»   » రకుల్ కు ఆ అలవాటు అస్సలు లేదట.. నమ్మొచ్చా..!

రకుల్ కు ఆ అలవాటు అస్సలు లేదట.. నమ్మొచ్చా..!

Subscribe to Filmibeat Telugu
'మద్యం' అలవాటు కూడా లేదన్న స్టార్ హీరోయిన్

సినీ పరిశ్రమలో ఉన్న వారు కొన్ని వ్యసనాలకు బానిసలుగా మారుతుంటారని బహిరంగంగానే కామెంట్లు వినిపిస్తుంటాయి. కొన్ని రకాల వ్యసనాలకు లేడీస్ అండ్ జంట్స్ ఇద్దరూ బానిసలుగా మారక తప్పని పరిస్థితి ఇండస్ట్రీలో ఉందని చాలా మంది చెబుతూ వచ్చారు. ఇది కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాదు. బాలీవుడ్, కోలివుడ్ అన్ని భాషల చిత్ర పరిశ్రమల్లో ఈ సమస్య ఉంది. ఆ మధ్యన టాలీవుడ్ డ్రగ్స్ వివాదం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. తనకు ఎటువంటి వ్యసనం లేదని చెబుతోంది.

టాలీవుడ్ లో బాగా పాకేసింది పబ్ కల్చర్

టాలీవుడ్ లో బాగా పాకేసింది పబ్ కల్చర్

టాలీవుడ్ లో పార్టీలు, పబ్ ల పేరుతో పార్టీ కల్చర్ బాగా పాకేసింది. పార్టీలు పేరుతో మద్యం సేవించడం సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది. ఇటీవల కాలంలో సెలెబ్రిటీలో మధ్య సేవించి వాహనాలు నడుపుతూ పోలీస్ లకు దొరికిపోతున్న సందర్భాలు గమనిస్తూనే ఉన్నాం.

బాలీవుడ్ లో బిజీగా రకుల్

బాలీవుడ్ లో బిజీగా రకుల్

టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో రకుల్ పాప బాలీవుడ్ అవకాశాల వేటలో బిజీగా ఉంది. తాను నటించిన అయ్యారే చిత్ర ప్రమోషన్ లో రకుల్ బిజీగా గడుపుతోంది.

కనీసం మద్యం కూడా

కనీసం మద్యం కూడా

రకుల్ అయ్యారే ప్రమోషన్ లో భాగంగా సినీ పరిశ్రమలో వ్యసనాల గురించి ప్రస్తావించింది. తనకు మాత్రం కనీసం మద్యం సేవించే అలవాటు కూడా లేదని చెబుతోంది. ఆమె లైఫ్ బోరింగ్ గా సాగుతుందట. పార్టీలకు వెళ్లే అలవాటు లేదని చెబుతోంది రకుల్.

ప్రేమ ప్రస్తావన

ప్రేమ ప్రస్తావన

తాను లైఫ్ లో ఇంకా ఎవరితోనూ ప్రేమలో పడలేదని, సింగిల్ గానే ఉంటున్నాని చెబుతోంది. పెళ్ళికి ముందే రిలేషన్ షిప్ ఇప్పుడు కామన్ అయిపోయింది. కానీ తాను మాత్రం ప్రేమ పెళ్లి గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని స్పష్టం చేసింది.

English summary
Rakul Preet opens on bad habits in cine industry. I don't have any bad habit she told.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu