»   » 'రక్తచరిత్ర’ మగవాళ్ళకు మాత్రమే: గజిని సూర్య

'రక్తచరిత్ర’ మగవాళ్ళకు మాత్రమే: గజిని సూర్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగల సమర్ధత, పాత్రకోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడగల ప్రొఫెషనిలిజమ్ సౌత్ ఇండియన్ 'గజిని" సూర్య సొంతం. 'కాక్క కాక్క", 'పెరాజఘన్", 'వారణం అయిరమ్" లాంటి సినిమాల్లో సూర్య పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలను బట్టి చూస్తే మనకావిషయం అర్ధమవుతోంది. తాజాగా సూర్య రామ్‌గోపాల్ వర్మ 'రక్తచరిత్ర" షూటింగులో బిజీగా ఉన్నాడు.

'రక్తచరిత్ర" సినిమా గురించి తన మనోభావాలని సూర్య ఇటీవలే మీడియాతో పంచుకుంటూ పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా మూడు భాషల్లో(తెలుగు,తమిళ్,హింది) వర్మ తెరకెక్కిస్తున్న 'రక్తచరిత్ర" సినిమాలో సూర్య 'మద్దెలచెరువు సూరి" పాత్రను పోషిస్తున్న సంగతి విదితమే. ఆంద్రప్రదేశ్ లోని 1980లో గ్యాంగ్ స్టార్ గా పేరుమోసిన పరిటాల రవి పాత్రను పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్ తో వైరం కలిగిన పాత్రను నేను చేస్తున్నాను. ఇంతవరకు నేను మద్దెలచెరువు సూరిని కలవలేదు. కానీ దర్శకులు రామ్‌గోపాల్ వర్మ చెప్పిన కథ ఆధారంగా పాత్రకు తగ్గట్టుగా నా శరీర భాషను మార్చుకున్నాను.

బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి నేను 'రక్తచరిత్ర" చేయడం లేదు. నాకు వర్మ గారు ముందుగా స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇందులో నాకు హీరోయిన్స్ కానీ, పాటలు, డాన్స్ లు కానీ లేవు. అందుకే వర్మ గారు 'రక్తచరిత్ర" ని మగాళ్ల సినిమా అంటారు. నాకు మరియు వర్మ గారి ఇద్దరి కెరీర్ లలో ఎంతో విలువైనది. కారెక్ట్ టైమ్ కి వచ్చిన సినిమా ఇది. ఎంతో అనుభవమున్న దర్శకుడు వర్మ ఈ సినిమాని ఎంతో సునాయాసంగా తెరకెక్కిస్తున్నారు. నాకుమటుకు నేనైతే ఇలాంటి పాత్రలతో ప్రయోగాలు చేస్తూనే ఉంటాను. ఒకరకంగా నాకిది సవాల్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu