»   » రామ్ గోపాల్ వర్మ గ్రేట్ అంటున్న మహేష్ బాబు

రామ్ గోపాల్ వర్మ గ్రేట్ అంటున్న మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ "రక్త చరిత్ర" చిత్రం రేపు(శుక్రవారం) రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మహేష్ బాబుని ప్రత్యేకంగా తిలకించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ..."రక్త చరిత్ర" ను చూసాను...దాన్నుంచి నా మనస్సు తిప్పుకోలేకపోయాను..స్పైన్ చిల్లింగ్ ఎక్సపీరియన్స్ ..రామూ గ్రేట్ అంటూ ట్వీట్ చేసారు. ఇక రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా ఈ చిత్రాన్ని ప్రైవేట్ స్క్రీనింగ్ చేసారు. తన వాళ్ళనుకున్న స్నేహితుల్ని ఆహ్వానించారు. వారంతా చిత్రాన్ని చూసి ఓ రకమైన షాక్ కు లోనయిన ఫీలింగ్ కలిగిందని, టైటిల్స్ నుంచి ఎండ్ క్రెడిట్స్ వరకూ చాలా ఇంటెన్స్ డ్రామా నడిపారని చెప్తున్నారు. హింసతో కూడిన భావోద్వేగాలు ఈ చిత్రాన్ని ఓ రేంజిలో నిలబెట్టాయని, కొన్ని సన్నేవేశాల్లో ఒళ్ళు గగుర్పాటుకు గురైందని అంటున్నారు. రక్త చరిత్రతో సినిమా చరిత్ర లో చరిత్ర క్రియేట్ చేసే అవకాశముందని అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu