»   » ఎన్టీఆర్ సినిమా: రకుల్ ప్రీతి సింగ్ కన్ఫూజై ఇరుక్కుంది

ఎన్టీఆర్ సినిమా: రకుల్ ప్రీతి సింగ్ కన్ఫూజై ఇరుక్కుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్ హీరోయిన్ గా తెలుగులో వెలుగుతున్న రకుల్ ప్రీతి సింగ్ తాను అడ్డంగా బుక్కయ్యానంటూ ఓ ఆంగ్ల దినపత్రిక కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. దేశం కాని దేశంలో లండన్ లో తాను దిక్కు తోచని స్ధితిలో ఇరుక్కుపోయానంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఏం చెప్పింది అంటే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మా నాన్నకు ప్రేమతో షూటింగ్ లండన్ లో జరుగుతోంది. అక్కడ హీరో,హీరోయిన్స్ పై కీలకమైన సీన్స్ తీస్తున్నారు. అందులో హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ పై కార్ డ్రైవింగ్ సీన్. ఓ టాప్ లెస్ కార్ లో హీరోయిన్ లండన్ వీధుల్లో షికార్ చేసే సీన్ అది. ఆ సన్నివేశంలో ఆమెతో పాటు వేరే యూనిట్ సభ్యులు ఎవరూ ఉండరు.

Rakul Preet's scary moments in London

ఓ కారు దాని స్టీరింగ్ ముందు ఫేస్ ఎక్సప్రెషన్స్ కవర్ చేయటానికి ఓ కెమెరా సెటప్. రకుల్ తో పాటే ఓ వాకీ టాకీ తప్ప ఇంకేమి ఉండదు. సరే వెళ్లివస్తానని రకుల్ బయిలు దేరింది. అలా వెళ్లి ఇలా లెఫ్ట్ యూ టర్న్ తీసుకోవాలి. కానీ ఆ టర్న్ రాంగ్ టర్న్ అయ్యింది. చెప్పిన యూటర్న్ మిస్ అయ్యిపోయింది.

చూస్తే ఫోన్ దగ్గర లేదు. ఎవరి నంబరు తన దగ్గర లేదు. ఓ ప్రక్క వాకీ టాకి సిగ్నల్ మిస్ అయ్యింది. ఇంకేం ఉంది.. అడ్డంగా బుక్కయిపోయింది. పాద చారుల్ని సాయిం అడిగింది. తిరిగి షూటింగ్ స్పాట్ కి వెళ్లటానికి ఎంతగానో ఆత్ర పడిపోయాను. కానీ లాభం లేకపోయింది. ఎవరూ ఆదుకోలేకపోయారు. ఓ గంట తర్వాత వాకీ టాకీ సిగ్నల్ వచ్చింది. అప్పటికి ఛేజ్ చేసుకుని వచ్చిన యూనిట్ తో కలిసి తిరిగి వెళ్లాను అంటూ ఆమె ఆ సంఘటను గుర్తు చేసుకుంది.

English summary
Rakul Preet Singh, had a scary experience in London where she is shooting for upcoming film of Jr NTR under Sukumar's direction.
Please Wait while comments are loading...