»   » వర్మ 'రక్త చరిత్ర' మోడ్రన్ డే మహాభారతం

వర్మ 'రక్త చరిత్ర' మోడ్రన్ డే మహాభారతం

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రక్త చరిత్ర చిత్రం ఓ మోడ్రన్ డే మహాభారతం అని నటుడు సుదీప్ వ్యాఖ్యానించారు. ఆయన రక్త చరిత్ర చిత్రంలో డీసీపీ గా చేస్తున్నారు. ఆయన ఈ సినిమా గురించి చెబుతూ...ఈ చిత్రంలో శతృఘ్నసింహా, వివేక్ ఒబరాయ్, జరీనా వాహబ్, రాజ్ బబ్బర్, సూర్య, రంజిత్ లు మేజర్ రోల్స్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఐదు గంటలు నిడివి కలిగి రెండు పార్ట్ లుగా ఒక్కోటి రెండున్నర గంటలు డ్యూరేషన్ తో ఉంటుందని అన్నారు. మొదటి పార్ట్ రిలీజ్ అయిన నెల రోజుల అనంతరం రెండవ పార్ట్ రిలీజ్ చేస్తామని అన్నారు.

అలాగే సుదీప్ తన కెరీర్ బాలీవుడ్లో ఎలా మొదలైందో చెబుతూ...కర్నాటక, కేరళ నటులకు బాలీవుడ్ లో అవకాశాలు రావటం చాలా కష్టం. సౌత్ ఇండియన్ ఆర్టిస్టులుకు బాలీవుడ్ కి పరిచయం లేదు. అయితే ఎవరినీ ఈ విషయంలో బ్లేమ్ చేయాల్సిన పనిలేదు. అయినా కన్నడ పరిశ్రమ అంతగా డవలప్ లేదు. రాము(రామ్ గోపాల్ వర్మ) గారి లాంటి కొందరు ఫిల్మ్ మేకర్స్ మాకు అవకాశమిస్తున్నారు. నేను ముంబయి అవకాశాలు కోసం రాలేదు. రాము గారు నా మీద, నా ఎబిలిటీస్ మీద నమ్మకముంచి నన్ను ప్రమోట్ చేస్తున్నారు. నేను బెంగుళూరు నుంచి ముంబయి వస్తున్నాను అన్నారు. ఇక సుదీప్ రామ్ గోపాల్ వర్మ ఫూంక్ చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమై, ఆ తర్వాత ఆయన రూపొందించిన రణ్ లోనూ కీలకమైన పాత్ర చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu