»   » హ్యారీపోట్టర్ తో పోటీ పడలేకే రామ్ గోపాల్ వర్మ ఆ నిర్ణయం

హ్యారీపోట్టర్ తో పోటీ పడలేకే రామ్ గోపాల్ వర్మ ఆ నిర్ణయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం "రక్త చరిత్ర-2" మళ్ళీ వాయిదాపడనుంది. నవంబర్ 19 గానీ తర్వాత చెప్పిన నవంబర్ 26 గానీ విడుదలకాకుండా డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసారు. ఈ చిత్రం మొదటి పార్ట్ కలెక్షన్స్ బాగుండంటంతో విడుదలను వాయిదా వేసేమని చెప్తున్నా నవంబర్ 19న హార్రిపోటర్ సీక్వెల్ ఏడవ భాగం విడదలకానుంది. ఓపినింగ్స్ బాగా వస్తాయనుకుంటున్న ఆ చిత్రం తన రక్త చరిత్రకు దెబ్బ కొడుతుందని భావించే వర్మ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయమై రక్త చరిత్రం నిర్మాత శీతల్ తల్వార్ మాట్లాడుతూ..మూడు భాషల్లో విడుదల చేయాల్సి రావటం, అన్నిచోట్లా ప్రమోషనల్ యాక్టివిటీస్ పర్యవేక్షణకి ముందుగా అనుకున్న టైమ్ సరిపోలేదు. అందుకే విడుదలను ముందుకు తోస్తున్నాము అన్నారు. ఇక నవంబర్ 19కి హృతిక్ రోషన్ నటించిన గుజారిష్ కూడా విడుదల కానుంది. రక్త చరిత్ర పార్ట్ 2 మొత్తం తమిళ హీరో సూర్యని హైలెట్ చేస్తూ నడవనుంది. మద్దెల చెరువు సూరిగా సూర్య చేస్తూంటే అతని భార్య భానుమతిగా ప్రియమణి కనిపించనుంది. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మించిన హ్యారీపోట్టర్ సీరిస్‌లోని 'హ్యారీపోట్టర్ అండ్ ద డెత్లీ హాలోస్' చిత్రం తెలుగులో 'హ్యారీపోట్టర్-7'గా ఈ నెల 19న రాబోతోంది. ఈ సీరిస్‌లోని ఐదు, ఆరు భాగాల్ని డైరెక్ట్ చేసిన డేవిడ్ యేట్స్ ఈ చివరి చిత్రానికి కూడా దర్శకుడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu