For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డిప్రెషన్‌లోకి వెళ్లా.. కన్నీళ్లు ధారగా.. నన్ను చూసి నేనే బాధపడ్డా.. రకుల్ ప్రీత్ సింగ్

  By Rajababu
  |

  టాలీవుడ్‌లో వరుస విజయాలతో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ దూసుకెళ్తున్నది. రారండోయ్ వేడుక చూద్దాం బ్లాక్ బస్టర్ తర్వాత రకుల్ నటించిన తాజా చిత్రం జయ జానకి నాయక. యువ నటుడు బెల్లంకొండ శ్రీను నటించిన ఈ చిత్రానికి దర్శకుడు బోయపాటి శ్రీను. యాక్షన్, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది. తాను నటిస్తున్న టాలీవుడ్, బాలీవుడ్, తమిళ చిత్రాల గురించి అందించి వివరాలు ఆమె మాటల్లోనే..

  బోయపాటి మార్కు సినిమా ..

  బోయపాటి మార్కు సినిమా ..

  దర్శకుడు బోయపాటి శ్రీను డిఫరెంట్‌గా రూపొందించిన చిత్రం జయ జానకి నాయక. బోయపాటి మార్కు అంశాలు కలిసి ఉన్న ఓ అందమైన ప్రేమకథా చిత్రమే ఈ సినిమా. సినిమా చూసిన తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి లవ్ స్టోరి ఉంటే బాగుండు అని ప్రేక్షకులు అనుకోనే విధంగా ఉంటుంది. గతంలో ప్రేమ కథల్లో స్వచ్ఛత ఉండేది. త్యాగాలు ఉండేవి. ఇప్పుడు అలాంటివి కనిపించవు. అలాంటి భావోద్వేగ అంశాలు ఉన్న కథకు బోయపాటి యాక్షన్, ఎమోషన్స్‌ను జోడించారు.

  Bellamkonda Srinivas and Rakul Preet in a song | Filmibeat Telugu
  రెండు షేడ్స్ ఉన్న పాత్ర..

  రెండు షేడ్స్ ఉన్న పాత్ర..

  జయ జానకి నాయక చిత్రంలో నా పాత్ర పేరు జానకి. రెండు షేడ్స్ ఉన్న కారెక్టర్ నాది. క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. అల్లరిగా, ముద్దుగా కనిపిస్తుంది. కుటుంబం అంటే జానకికి చెప్పలేనంత ఇష్టం. అలాంటి అమ్మాయి జీవితంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంటుంది. దాంతో జానకి జీవితం ఎక్కసారిగా మారిపోతుంది. జానకి జీవితం ఎలా మారిపోయింది. ఆ సంఘటన ఏంటి? అనేదే జయ జానకి నాయక సినిమా కథ.

   భ్రమరాంబ పాత్రకు భిన్నమైన రోల్

  భ్రమరాంబ పాత్రకు భిన్నమైన రోల్

  సరైనోడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే జయ జానకి నాయక చిత్రం ఆఫర్ వచ్చింది. బోయపాటితో పనిచేసినందున ఆయన స్టయిల్ నచ్చి నేను ఈ సినిమా ఒప్పుకొన్నాను. అప్పటికే రారండోయ్ వేడుక చూద్దాంలో చేస్తున్న భ్రమరాంబ క్యారెక్టర్‌కు భిన్నమైనదిగా అనిపించడం వల్ల జానకి పాత్ర నచ్చింది. అందుకే ఒప్పుకొన్నాను. రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో పోషించిన భ్రమరాంభ పాత్రకు, జానకికి ఎలాంటి పోలికలు ఉండవు. భ్రమరాంబ పాత్ర చాలా అల్లరిగా, అమాయకంగా ఉండే అమ్మాయి. అయితే జానకి పాత్ర మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

  చాలా ఎమోషనల్ పాత్ర.. డిప్రెషన్‌లోకి వెళ్లా.

  చాలా ఎమోషనల్ పాత్ర.. డిప్రెషన్‌లోకి వెళ్లా.

  ఇప్పటి వరకు నేను పోషించనటువంటి క్యారెక్టర్ ఇది. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. షూటింగ్ జరిగిన సమయంలో నాపై పాత్ర ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా సన్నివేశాల్లో నేను డిప్రెషన్‌కు గురయ్యా. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిన గానీ ఓ రకమైన ఫీలింగ్‌లో ఉండేదానిని. అమ్మా, అన్నతో మాట్లాడటం ద్వారా పాత్ర నుంచి బయటకు వచ్చేదానిని. చాలా సన్నివేశాల్లో కంటతడి పెట్టాల్సి వచ్చింది.

  నాపై పాత్ర ప్రభావం ఎక్కువగా ఉండేది..

  నాపై పాత్ర ప్రభావం ఎక్కువగా ఉండేది..

  చాలా సీన్లలో కన్నీళ్లు రావడానికి గ్లిజరిన్ ఎక్కువగా ఉపయోగించాను. కన్నీళ్లు ఎక్కువగా కారడంతో కళ్లని ఉబ్బిపోయేవి. నా పరిస్థితి చూసి నాకే బాధగా అనిపించేది. ఓ రోజు బోయపాటితో అన్నాను.. షూటింగ్ అయ్యేపోయే వరకు కళ్లు ఉబ్బి చారలు ఏర్పడి తొందరగానే ముసలితనం కనిపిస్తుందేమోనని జోక్ చేశాను. బాధలో ఉన్నానని తెలిసి నాతో రెండు నిమిషాలు మాట్లాడు అని అమ్మ కాల్ చేసి అడిగే వారు.

  నా పరిస్థితి చూసి బోయపాటి బాధపడ్డాడు..

  నా పరిస్థితి చూసి బోయపాటి బాధపడ్డాడు..

  షూటింగ్ జరిగే సమయంలో స్తబ్దుగా ఉండేదానిని. ఎలాంటి ఫీలింగ్ మదిలో ఉండేవి కాదు. ఒక్కోసారి షూటింగ్ అయిపోయిన తర్వాత బోయపాటి వచ్చి సీన్ అయిపోయింది బయటకు రా అని చెప్పేవారు. అంత బలంగా నాపై పాత్ర ప్రభావం ఉండేది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం ద్వారా లేదా జిమ్ చేయడం ద్వారానో లేదా స్టార్‌బక్స్ లాంటి ఇష్టమైన ప్లేస్‌కు వెళ్లడం ద్వారానో పాత్ర నుంచి బయటకు వచ్చేదానిని.

  భగవంతుడి దయ వల్ల నాకు కష్టాలే లేవు..

  భగవంతుడి దయ వల్ల నాకు కష్టాలే లేవు..

  భగవంతుడి దయ వల్ల నా జీవితంలో ఏడ్చిన సంఘటనలు లేవు. ఎప్పుడూ అంతగా బాధపడే ఘటనలు నాకు ఎదురుకాలేదు. ఈ సినిమాలో నా హార్ట్‌ను టచ్ చేసిన సీన్లు ఉన్నాయి. నేను చెప్పడం కంటే సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు అర్థమవుతుంది. కొన్ని సీన్లు చూస్తే రకుల్ అక్కడ కనిపించదు. కేవలం జానకి పాత్రనే కనిపిస్తుంది.

  English summary
  After sensational Hit of Rarandoi Veduka Chuddam, Tollywood actor Rakul Preet Singh's latest movie is Jaya Janaki Nayaka. She played lead role beside Hero Bellamkonda Srinivas. Sensational Director Boyapati Srinu is the director for the film. This movie slated to release on August 11th. In this occassion Rakul speaks with Filmibeat.com exclusively. She revealed her role in the Jaya Janaki Nayaka. Rakul shared her future projects in Tamil and Hindi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X