»   » అలా మాట్లాడలేదు: మీడియా పై రకుల్ ప్రీతి సింగ్ ఫైర్

అలా మాట్లాడలేదు: మీడియా పై రకుల్ ప్రీతి సింగ్ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : త్రిష తమన్నా లపై సెటైర్లు వేసిన రకుల్ షాకింగ్ కామెంట్స్ చేసిందంటూ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తమ సీనియర్లపై ఆమె సెటైర్లు వేసిందని వాటిపై వారు మండిపడుతున్నారని చెప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రకుల్ ట్విట్టర్ సాక్షిగా మాట్లాడింది. వాటిని ఖండించింది. ఆమె ఏం అందో ఇక్కడ చూండండి.

I heard I made comments about my senior actresses. I would like to know when n where as m not even in d country. I have...


Posted by Rakul Preet on 14 July 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


నేను నా సీనియర్ నటిలపై కామెంట్స్ చేసానని చెప్పుకోవటం విన్నాను. అయితే అవి ఎక్కడ ఎప్పుడు చేసానో తెలుసోకోవాలని ఉంది. నేను అసలు దేశంలోనే లేను. నేను ఎప్పుడూ ఒకటే చెప్తూంటాను..మా సీనియర్ల నుంచి చాలా నేర్చుకున్నానని..వారితో పోల్చుకోవటానికి ఇష్టపడడని ..ప్లీజ్...మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నా..అటువంటి నిరాధారమైన వార్తలను ఆపమని అంటూ చెప్పుకొచ్చింది.


రకుల్ కెరీర్ విషయానికి వస్తే..


ఎన్టీఆర్ తో చిత్రం, రవితేజ 'కిక్-2', బాలీవుడ్ మూవీ 'శిమ్లా మిర్చి' చిత్రాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్... రామ్ చరణ్ సినిమాలో షూటింగ్ లోనూ పాల్గొంటోంది. మిగతా చిత్రాల షూటింగ్ పూర్తి కావస్తున్నప్పటికీ రామ్ చరణ్ సినిమా మాత్రం ఇటీవలే ప్రారంభమైంది. సెప్టెంబర్ నాటికి విడుదల తేదీ ప్రకటించడంతో వీలయినంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ సినిమా ఎక్కువభాగం లండన్ లో చిత్రీకరణ జరుపుకోనుంది.


Rakul Preet about false news

రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతూ... కరెంట్ తీగలాంటి షాక్ లతో... కుర్రకారును తన అందాలతో కిర్రెక్కిస్తోంది. లౌక్యంగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ బ్యూటీ... పండగచేస్కో సినిమాలో నటించడం మాటేమోకానీ... స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ.... కెరీర్ విషయంలోనూ నిజంగానే పండగచేస్కోంటోంది.


రవితేజతో నటిస్తున్న కిక్-2 విడుదల కాకముందే.. రామ్ చరణ్ సినిమాలో అవకాశం అందుకున్న రకుల్... మరోవైపు మహేశ్ సినిమాతో పాటు ఎన్టీఆర్-సుకుమార్ సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. సో.. ప్రస్తుతం రకుల్ ఖాతాలో నలుగురు స్టార్ హీరోల సినిమాలున్నాయన్నమాట.


ఎన్టీఆర్ తర్వాతి సినిమా సుకుమార్ దర్శకత్వంలో ఉండబోతోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని, హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ తయారు చేసుకున్న కథ ప్రకారం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇందుకోసం హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్‌లను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


వీరిద్దరిలో ఎవరైనా హాండిస్తే రాశి ఖన్నాను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలస్తోంది. త్వరలోనే ఆ విషయం అనేది ఫైనలైజ్ కానుంది. ఈ చిత్రాన్ని ‘అత్తారింటికి దారేది' నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రానికి పని చేయబోతుండటం విశేషం.

English summary
Rakul Preet said that:" I heard I made comments about my senior actresses. I would like to know when n where as m not even in d country. I have always said .. that I learn a lot from them n can't even compare myself with d "seniors" ! Would request media to not spread false news!"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu