»   » టాక్ ఎలా ఉంది? ‘రాక్షసుడు’ ఆడియన్స్ రివ్యూ...

టాక్ ఎలా ఉంది? ‘రాక్షసుడు’ ఆడియన్స్ రివ్యూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య నటించిన తమిళ మూవీ ‘మాస్' తెలుగులో ‘రాక్షసుడు' పేరుతో గ్రాండ్‌గా విడుదలైంది. సూర్య‌ సరసన న‌య‌న‌తార, ప్ర‌ణీత‌లు జంట‌గా నటించారు. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వహించారు. సూర్య కెరీర్లోనే ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదలైంది. ఇక్కడ రామ్ నటించిన మరో భారీ స్ట్రైట్ తెలుగు సినిమా విడుదలైనప్పటికీ....సూర్య చిత్రం ఎక్కువ థియేటర్లు దక్కించుకోవడం విశేషమే.

మెలోడి మాస్ట‌ర్ యువ‌న్‌శంక‌ర్ రాజా అందించిన పాటలు ఇటీవలే విడుదలై సూపర్ హిట్టయ్యాయి. ఈ చిత్రాన్ని తెలుగు లో మేధా క్రియోష‌న్స్‌ అధినేత‌లు మిరియాల రాజాబాబు(కృష్ణారెడ్డి), మిరియాల ర‌వింద‌ర్ రెడ్డి విడుద‌ల చేస్తున్నారు.


ఈ రోజు విడుదలైన ఈచిత్రానికి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా ఫస్టాఫ్ పూర్తయిన తర్వాత వారి స్పందన బట్టి....భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని స్పష్టమవుతోంది. తొలి భాగం యావరేజ్ గా ఉందనే టాక్ వచ్చింది. రెండో భాగం కూడా అంతంత మాత్రంగానే ఉందంటున్నారు.


విభిన్న చిత్రాల దర్సకుడు వెంకట ప్రభు. ఆయన నుంచి కొత్త చిత్రం వస్తోందంటే సినిమా ప్రియులు ఆసక్తిగా చూస్తారు. దానికి తోడు ఆయన సూర్య వంటి స్టార్ హీరోని అండగా తీసుకుని చెలరేగపోవటానికి వస్తున్నాడంటే మరీను. అయితే సూర్య సినిమాలు ఈ మధ్య భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవుతున్నాయి. దర్సకుడు వెంకట్ ప్రభు..గత చిత్రం బిర్యాని(కార్తి) కూడా ఫ్లాఫ్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం పై అంచనాలు కాస్త తక్కువుగానే ఉన్నాయి.


స్లైడ్ షోలో పలువురు ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా అభిప్రాయాలు తెలిపారు


@raghu_adapa

@raghu_adapa


ఇంటర్వెల్ ఎపిసోడ్ బావుంది. కానీ ఫస్టాఫ్ బిలో యావరేజ్


@just_vijith

@just_vijith

if u r a person lookin for a thriller choose @dirvenkatprabhu and if u r a person lokin for versatility choose @Suriya_offl film #rakshasudu


@fdfsmovie

@fdfsmovie

రాక్షసుడు ఫస్టాఫ్ యావరేజ్ గా ఉంది.


@cinema_babu

@cinema_babu

రాక్షసుడు ఫస్టాఫ్ చాలా యావరేజ్ గా ఉంది.


English summary
Suriya's Rakshasudu has got a tremendous release in Andhra Prasad and Telangana with a record of screens in Suriya's career. Though another Big film and straight Telugu film is releasing today, Rakshasudu still manage it get great buzz around it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu