Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
‘ఖనిజాసురుడి’ పార్టీలోకి హీరోయిన్ రక్షిత!
రవితేజ హీరోగా రూపొందిన 'ఇడియట్' చిత్రంలో కైపెక్కించే యాక్టింగ్‌తో హాట్ హాట్‌గా నటించిన హీరోయిన్ రక్షిత ఆ తర్వాత పలు చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఎక్కువ కాలం సినిమాల్లో కొనసాగకుండా పెళ్లి చేసుకున్న ఈ కన్నడ కస్తూరి మళ్లీ సినిమాల్లో వస్తుందనే ప్రచారం సాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తన అభిమానులందరికీ షాకిస్తూ రక్షిత రాజకీయాల్లో కాలు మోపింది. మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుడు, మాజి మంత్రి శ్రీరాములు బీజేపీకి దూరమైన తర్వాత స్థాపించిన BRS పార్టీలో శనివారం చేరారు. పార్టీలో చేరిందే ఆలస్యం తన పార్టీ పర్యతర్థులను టార్గెట్ చేస్తూ వాగ్భాణాలను విసురుతోంది. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లోకి మన్మధ బాణాలు విసిరిన రక్షిత ఇప్పుడు తమపైకి మాటల తూటాలు వదలడాన్ని ఇతర పార్టీలో ఉన్న ఆమె అభిమానులు తట్టుకోలేక పోతున్నారు.
BSR పార్టీ పేరుకు శ్రీరాములు స్థాపించినప్పటికీ...ఆ పార్టీ వెనక ఉన్న కర్త, కర్మ, క్రియ అన్నీ ది మైనింగ్ మాఫియా డాన్, మిస్టర్ ఖనిజాసురిడిగా మీడియాలో పిలవబడుతున్న గాలి జనార్ధన్ రెడ్డి అనేది బహిరంగ రహస్యమే. మరి రక్షిత ఎంట్రీ వల్ల అయినా గాలికి కలిసొస్తుందో చూడాలి.