»   » ఆ కామెంట్‌కు అర్ధం తెలిసివుంటే స్టేజ్‌ మీదే సమాధానం ఇచ్చేదాన్ని : రకుల్

ఆ కామెంట్‌కు అర్ధం తెలిసివుంటే స్టేజ్‌ మీదే సమాధానం ఇచ్చేదాన్ని : రకుల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్‌లో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన కామెంట్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆడవాళ్లు పక్కలోకే పనికొస్తారంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేసిన చలపతిరావుపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే కేసు కూడా నమోదైంది. ఈ వ్యాఖ్యలపై నాగార్జునతో సహా పలువురు ఖండించిన సంగతి తెలిసిందే...

హీరో నాగచైతన్య

హీరో నాగచైతన్య

అయితే ఇప్పుడు ఆ హీరో నాగచైతన్య కూడా ఈ ఘటన గురించి స్పందించాడు. ఆడవాళ్లను గౌరవించడం తన జీవిత పరమార్థమని చైతూ ట్వీట్ చేశాడు. అయితే అక్కడ లైవ్ లో ఉన్న కెమెరాల సమన్వయం లో ఎడిటింగ్ వల్ల ఆయన మాటలకు నవ్వినట్టు అర్థం వచ్చింది తప్ప ఆ మాటలను తాను ఎంజాయ్ చేసినట్టు కాదని వివరించే ప్రయత్నం చేసాడు నాగ చైతన్య.

నవ్వితే ఏకీభవిస్తున్నట్లా?

నవ్వితే ఏకీభవిస్తున్నట్లా?

చలపతిరావు కామెంట్స్ చేసిన సమయంలో తన రియాక్షన్‌ను చూపిస్తూ దుష్ప్రచారానికి పాల్పడటం సమంజసం కాదని చైతూ అభిప్రాయపడ్డాడు. అలా కనిపించినంత మాత్రాన ఆయన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లా అని చైతూ ప్రశ్నించాడు. కానే కాదని.. చలపతిరావు వ్యాఖ్యలతో ఏకీభవించబోనని చెప్పేసాడు.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

దీనికి ముందే అదే వేడుక లో నాగ చైతన్య పక్కనే నవ్వుతూ కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా ట్విటర్ ద్వారా చలపతి రావ్ వ్యాఖ్యలని ఖండిస్తున్నట్టు చెప్పింది. ఆలస్యంగా స్పందించాడానికి గల కారణాన్ని చెబుతూ.. చలపతి రావు చేసిన వ్యాఖ్య అర్ధం తనకు తెలియదని మీడియాలో వస్తున్న వార్తల ద్వారా ఆ విషయం తెలిసినట్లు చెప్పింది. చలపతిరావు చేసిన కామెంట్‌కు అర్ధం తెలిసివుంటే స్టేజ్‌ మీదే సమాధానం ఇచ్చేదాన్నని, ఆ కామెంట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తన అభిప్రాయాన్ని చెప్పేసింది.

చెడు ప్రభావం పడుతుంది

చెడు ప్రభావం పడుతుంది

తెలుగు సినీ పరిశ్రమలో ఒక సీనియర్‌ నటుడిగా ఆయనకు ఉన్న స్ధానాన్ని, వయసును గుర్తు పెట్టుకుని మాట్లాడివుంటే బాగుండేదని,. మహిళలపై అలాంటి పదజాలాన్ని వినియోగించడం వల్ల తోటి వారిని తప్పుడు మార్గంలో ప్రోత్సహించినట్లు ఉంటుందని,. ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వాళ్లపైనా చెడు ప్రభావం పడుతుందని చెప్పిన రకుల్.. కెరీర్ ఆరంభంలో చాలా సందర్భాల్లో చాలా మంది ఇలాంటి వ్యాఖ్యలు చేసినా.. చాలా సార్లు మిన్నకుండిపోయానని, కానీ ఇప్పుడు జరిగిన సంఘటనతో మాత్రం నోరు మెదపకుండా ఉండలేకపోతున్నానని చెప్పింది...

English summary
"For people who think chay_akkineni n I ver laughing at those comments , telecast happens at a 5 mins lag n those reactions ver not for it." Tweets Rakulpreet singh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu