»   » వర్మ 'రక్త చరిత్ర' ఆడియో విడుదల,సినిమా రిలీజ్ డేట్స్

వర్మ 'రక్త చరిత్ర' ఆడియో విడుదల,సినిమా రిలీజ్ డేట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'రక్త చరిత్ర' చిత్రం రిలీజ్ అక్టోబర్ 22 న, ఆడియో సెప్టంబర్ 10న విడుదల చేయనున్నారు. ఇప్పటికీ నాలుగైదు సార్లు రిలీజ్ డేట్స్ మార్చారు. అయితే ఈ డేట్స్ ఫైనల్ గా ఫిక్స్ చేసి కన్ఫర్మ్ చేసారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవటమే వాయిదాలకు కారణం అని తెలుస్తోంది. మొదటి పార్ట్ రిలీజైన మూడు వారాల తర్వాత పార్ట్‌-2 రిలీజు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే హిందీ, తెలుగులో మాత్రమే రెండు భాగాలుగా తీశారు. తమిళం కోసం ప్రత్యేకంగా వెర్షన్ రెడీ చేస్తున్నారు. అక్కడ ఒక భాగం మాత్రమే ఉంటుంది. హిందీ, తెలుగులో తీసిన మొదటి భాగంలో వివేక్‌ ఓబరాయ్‌ మాత్రమే కనిపిస్తారు. రెండవ భాగం నుంచి సూర్య ఎంట్రీ ఉంటుంది. తమిళంలోనూ అక్టోబర్ నెలలోనే విడుదల చేయనున్నారు. రక్త చరిత్ర చిత్రంలో పరిటాల రవిగా వివేక్‌ ఓబరాయ్‌, సూరిగా సూర్య చేశారు. సూరి భార్య భానుమతి కేరక్టర్‌ ప్రియమణి అయితే, రవి భార్య సునిత పాత్ర అనితా ఆప్టే పోషించారు. అలాగే శతృఘ్నసింహా..ఎన్టీఆర్ పాత్రను చేస్తున్నారు. మొదట ఈ పాత్రకు మోహన్ బాబుని అనుకున్నారు కానీ ఎందుకునో అది జరగలేదు. ఇక ఇప్పటికే విడుదలైన రక్త చరిత్ర ప్రోమోలు సంచలనం సృష్టిస్తున్నాయి. అలాగే రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంలో ఓ పాట కూడా పాడారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu