»   » అబ్బాయిలు విషపూరితం.. ఆ విషయంలో కల్యాణ్‌కృష్ణకు వార్నింగ్ ఇచ్చాను.. రకుల్ ప్రీత్ సింగ్

అబ్బాయిలు విషపూరితం.. ఆ విషయంలో కల్యాణ్‌కృష్ణకు వార్నింగ్ ఇచ్చాను.. రకుల్ ప్రీత్ సింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో పాగా వేసేందుకు 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' ఎక్కిన అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ వెనుకకు చూసుకోలేదు. సరైనోడు, బ్రూస్‌‌లీ, ధ్రువ, విన్నర్ లాంటి చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటిసత్ూ వరుస విజయాలతో రకుల్ దూసుకెళ్తున్నది. ప్రస్తుతం అక్కినేని నాగార్జున నిర్మాతగా, సొగ్గాడే చిన్నినాయనా ఫేం దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రారండోయ్ వేడుకు చూద్దాం అనే సినిమాలో నాగచైతన్య సినిమాలో నటిస్తున్నది. అమాయకత్వం, ఒకరకమైన పొగరుతో కూడిన భ్రమరాంబ పాత్రలో నటించింది. ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో రారండోయ్ వేడుక చిత్రంలోని పాత్ర గురించి, సినీ, వ్యక్తిగత విషయాల గురించి మీడియాకు చక్కగా వివరించింది. రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

నా పాత్రపేరు భ్రమరాంబ

నా పాత్రపేరు భ్రమరాంబ

రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో నా పాత్ర పేరు భ్రమరాంబ. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. గతంలో ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం. పాత సినిమాల్లో హీరోయిన్లకు ఇలాంటి ప్రాధాన్యత ఉండేది. నేనొస్తాంటే వొద్దంటానాలో త్రిష, నిన్నే పెళ్లాడుతాలో టబూ పాత్ర మాదిరిగా ఉంటుంది. చాలా లవబుల్ క్యారెక్టర్. నా కోసం ఎవరో ఒక రాజకుమారుడు వస్తాడు అనే ఎదురు చూస్తుంటుంది. నాపై నమ్మకంతో అలాంటి పాత్రను ఇచ్చిన దర్శకుడు కల్యాణ్ కృష్ణకు థ్యాంక్స్.


చాలా ఇంపార్టెంట్ రోల్..

చాలా ఇంపార్టెంట్ రోల్..

గతంలో నేను చేసిన సినిమాలలో పాత్రల పేర్లు గుర్తుంచుకోవాలంటే చాలా కష్ణపడాల్సి వస్తుంది. కానీ భ్రమరాంబ పాత్ర ఇప్పుడు నాతోనే తిరుగుతున్నది. ఈ పాత్రలో నటించడం ద్వారా నేను పూర్తిగా భ్రమరాంబగా మారిపోయాను అనే ఫీలింగ్ కలుగుతుంది. నా పాత్రకు తగినట్టు పర్టిక్యులర్ డైలాగ్ ఉంటుంది. చాలా సినిమాలో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం ఉండదు. కానీ ఈ చిత్రంలో నా పాత్రకు అంత ప్రాధాన్యం ఉంది. సినిమా షూటింగ్ తర్వాత ఆ పాత్రను మరిచిపోవడానికి చాలా కష్టంగా మారుతుంది. ట్రైలర్‌తోనే నా పాత్రకు చాలా గుర్తింపు వచ్చింది. భ్రమరాంబ క్యారెక్టర్ ఓ చిన్న ఊర్లో భూస్వామి కుటుంబంలో ఉండే కూతురి పాత్ర. ఈ పాత్ర చాలా క్యాచీగా ఉంటుంది. నా పాత్రకు, పాత్రకు తగినట్టుగా దస్తులు డిజైన్ చేసిన నీరజ్ కోనకు థ్యాంక్స్.


అబ్బాయిలు విషపూరితం

అబ్బాయిలు విషపూరితం

అమ్మాయిలు చాలా హానికరం అని నాగచైతన్య చెప్పిన డైలాగ్స్ గురించి ప్రస్తావించగా.. సినిమాలో చైతూను నేనేమీ చేయలేదు. అబ్బాయిలు అలానే అంటారు. సిగరెట్ తాగితే నెమ్మది నెమ్మదిగా ఎలా చనిపోతారో అని అమ్మాయిలను అనుకుంటే.. అబ్బాయిలు విషపూరితం. అబ్బాయిల వల్ల వెంటనే ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది అని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు.


నేను పక్కా హైదరాబాదీని..

నేను పక్కా హైదరాబాదీని..

నేను ఉత్తరాది నుంచి వచ్చిన అనే విషయం మరిచిపోయాను. ఆర్మీ కుటుంబం కావడం వల్ల నేను కేవలం నార్త్‌కు పరిమితం కాలేదు. నా తమ్ముడు బెంగళూరులో జన్మించాడు. నేను తెలుగు మాట్లాడటం చూస్తే నన్ను నార్త్ అని అనుకోరు. ప్రస్తుతం నేను పక్కా హైదరాబాదీని. హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడే ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉంటున్నాను.


చైతూ నాకు గుడ్ ఫ్రెండ్

చైతూ నాకు గుడ్ ఫ్రెండ్

చైతన్యతో నాకు ముందు నుంచి పరిచయం ఉంది. గుడ్ ఫ్రెండ్. తనతో నటించేటప్పుడు సహ నటుడు అనే ఫీలింగ్ కాకుండా ఫ్రెండ్‌తో నటిస్తున్నాను అనే ఫీలింగ్ కలిగింది. అక్కినేని లాంటి ఫ్యామిలీలో ఉన్నా చాలా సింపుల్‌గా ఉంటాడు. ఎదుటి వాళ్లను చాలా గౌరవం ఇస్తాడు. ఎదుటివాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో నాగచైతన్య కొందరికి క్లాసులు ఇస్తే బాగుంటుంది అని ఆడియో రిలీజ్ కార్యక్రమంలో కూడా చెప్పాను. ఎలాంటి డిమాండ్స్ లేకుండా చాలా సింపుల్‌గా ఉండటం చైతన్య గొప్పతనం అని రకుల్ చెప్పింది.


డ్రమ్ గర్ల్ అని నాగ్ సార్..

డ్రమ్ గర్ల్ అని నాగ్ సార్..

నాగార్జున సార్ గ్రేట్. నిర్మాతగా చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. షూటింగ్ ప్రతీదానిని పట్టించుకొనే వారు. ఏమైనా కావాలా.. ఏమైనా అవసరం ఉందా అని తెలుసుకొనే వారు. వారం క్రితం నాకు ఫోన్ చేశాడు. మూవీ చూశాను. చాలా బాగుంది. భ్రమరాంబ క్యారెక్టర్ బాగా ఉంది. ఆ పాత్రలో బాగా నటించావు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. నన్ను డ్రమ్ గర్ల్ అని పిలిచాడు. డ్రమ్స్ వాయించడం ముందే తెలుసా అని అడిగారు. అయితే నాకు డ్రమ్స్ కొట్టడం రాదు. ఇంతకు ముందు చేయలేదు అని చెప్పాను.


దేవీ శ్రీ ప్రసాద్ ఓ రాక్ స్టార్..

దేవీ శ్రీ ప్రసాద్ ఓ రాక్ స్టార్..

దేవీ శ్రీ ప్రసాద్ ఓ రాక్ స్టార్. ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు ముందే తెలుసు. ఆయన అద్భుతమైన సంగీతాన్ని మరోసారి ఈ చిత్రానికి ఇచ్చారు. ఈ చిత్రంలో నాకు రెండు పాటలు బాగా నచ్చాయి. తక తక జూమ్ అనే పాట, డ్రమ్స్ పాట చాలా ఇష్టం.


కల్యాణ్‌క‌ష్ణకు వార్నింగ్ ఇచ్చా..

కల్యాణ్‌క‌ష్ణకు వార్నింగ్ ఇచ్చా..

భ్రమరాంబ పాత్ర ఇచ్చిన దర్శకుడు కల్యాణ్ కృష్ణకు బిగ్ థ్యాంక్స్. కల్యాణ్ నైస్ పర్సన్. ఓపెన్ మైండెడ్. భ్రమరాంబ స్లయిల్‌లో అల్రెడీ కల్యాణ్ కృష్ణకు వార్నింగ్ ఇచ్చాను. నీవు తీయబోయే సినిమాలో నేనే హీరోయిన్. నాకు సంబంధం లేదు. లేకపోతే ఏమీ చేస్తానో నాకే తెలియదు. ఎనీ హో కల్యాణ్‌కు బెస్టాఫ్ లక్ అని రకుల్ అన్నారు.


లవ్ స్టోరీలలో హీరో, హీరోయిన్లకు..

లవ్ స్టోరీలలో హీరో, హీరోయిన్లకు..

సాధారణంగా కమర్షియల్ సినిమాలలో హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉండదు. అందులో లవ్ స్టోరీలు ఉండవు. లవ్ స్టోరి ఉన్నప్పుడే హీరో, హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏం మాయ చేసావో..లాంటి లవ్ స్టోరీ చిత్రంలో హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి సినిమాలు వస్తే తప్పకుండా చూస్తాను. అలాంటి కోవలో ఉన్నది ఈ చిత్రం. అలాంటి పాత్రను ఇచ్చిన కల్యాణ్‌కు మరోసారి బిగ్ బిగ్ థ్యాంక్స్.


రియల్ లైఫ్‌లో ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్..

రియల్ లైఫ్‌లో ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్..

నిజజీవితంలో మా ఇంట్లో నేను భ్రమరాంబను కాదు. మాది మిలిటరీ ఫ్యామిలీ. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. మా ఇంట్లో నన్ను గారాబంగా పెంచలేదు. ఎందుకంటే జీవితం అంటే ఏమిటో తెలియదు. ఈ చిత్రంలో గారాబంగా పెరిగిన భ్రమరాంబకు ఊరి నుంచి సిటీకి వెళ్లిన తర్వాత జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది.


మరో నిన్నే పెళ్లాడుతా..

మరో నిన్నే పెళ్లాడుతా..

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా మరో నిన్నే పెళ్లాడుతా అవుతుందనే ప్రచారం చెప్తున్నారని అడుగగా.. అదే అయితే అంతకంటే గొప్ప కామెంట్ ఏముటుంది. నిజంగా అది జరిగితే నేను చాలా సంతోషిస్తాను అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.


వెబ్‌సైట్లు చూస్తా..

వెబ్‌సైట్లు చూస్తా..

నేను నా గురించి తెలుసుకోవడానికి వెబ్‌సైట్లు చూస్తుంటాను. నా గురించి ఏమీ రాస్తున్నారో తెలుసుకొంటాను. మనం పనిచేసే రంగంలో మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం అని రకుల్ ప్రీత్ చెప్పింది. నాకు పాత సినిమాలు చూడటం అలవాటు. నేనొస్తానంటే నేవొద్దంటానా, వర్షం. బొమ్మరిల్లు లాంటి సినిమాలు పరిశ్రమలోకి రాగానే చూశాను. ఇప్పుడు కూడా సినిమాలు చూడటం హోంవర్క్ అని భావిస్తాను. ట్రావెలింగ్ సమయంలో సినిమాలు చూస్తాను


సినిమా సక్సెస్ అనేది టీమ్ వర్క్

సినిమా సక్సెస్ అనేది టీమ్ వర్క్

మిస్ డిపెండబుల్ అంటే ఒప్పుకొను. సినిమా అనేది టీమ్ వర్క్. నావల్లే సినిమా నడుస్తుందని ఎప్పుడూ అనుకొను. ఒక సినిమా ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. నేను లక్కీ మస్కట్ కాను. అలా అయితే అందరూ నాతో 1000 కోట్ల సినిమాలు చేస్తారు. అదృష్టం అనేది కొంతమేరకే. కృషితోనే విజయం లభిస్తుంది. సినిమా అంటే సమిష్టి కృషి మాత్రమే.


బాలీవుడ్ ఆఫర్ వస్తే..

బాలీవుడ్ ఆఫర్ వస్తే..

యారియాన్ తర్వాత మరో బాలీవుడ్ సినిమా చేయలేదు ఎందుకంటే.. హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇల్లు కొనుకొన్నాను. తెలుగులో మంచి అవకాశాలు, బిజీగా ఉన్నప్పుడు ఎందుకు మరోచోటకు వెళ్లాలి. బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తే చూస్తాను. అంతేగానీ టాలీవుడ్‌ను వదిలేసి వెళ్లను. తమిళంలో కూడా చేస్తున్నాను. కన్నడంలో గతంలో ఓ సినిమా చేశాను. స్కూలింగ్ పూర్తయిన వెంటనే కన్నడ చిత్రంలో ఆఫర్ వచ్చింది. పాకెట్ మనీ కోసం మాత్రమే ఆ సినిమా చేశాను. ప్రస్తుతం తమిళం, తెలుగు సినిమాలను బ్యాలెన్స్ చేస్తే చాలా అదే గొప్ప అని రకుల్ తెలిపారు.


నిర్మాతగా మారాలని .. కాని రిస్క్ చేయలేను..

నిర్మాతగా మారాలని .. కాని రిస్క్ చేయలేను..

సినిమా నిర్మాతగా మారాలని ఉన్నది. కానీ ఇప్పుడు ఆ సాహసం చేయలేదు. హిందీలో అనుష్కశర్మ నిర్మాతగా మారింది. నేను కూడా భవిష్యత్‌లో సినిమాలు నిర్మిస్తానేమో తెలీదు. ఇప్పుడు సినిమాలు నిర్మించి డబ్బులు పోతే చాలా కష్టంగా ఉంటుంది. నా ఫ్యామిలీ అంతా జీతంతోనే బతికే కుటుంబం. ఇప్పుడే ఆ రిస్క్ చేయలేను.


లవ్ మ్యారేజ్ ఇష్టం..

లవ్ మ్యారేజ్ ఇష్టం..

నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం. కానీ లవ్ లేదే. లవర్ కూడా లేదు. నా జీవితంలో కూడా ఎవరో ఒక రాజకుమారుడు వస్తాడేమో అని ఎదురుచూస్తున్నాను. అలా వస్తే లవ్ మ్యారేజ్ చేసుకొంటాను అని రకుల్ తెలిపారు. బాహుబలి సినిమా ఫ్రెండ్స్, తోటి యాక్టర్లతో కలిసి చూశాను. బాహుబలి టీషర్ట్ ధరించి ఆ సినిమా చూశాను. చాలా బాగుంది. అందరూ చూడాలనుకునే గొప్ప సినిమా. బాహుబలి ఈజ్ గ్రేట్.English summary
Actress Rakul Preet Singh latest movie is Rarandoy Veduka Chuddam. This movie is releasing on may 26th. In this occassion, Rakul Shared her experience with Director Kalyan Krishna, Hero Naga Chaitanya. She said Bramaraamba roles is very important in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu