»   »  నా ఫ్యామిలీ మెంబర్సే చూడనన్నారు: జగపతిబాబు

నా ఫ్యామిలీ మెంబర్సే చూడనన్నారు: జగపతిబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Raksha
మీ కెప్పుడైనా చేతబడి జరిగిందా? వంటి ఆసక్తికరమైన ప్రకటనలతో రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో "రక్ష" సినిమా రెండు వారాల క్రితం రిలీజయ్యింది. అయితే ఈ సినిమా ఫ్యామిలీ సినిమా కాదని...చాలా మంది ఆ అటు వైపు కి వెళ్ళటానికి జంకుతున్నారు. అలాగే ఈ చిత్రం యూత్ ని సైతం భయపెట్టకపోవటంతో ఆ వారు ఆశించే థ్రిల్ లేదని వారూ నిరాశ చెబుతున్నారు. ఈ నేపద్యంలో జగపతిబాబు ఈ సినిమా ప్రమోషన్ కోసం చెప్తున్న మాటలు,ఇంటర్వూలు,లైవ్ టెలికాస్ట్ లు ఆసక్తి రేపుతున్నాయి.

ఈ చిత్రంలో జగపతిబాబు "రక్ష" పాత్రధారికి తండ్రిగా నటించారు. ఆయన రక్ష సినిమా గురించి మాట్లాడుతూ... మొదట్లో ఈ కథ విన్నప్పుడు ఇటువంటి పాత్ర చేయడం అవసరమా? అనిపించిందన్నారు. ఆ తర్వాత కథలోని మెసేజ్ చూశాక ఓకే చెప్పానని వెల్లడించారు.

మంగళవారమే ఈ సినిమాను థియేటర్‌లో చూశానని, తన ఫ్యామిలీని కూడా తీసుకెళ్లానని చెప్పారు. మొదట్లో మేం ఆ సినిమా చూడనని తమ ఫ్యామిలి మెంబర్స్ చెప్పారని, సినిమా చూశాక, పబ్లిసిటీ ఇచ్చినంత భయమేమీలేదన్నారని జగపతి బాబు తెలిపారు. ఫ్యామిలితో చూడదగ్గ సినిమానేనని, చెడ్డ సినిమా కాదని ఆయన కుటుంబీకులు అన్నట్లు వెల్లడించారు.

బుధవారం పేపర్ చదివానని, అందులో జనవిజ్ఞాన వేదిక సంస్థ వారు ఇటువంటి చిత్రాలను నిషేధించాలని స్టేట్‌మెంట్ ఇచ్చారని అన్నారు. దీని ద్వారా అందరికీ తాను చెప్పేదలచుకోవడం ఏమిటంటే... ముందు సినిమా చూశాక..., ఏదైనా మాట్లాడటం మంచిదని, చూడకుండా ఏవేవో మాట్లాడటం తగదని జగపతిబాబు హితవు పలికారు.

"పూంక్"ను తెలుగు నేటివిటీకి తగినట్లుగా వంశీకృష్ణ దర్శకత్వంలో తీర్చిదిద్దారు. ఈ చిత్రాన్ని యూత్, మహిళలు ఎక్కువగా ఆదరిస్తున్నారని, హారర్ సినిమా అని పేరుకే గానీ.. ఇందులో ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయని జగపతిబాబు చెబుతున్నారు. నిజమే అనిపిస్తే మీరూ ఓ లుక్కేయండి...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X