»   » ఆమె వాళ్ళ కలలని కూలదోసింది అంటూ.., "కిరాక్" పిల్ల పెళ్ళి పై ఇంత చర్చా..!??

ఆమె వాళ్ళ కలలని కూలదోసింది అంటూ.., "కిరాక్" పిల్ల పెళ్ళి పై ఇంత చర్చా..!??

Posted By:
Subscribe to Filmibeat Telugu

కన్నడలో కిరాక్ పార్టీ అనే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో సూపర్ క్రేజ్ సంపాదించిన భామ రష్మిక . ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో సౌత్ లో కూడా ఆమెకు మంచి గిరాకి ఏర్పడింది. ముఖ్యంగా తెలుగులో అమ్మడు ఇప్పటికే రెండు సినిమాలకు సైన్ చేసింది. కిరాక్ పార్టీ సినిమాలో ఆ సినిమా హీరో దర్శకుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన రష్మిక ఇన్నాళ్లు ఆ విషయంపై నోరు విప్పలేదు.

యంగ్ హీరో నాగశౌర్య నిర్మాతగా మారి..

యంగ్ హీరో నాగశౌర్య నిర్మాతగా మారి..

తన సినిమాను తనే నిర్మించుకుంటున్నాడు. ఈ సినిమాతో రష్మికను టాలీవుడ్ లోకి తెచ్చేయాలని చూస్తున్నాడు. మరోవైపు నాని- దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలోను.. రామ్ తో కిషోర్ తిరుమల చేయనన్న సినిమాలోను.. ఈ రష్మికనే హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బాంబు పేల్చేసింది

బాంబు పేల్చేసింది

టాలీవుడ్ లో రష్మిక టైమ్స్ స్టార్ట్ అయిపోయినట్లే అనుకుంటున్న సమయం లో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో బాంబు పేల్చేసింది. త్వరలో పెళ్ళి చేసుకుంటున్నానంటూ చల్లగా చెప్పేసింది. ఇప్పటికున్న సమాచారం ప్రకారమైతే ఈ కన్నడ పిల్ల పెళ్ళితర్వాత నటించే అవకాశమైతే లేదు.

ఈ సినిమా జీవితం బోరుకొట్టి ఉంటుంది

ఈ సినిమా జీవితం బోరుకొట్టి ఉంటుంది

"అసలు షార్ట్ టైం లోనే ఇంత క్రేజ్ తెచ్చుకోని దాదాపు నంబర్ వన్ రేసులోకి కూడా దూసుకు పోగల స్థాయి అవకాశాలు వచ్చే సమయం లో చేజేతుల ఆ కెరీర్ని పాడు చేసుకుంటుందేంటీ అని వ్యాఖ్యానించిన వారూ లేకపోలేదు గానీ, రష్మిక ని దబాయించలేరు కదా ఆమెకి ఇక ఈ సినిమా జీవితం బోరుకొట్టి ఉంటుంది ఇక రష్మిక వైవాహిక జీవితాన్ని కోరుకుంటోంది, కుర్రప్రేక్షకులని మోసం చేసింది, ఆమె వాళ్ళ కలలని కూలదోసింది.." అంటూ ఒక కన్నడ వెబ్ సైట్ రాసింది.

నిరాశకలిగించే వార్తే

నిరాశకలిగించే వార్తే

ఇక్కడితో హీరోయిన్ గా తన కెరీర్ కి పుల్ స్టాప్ పెట్టేసి హాయిగా జీవించాలనుకుంటున్నానని సన్నితులతో చెప్పిందట. ఇప్పటికే మీడియాలో రక్షిత్ తో లవ్ అన్న వార్తలు చూసి ఈ "కిరాక్" భామ ని పడేసిన రక్షిత్ వైపు అసూయగా చూసిన తెలుగు కుర్రాళ్ళకి మాత్రం ఇది నిరాశకలిగించే వార్తే..

లైట్ తీసుకుంది

లైట్ తీసుకుంది

మీడియాలో రక్షిత్, రష్మికలపై ఎన్నో కథనాలు వచ్చినా సరే అమ్మడు లైట్ తీసుకుంది. కాని సడెన్ గారక్షిత్ శెట్టి పుట్టినరోజు కావడంతో ఈరోజు తనని తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది రష్మిక. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం అయ్యారు .

కిరాక్ పార్టీ షూటింగ్ సమయంలోనే

కిరాక్ పార్టీ షూటింగ్ సమయంలోనే

అయితే కిరాక్ పార్టీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరు గాఢంగా ప్రేమించుకున్నట్లు సన్నిహితులు తెలుపుతున్నారు. కాకపోతే అప్పట్లో వీరు మాత్రం అబ్బే మా ఇద్దరిది స్నేహం మాత్రమే నో ప్రేమా..గీమా అన్ని దబాయించారు మొత్తానికి ఆరు నెలల గడిచిన తర్వాత మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని త్వరలోనే ఒక్కటి అవుతున్నామని తెలిపింది రష్మిక మందన ..

జులై 3న నిశ్చితార్థం

జులై 3న నిశ్చితార్థం

'కిరాక్ పార్టీ' హీరో రక్షిత్ శెట్టితో ఆమె వివాహం జరుగబోతోంది. జులై 3న ఇరు కుటుంబాల సమక్షంలో వివాహ నిశ్చితార్థం జరుగనుంది. తమ చిన్న కుటుంబంలోకి రక్షిత్‌ను ఆహ్వానిస్తున్నామని, పెళ్ళికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియచేస్తానని రష్మిక సోషల్ మీడియాలో ప్రకటించింది. దాంతో ఇప్పటి వరకూ వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ వచ్చిన వార్తల్లో నిజముందని తేలిపోయింది.

ప్రభాస్, బన్నీ లాంటి హీరోలతో

ప్రభాస్, బన్నీ లాంటి హీరోలతో

కన్నడలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అందాల భామతో సినిమా చేయడానికి తెలుగు నిర్మాతలు సైతం పోటీ పడ్డారు. ప్రస్తుతం నాగశౌర్య సొంతం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రష్మిక తెలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే ప్రభాస్, బన్నీ లాంటి హీరోలతో ఆఫర్ అందుకునే వరకూ వెళ్ళిందనే టాక్ కూడా ఉంది,

ఆమె నిర్ణయం ఆమె ఇష్టం

ఆమె నిర్ణయం ఆమె ఇష్టం

ఇప్పటికే నాగశౌర్య తో ఒక సినిమా చేస్తున్న రశ్మిక ఇంత త్వరగా కెరీర్ కి గుడ్ బై చెప్పే నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కాని విషయం. పెళ్ళి తర్వాత నటించాలనుకున్నా ఈ క్రేజ్ ఉంటుందా అన్నది అనుమానమే... ఏదేమైనా ఆమె నిర్ణయం ఆమె ఇష్టం కాబట్టి పెళ్ళి తర్వాత కూడా టాలీవుడ్ సినిమాల్లో నూ కనిపించే అవకాశం ఉందేమో చూద్దాం...

English summary
Kirik Party hit pair now confirm to BT that they will indeed get engaged soon and have the full support and blessings of their respective families.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu