రౌడీ రాముడికి జంటగా.. వయ్యారిభామగా రకుల్ ప్రీత్!
తెలుగు తెర మీద స్వర్గీయ ఎన్టీఆర్, శ్రీదేవి జంట చూడముచ్చటగా కనిపించేది. వారిద్దరూ నటించిన చిత్రాలకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, వయ్యారిభామలు వగలమారి భర్తలు, వేటగాడు, బొబ్బిలిపులి చిత్రాలు అప్పట్లో ప్రభంజనం సృష్టించాయి. అలాంటి జంట మరోసారి ఎన్టీఆర్ బయోపిక్‌లో కనిపించనున్నది. ఈ విషయంపై నిర్మాత విష్ణు ఇందూరి వివరణ ఇచ్చారు.
Recommended Video


రకుల్ పాత్ర ఖాయమైందలా
ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించాలని చాలా మంది హీరోలు, హీరోయిన్లు ముచ్చటపడుతున్నారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా బయోపిక్‌లో శ్రీదేవి పాత్రను పోషించాలని కోరుకొన్నది. ఆ క్రమంలో హీరో బాలకృష్ణను సంప్రదించగా అందుకు ఆయన ఒప్పుకోవడంతో శ్రీదేవిగా రకుల్ కనిపించడం ఖాయమైంది.

రకుల్ ప్రీత్ డేట్స్ అడ్జస్ట్‌మెంట్
ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్ర కీలకం కావడంతో ఆమె నటించిన సినిమాలు, డేట్స్ వివరాలను నిర్మాతలు తీసుకొన్నారట. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్‌కు అనుగుణంగా రకుల్ డేట్స్‌ను అడ్జెస్ట్ చేయడం జరిగిందనేది తాజా సమాచారం. ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కావడంపై రకుల్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కంగన, శ్రద్ధాను సంప్రదించలేదు
శ్రీదేవిగా రకుల్ ప్రీత్ పాత్ర గురించి నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. శ్రీదేవి పాత్రకు రకుల్ మొదటి ఛాయిస్. ఆమె పాత్ర కోసం సోనాక్షి సిన్హా, కంగన, శ్రద్ధాకపూర్‌ను సంప్రదించలేదు. దక్షిణాదిలో పాపులర్ అయిన రకుల్‌నే ముందు నుంచి తీసుకోవాలనుకొన్నాం అని అన్నారు.

విద్యాబాలన్‌తో ఆరు రోజుల షూటింగ్
ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ 30 శాతం షూటింగ్ పూర్తయింది. విద్యాబాలన్‌తో ఆరు రోజులు షూట్ చేశాం. రకుల్ ప్రీత్ డేట్స్ అడ్జస్ట్ చేసుకొని ఆమెతో సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఈ చిత్రంలో రకుల్‌ది అతిథి పాత్ర మాత్రమే అని విష్ణు చెప్పారు. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











