»   » అనుష్కతో ప్రేమలో పడ్డానంటూ ట్వీట్

అనుష్కతో ప్రేమలో పడ్డానంటూ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: స్వీటీ అనుష్క నటించిన 'సైజ్‌జీరో' చిత్రం వీక్షించిన అనంతరం ఆమెతో ప్రేమలో పడిపోయానని నటి రకుల్‌ ప్రీత్‌ అంటున్నారు. స్వీటీ తన నటనతో నా మనసు దోచుకుందని ఆమె తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.


విభిన్న కథాంశంతో విలక్షణ పాత్రలో అనుష్క చాలా బాగా నటించారని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ చిత్ర దర్శకుడు ప్రకాశ్‌ కోవెలమూడి అందం అంటే శరీరాకృతి మాత్రమే కాదు అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారని కితాబిచ్చారు.అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుని మొన్న శుక్రవారం విడుదలైన చిత్రం 'సైజ్‌ జీరో' . ఈ 'సైజ్‌ జీరో' చిత్రంలో ఏకంగా తొమ్మిది మంది స్టార్స్ గెస్ట్ లుగా కనిపించి,అలరించారు. అందులో రకుల్ ప్రీతి ఒకరు. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రకాష్‌ కోవెలమూడి దర్శకుడు. పీవీపీ సంస్థ నిర్మించింది.


చిత్రం కథేమిటంటే... చిన్నప్పటి నుంచి బొద్దుగా,లావుగా ఉండే సౌందర్య అలియాస్ స్వీటీ (అనుష్క)కు ఎన్ని సంభంధాలు వచ్చినా సెట్ అవ్వవు. ఆమె శరీర తీరే ఆమెకు అడ్డమవుతూంటుంది. అదే ప్రాసెస్ లో పెళ్లి చూపులకు వచ్చిన అభి(ఆర్య)తో పెళ్లి కుదరకపోయినా ఫ్రెండ్షిప్ కుదురుతుంది. అది స్నేహం నుంచి ప్రేమగా మారుతున్న సమయంలో అభి జీవితంలోకి సిమ్రాన్ (సోనాలి చౌహాన్) ఎంటరవుతుంది. దాంతో తన ప్రేమ సక్సెస్ కాదని అర్దం చేసుకున్న స్వీటీ ...ముందు తన లావు తగ్గించుకోవాలని ఫిక్స్ అవుతుంది.


Rakul Preet Singh about Size Zero Movie

అందుకోసం సత్యమూర్తి (ప్రకాష్ రాజ్) నడిపే సైజ్ జీరో సంస్ధ లో చేరుతుంది. అయితే అక్కడ వెయిట్ లాస్ పోగ్రామ్ లో ఇస్తున్న ఫుడ్, డ్రింక్స్ వల్ల కిడ్నీలు పాడవుతున్నాయిని తెలుసుకుని ఆ సంస్దపై యుద్దం ప్రకటిస్తుంది. అంతేకాదు...అప్పటికే అక్కడ చేరి ఆరోగ్యం పోగొట్టుకున్న స్నేహితురాలు జ్యోతి కు సాయిం చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం స్వీటీ ఏం చేసింది. తను అనుకున్న లక్ష్యం చేరిందా...అభితో ప్రేమ వ్యవహారం ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


English summary
Rakul Preet ‏tweeted:" Ok so #size zero! Fell in love with #Anushka even more. Adorable,cute n wt not! Take a bow 4 d effort n dedication put in. All d women out dre, U can't miss this one !! Beauty is much more beyond weight !! "
Please Wait while comments are loading...