»   » వర్మ 'రక్త చరిత్ర' రిలీజ్ కు సెన్సార్ అడ్డంకి?

వర్మ 'రక్త చరిత్ర' రిలీజ్ కు సెన్సార్ అడ్డంకి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం "రక్త చరిత్ర" సెన్సార్ వద్ద ఇబ్బందిని ఎదుర్కొందని సమాచారం. దాంతో చిత్రం విడుదల లేటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక సెన్సార్ వారు..ఈ చిత్రం పోస్టర్స్, ట్రైలర్స్ పై ప్రతీకారమే పరమ పద సోపానం...మహా భారతం అంటూ రాయటాన్ని అబ్జెక్ట్ చేసారు. ఆ వాక్యాన్ని తక్షణమే తొలిగించమని ఆదేశించారు. అయితే ఇప్పటికే పోస్టర్స్ ప్రింటై ఇండియాలో నలు మూలలకు వెళ్ళి పోవటంతో ఈ సమస్య పెరిగినట్లయింది. ఇప్పటికిప్పుడు కొత్త పోస్టర్స్ ప్రింటు చేయటమా లేక ప్రింటై పంపిన పోస్టర్స్ పై ఆ వాక్యాలును కొట్టి వేయటమా అనేది రక్త చరిత్ర దర్శక, నిర్మాతలను ఆలోచనలో పడేసిన అంశం.

మరో ప్రక్క హిందూ సంఘాలు ఈ వాక్యాలు ఉంటే ధియోటర్స్ వద్ద సినిమాను ఆపాలని నిర్ణయించుకున్నాయి. ఎందుకంటే మహాభారతంలో అలాంటి వాక్యమే లేనప్పుడు దాన్నెలా వాడుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అలాగే హింసని ప్రేరేపించేలా మాహాభారతంలో ఎక్కడా లేదని ఓ పవిత్ర గ్రంధాన్ని ఇలా తమ స్వార్ధానికి మార్చి వాడుకోవటం పద్దతికాదని మండిపడుతున్నారు. ఇక ఈ చిత్రం ఈ శుక్రవారం(అక్టోబర్ 22) న విడుదల కానుంది. పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో వివేక్ ఒబరాయ్..రవి పాత్రను, మద్దెల చెరువు సూరి పాత్రను తమిళ నటుడు సూర్య పోషిస్తున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu