»   » దెయ్యానికి దేవుడు స‌హాయం.. ఆసక్తిరేపుతున్న ర‌క్ష‌క‌భ‌టుడు గెటప్‌!

దెయ్యానికి దేవుడు స‌హాయం.. ఆసక్తిరేపుతున్న ర‌క్ష‌క‌భ‌టుడు గెటప్‌!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిత్ర పరిశ్రమలో సినిమా తీస్తున్నామంటే ఠక్కున వినిపించే ప్రశ్న 'హీరో ఎవరు?'. హీరో పేరు చెప్పుకొనే సినిమాను అన్ని రకాలుగా ప్రమోట్ చేస్తుంటారు. కానీ నిర్మాత గురురాజ్, దర్శకుడు వంశీ ఆకెళ్ల కాంబినేషన్‌లో వస్తున్న 'రక్షకభటుడు' చిత్రానిది మాత్రం డిఫరెంట్ స్టయిల్. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయినా హీరో ఎవరో అనే విషయాన్ని చెప్పకుండా గోప్యంగా ఉంచడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

ఏప్రిల్ రెండోవారంలో రక్షకభటుడు

ఏప్రిల్ రెండోవారంలో రక్షకభటుడు

ర‌క్ష‌, జ‌క్క‌న లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత వంశీకృష్ణ ఆకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాను ఏప్రిల్ ద్వితీయార్ధంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను నిర్మాత, దర్శకులు ఇటీవల మీడియాకు వివరించారు.

దయ్యానికి దేవుడు సహాయం

దయ్యానికి దేవుడు సహాయం

‘సాధార‌ణంగా దెయ్యాల‌కు దేవుడంటే భ‌య‌మ‌ని మ‌నం చ‌దువుతుంటాం..సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఓ దెయ్యానికి దేవుడు స‌హాయం చేయ‌డం గురించి తెలుసా..అది తెలుసుకోవాలంటే `ర‌క్ష‌కభ‌టుడు` సినిమా చూడాల్సిందే' అని ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ‌ అన్నారు.

చివరి 15 నిమిషాలు..

చివరి 15 నిమిషాలు..

ఎమోష‌న్స్‌, కామెడి, థ్రిల్లింగ్, స‌స్పెన్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. ఫ‌స్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వ‌ర‌కు సినిమా ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగుతుంది. చివ‌రి ప‌దిహేను నిమిషాలు హృద్యయంగా తెర‌కెక్కించాం. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్‌, మ‌ల్హ‌ర్‌భ‌ట్ జోషి సినిమాటోగ్ర‌ఫీ, డ్రాగ‌న్ ప్ర‌కాష్ యాక్ష‌న్, బ్ర‌హ్మానందం హిలేరియ‌స్ కామెడి, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ప‌నితీరు ఆడియెన్స్ ఎంగేజ్ చేస్తుంది అని వంశీకృష్ణ పేర్కొన్నారు.

సినిమా పోస్టర్ రిలీజ్ తర్వాత..

సినిమా పోస్టర్ రిలీజ్ తర్వాత..

‘ర‌క్ష‌క‌భటుడు సినిమా మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ తర్వాత సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. రీసెంట్‌గా విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తున్నది. అర‌కులోయ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా పోలీస్ స్టేష‌న్‌లో ఏం జ‌రిగింది. అస‌లు ఆంజ‌నేయ‌స్వామికి, ర‌క్ష‌క‌భ‌టుడు అనే టైటిల్‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి? అనే అంశాన్ని ఆస‌క్తిక‌రంగా తెరకెక్కించాం' అని నిర్మాత ఏ గురురాజ్ తెలిపారు.

నిరాటంకంగా ప‌నిచేస్తున్నాం..

నిరాటంకంగా ప‌నిచేస్తున్నాం..

సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌డానికి యూనిట్ అంతా రాత్రి ప‌గ‌లు నిరాటంకంగా ప‌నిచేస్తున్నారు. సినిమాలో గ్రాఫిక్స్ వ‌ర్క్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఆది పూర్తైన త‌ర్వాత సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ ద్వితీయార్థంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ‌, నిర్మాత ఎ.గురురాజ్ తెలిపారు.

రిచా పనాయ్ కథా నాయికగా..

రిచా పనాయ్ కథా నాయికగా..

సుఖీభవ మూవీస్‌ పతాకంపై ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎ. గురురాజ్‌ నిర్మాత‌గా రూపొందుతున్న ఫాంట‌సీ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రంలో రిచాపనాయ్, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌ (కాట్రాజు). అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు.

సాధారణంగా

సాధారణంగా

సినిమా విడుదలైతే కానీ రీమేక్ హక్కులకు సంబంధించిన బిజినెస్ జరుగదు. కానీ రక్షకభటుడు చిత్రానికి మాత్రం విడుదలకు ముందే ఫ్యాన్సీ రేటుకు రీమేక్ హక్కులను హిందీ నిర్మాతలు దక్కించుకొన్నారు. హిందీలో ఈ చిత్రం త్వరలో రీమేక్ కానున్నది.

English summary
Rakshakabatudu first look posture creating sensation these days. Police in God Hanuman getup is viral in social media. Richa Panai is the female lead role for this fantacy movie. Director is Akella Vamshi Krishna, Producer is A Giriraj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu