పొందింది. మాజీ దర్శకురాలు ఉషా సావంత్‌కు రాఖీ సావంత్ సోదరి.

  1997లో రాఖీ సావంత్ వెండితెర ఆరంగ్రేటం చేసింది. అనేక చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.

  2003లో హిందీ మూవీ ‘చురాలియా హమ్ తుమ్నే' చిత్రం కోసం ఆడిషన్స్ జరుగగా హాజరైంది. ఈచిత్రంలో ఎంపికయి మొహాబ్బత్ హై మిర్చి అనే సాంగులో ఐటం గర్ల్ గా చేసింది.

  ఆ తర్వాత పలు సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలు చేసింది. ఆమె నటించిన సినిమాల్లో మస్తీ, మై హూ నా లాంటి చిత్రాలు కూడా ఉన్నాయి.

  రాఖీ సావంత్ చిన్ననాటి ఫోటో

  ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన రాఖీ సావంత్ ఐటం బాంబుగా ఎదిగింది.

  2006లో గాయకుడు మికాసింగ్ రాఖీ సావంత్ ను బలవంతంగా ఆమె పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. అప్పుట్లో ఇదో పెద్ద కాంట్రవర్సీగా మారి పోయింది. ఈ వివాదం రాఖీ సావంత్‌కు రియాల్టీ షో అవకాశాలను తెచ్చి పెట్టింది.

  తల్లి జయాసావంత్‌తో రాఖీ సావంత్

  2009లో ప్రసారమైన ‘రాఖీకా స్వయంవర్' టీవీ కార్యక్రమం తర్వాత ఏలేష్ పరుజన్‌వాలాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన రాఖీ సావంత్ ఆ తర్వాత అతనికి హ్యాండ్ ఇచ్చింది.

  English summary
  While talking about marriage and her favourite actor Salman Khan, the 'eternal' dramebaaz Rakhi Sawant referred to herself and Salman Khan as 'Item Bombs'. When the media recently broached the topic of marriage, Rakhi Sawant said that she will most probably get married by 2014. However, she has still to find her 'Mr. Perfect'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X