హీరోను వదిలేసి.. 50 ఏళ్ల విలన్‌తో రకుల్ ప్రీత్ రొమాన్స్.. ఏం జరుగుతున్నదంటే..
తెలుగులో వరుస విజయాలతో దూసుకెళ్తున్న రకుల్ ప్రీత్ సింగ్ అటు తమిళం సినీ పరిశ్రమపై, ఇటు బాలీవుడ్‌పై కన్నేసింది. ఇప్పటి వరకు కుర్ర హీరోలతో రొమాన్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ తన తదుపరి చిత్రంలో 50 ఏళ్లకుపైబడిన స్టార్ హీరోతో రొమాన్స్ చేయనున్నారట. ఆ సినిమా విశేషాలు మీకోసం.

సూర్యతో రకుల్ తమిళ చిత్రం
తమిళంలో హీరో కార్తీతో చేసిన ఖాకీ చిత్రం రకుల్ ప్రీత్‌కు తమిళంలో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కార్తీ సోదరుడు, విలక్షణ నటుడు సూర్యతో నటించే అవకాశ దక్కించుకున్నది. ఈ చిత్రంలో రకుల్‌తోపాటు సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Recommended Video


విలన్ పాత్రలో జగపతిబాబు
సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య నటించే చిత్రంలో హీరో జగపతిబాబు ఓ విలన్ పాత్రను పోషిస్తున్నారట. అయితే విలనిజంతోపాటు రొమాన్స్ చేసే అవకాశం ఆ పాత్రకు ఉందట. ఆ రొమాన్స్ ఎవరితోనో కాదు.. అందాల సుందరి రకుల్ ప్రీత్ సింగ్‌తోనే కావడం విశేషం.

స్టార్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్
సూర్య, సాయిపల్లవి, రకుల్ నటించే ఈ చిత్రం ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ వెళ్లనున్నది. విభిన్నమైన కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రకుల్‌కు ఓ మంచి పాత్ర దొరికిందని, ఆ రోల్‌తో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ కావడం తథ్యం అనే మాట వినిపిస్తున్నది.

హిందీలో యే యారీ చిత్రం
బాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ నటించిన యే యారీ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలకు సిద్దమవుతున్నది. ధోని, స్పెషల్ 26 లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన నీరజ్ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











