»   » అలా చేస్తే చెప్పుతో కొడుతా.. ఆ రోజు బాగా ఏడ్చాను.. రకుల్ ప్రీత్ సింగ్

అలా చేస్తే చెప్పుతో కొడుతా.. ఆ రోజు బాగా ఏడ్చాను.. రకుల్ ప్రీత్ సింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న అందాల తారల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే అగ్రతారలతో జతకట్టింది. ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్‌బాబుతో స్పైడర్, యువ హీరో బెల్లంకొండ శ్రీనుతో జయ జానకి నాయక చిత్రాల్లో నటిస్తున్నది. జయ జానకి నాయక చిత్రం ఆగస్టు 11న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలివిజన్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది.. త్వరలో ప్రసారం కానున్న కార్యక్రమంలో పలు అంశాలను మీడియాతో పంచుకొన్నది.

తెలుగు మాట్లాడలేక ఏడ్చాను..

తెలుగు మాట్లాడలేక ఏడ్చాను..

తొలి తెలుగు సినిమాలో నటించేటప్పుడు తెలుగు రాదు. మొదటి రోజు షూటింగ్‌లో డైలాగులు చెప్పలేక ఏడ్చాను. గాలివాటున అవకాశాలు రావడం లేదు. నాకు లభిస్తున్న పాత్రల వెనుక నా హర్డ్ వర్క్ ఉంది. ప్రేక్షకులు ఆదరించినంత కాలం నటిస్తూనే ఉంటాను అని రకుల్ చెప్పింది.

సినీ నటులు అనే సరికి..

సినీ నటులు అనే సరికి..

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై కూడా రకుల్ స్పందించింది. సమాజంలో జరిగిన దొంగతనం గురించి మీకు తెలుసా అనే విధంగా విచారణ జరుగుతున్నదని ఆమె అన్నారు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటులకు సంబంధం లేదని ఆమె అన్నారు. సినీ నటులు అనే సరికి ఈ కేసుపై ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారని పేర్కొన్నారు.

ఎవరూ ప్రపోజ్ చేయలేదు..

ఎవరూ ప్రపోజ్ చేయలేదు..

చూడటానికి బాగానే ఉంటాను. అందంగా కనిపిస్తాను. కానీ ఇంతవరకు ఎవరూ ప్రపోజ్ చేయలేదు. ఒకరిద్దరు ప్రయత్నించినా వారికి వర్కవుట్ కాలేదు అని అఫైర్స్ గురించి రకుల్ చెప్పింది. తాను పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకోనని, ప్రేమ పెళ్లి చేసుకొంటానని ఆమె పెళ్లిపై స్పష్టం చేసింది. పురుషాధిక్యత సమాజంలో కొన్ని విషయాల్లో మహిళలు సర్దుకుపోక తప్పదని అన్నారు.

అలా చేస్తే చెప్పుతో కొడుతా..

అలా చేస్తే చెప్పుతో కొడుతా..

నేను చేసుకోబోయే వ్యక్తికి సినిమాలు అంటే ఇష్టం ఉండాలి. మంచి హైట్ ఉండాలి. భోజన ప్రియుడై ఉండాలి. నువ్వు అలా ఉండాలి.. ఇలా ఉండాలి అంటే ఒప్పుకోనని రకుల్ చెప్పారు. నా జీవితంలో ఎవరైనా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తే వారిని చెప్పుతో కొడతాను అని రకుల్ చెప్పారు.

English summary
Rakul Preet Singh is now big star in Tollywood. She is acting with Prince Maheshbabu in spyder and Boyapati srinu's Jaya Janaki Nayaka. In this occassion She spoke to recently media. She said that she would be interested in love marriage.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu