»   » నిర్మాతతో చీకటి సాన్నిహిత్యంతోనే ఆ చాన్సు.... తనకు చాన్స్ రాలేదని తోటి నటిపై ఇలా

నిర్మాతతో చీకటి సాన్నిహిత్యంతోనే ఆ చాన్సు.... తనకు చాన్స్ రాలేదని తోటి నటిపై ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సన్నీ ని చూసి ఏడ్చేవాళ్లలో మొదటి స్థానం లో ఉండే రాఖీ సావంత్ మాత్రం మరోసారి తన అక్కసు వెళ్ళగక్కింది.రాఖీ సావంత్‌ కి సన్నీ లియోన్ అంటే కడుపుమంట. తన అవకాశాల్ని సన్నీ నాశనం చేసిందని తెగ ఫీలైపొతుంటుంది రాఖీ సావంత్‌. వీలు కుదిరినప్పుడల్లా సన్నీపై దుమ్మెత్తిపోస్తుంటుందామె. ఇప్పుడు మరోసారి సన్నీ లియోనీపై విరుచుకుపడింది రాఖి. రయీస్‌ చిత్రంలో సన్నీలియోన్ ఓ ఐటెం సాంగ్ లో షారుక్‌తో ఆడిపాడిన సంగతి తెలిసింది. షారుక్ తో సన్నీకి అవకాశం రావడంపై రగిలిపోయింది రాఖి.

" తనను సూపర్‌స్టార్‌ షారుక్‌ 'మై హూ నా' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అది నా ట్యాలెంట్ చూసి. ఇప్పుడు రయీస్‌లో సన్నీకి వచ్చిన అవకాశం ఆమె తెచ్చుకున్నది కాదు. రయీస్‌ నిర్మాతకి సన్నీకి మధ్య ఉన్న చీకటి సాన్నిహిత్యమే ఆమెకు ఆ అవకాశం తెచ్చిపెట్టింది" అని కామెంట్ చేసింది రాఖి. అంతేకాదు.. సన్నీ లియోన్ టైం అయిపోయిందని, తనకు వచ్చిందల్లా పోర్న్‌ సినిమాల్లో నటించడమేనని, ఇక ఆ సినిమాలే చేసుకోవాలని అక్కసు వెల్లగక్కింది రాఖి.

Rakhi Sawant’s Shocking Reaction on Sunny Leone’s Item Song In Raees

షారూక్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాయిస్. రాహుల్ దులాకియా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సన్నీలియోన్ కూడా నటిస్తోంది. మొదటి నుంచి కూడా సన్నీలియోన్ బాలీవుడ్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్రకథానాయకుడైన షారుఖ్ తో కలిసి నటించే అవకాశం దక్కుతుందో లేదోననే సందేహం ఆమెను వెంటాడుతూనే వుందట.

తన అభిమాన నటుడితో కలిసి నటించే ఆ ఛాన్స్ కోసం ఆమె చాలాకాలంగా ఎదురుచూస్తోంది. అలాంటి ఛాన్స్ ఆమెకి 'రయీస్' ద్వారా లభించింది. ఈ సినిమా షూటింగ్ లో మొదటిరోజున సెట్లో షారుఖ్ ను చూసి, తన కళ్లను తానే నమ్మలేకపోయిందట. తనని తాను గిల్లి చూసుకుని, తన కల నిజమైందంటూ సంతోషంతో పొంగిపోయిందట. ఈ చిత్రంలో సన్నీలియోన్ చేసిన లైలా ఓ లైలా సాంగ్‌ను యూట్యూబ్‌లో డిసెంబర్ 21న విడుదల చేశారు. 1980లో వచ్చిన ఖుర్బానీ చిత్రంలోని ఈ పాటను రాయిస్‌లో రీమిక్ చేశారు. ఈ పాటలో సన్నీలియోన్ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. పాటను అప్‌లోడ్ చేసిన 14గంటల్లోనే 52లక్షలకు పైగా అంటే 5మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టి యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్ చేసింది.

సన్నీలియోన్‌కు ఉన్న ఫాలోయింగ్‌ ఏంటో ఈ వ్యూస్‌తో మరోసారి రుజువైందని సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. పాటకే ఈ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తే... ఇక సినిమాకు థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం ఖాయమని షారూక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సన్నీలియోన్ గతంలో చాలాసార్లు షారూక్ ఖాన్‌తో నటించడం తన కల అని చెప్పింది. ఈ సినిమాతో ఆమె కల నిజమైంది. సన్నీలియోన్ 2016లో కూడా గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ పర్సన్‌గా నిలవడం విశేషం. ఫేస్‌బుక్‌లో దాదాపు 2కోట్లకు పైగా ఆమె పేజ్‌ను లైక్ చేశారంటే సన్నీకున్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

English summary
Rakhi spews poison at Sunny Leone, taking a jibe at her past life as a porn star when asked for her reaction over Sunny bagging an item song in Shah Rukh Khan’s ‘Raees’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu