»   » అనుకున్నాం... రకుల్ ఆ కేసులో ఇరుక్కున్నట్టేనా?? ఇంకా ఒప్పుకోలేదు కానీ....

అనుకున్నాం... రకుల్ ఆ కేసులో ఇరుక్కున్నట్టేనా?? ఇంకా ఒప్పుకోలేదు కానీ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

బీజేపీ మాజీ ఎంపీ, మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్ధనరెడ్డి కూతురు బ్రాహ్మణి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి దక్షిణాదికి చెందిన రాజకీయ ప్రముఖులతోబాటు సినీ సెలబ్రిటీలకు కూడా ఆహ్వానాలందాయి.అయితే అవినీతి కేసుల్లో ఇరుక్కున్న జనార్ధనరెడ్డి ఇంట పెళ్లికి వెళ్లడానికి చాలా మంది భయపడ్డారు. ఆ పెళ్లికి దాదాపు 500 కోట్ల రూపాయులు ఖర్చైందని టాక్‌. ముఖ్యంగా ఆ పెళ్లి వేడుకలో సందడి చేసిన కొంతమంది సెలబ్రిటీలకు భారీగా డబ్బులు అందాయని వార్తలు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో డ్యాన్స్‌ చేసిన తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు ఒక్కొక్కరు కోటి రూపాయలు అందుకున్నారని సమాచారం.

అందుకే ఇప్పుడు రకుల్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందని టాలీవుడ్‌ జనాలు అనుకుంటున్నారు.వారం క్రితం మైనింగ్ బారెన్ గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె బ్రహ్మాణి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి.. భూదేవంత పీట వేయకపోయినా అంత సందడి కనిపించింది ఆ పెళ్లిలో. కల్యాణానికి 500 కోట్లకి పైగా ఖర్చైందని టాక్. ఆ వేడుకలో డ్యాన్స్‌ చేసిన తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు ఒక్కొక్కరు కోటి రూపాయల మేరకు అందుకున్నట్టు వినికిడి. అసలు ఆ వైభోగం చూస్తే అంతకుమించి అయినా ఆశ్చర్యపోవక్కర్లే. ఇక పెళ్లికి దేశంలో ఉన్న సెలబ్రిటీల్ని అందర్ని ఆహ్వానించాడు జనార్థన్ రెడ్డి. మాములుగా అయితే అంత కోటీశ్వరుడు పిలిస్తే అందరూ పొలోమనేవాళ్లే. కానీ గాలి అవినీతి కేసుల్లో ఇరుక్కొని జైలుకి వెళ్లి ఉండటంతో చాలామంది హ్యాండిచ్చేశారు.

Rakul preeth singh

కేవలం 30 కోట్ల రూపాయలతో దీనిని నిర్వహించామని వెడ్డింగ్ నిర్వాహకులు తెలపగా, 500 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఈ వివాహానికి ఎంత ఖర్చైంది? అన్న వివరాలను నిగ్గుతేల్చేందుకు ఐటీ శాఖ నడుంబిగించింది. ఇప్పటికే గాలి వారింట పెళ్లిపై కన్నేసిన ఐటీ శాఖ.. ఆ పెళ్లికి అంత డబ్బు ఎక్కణ్నుంచి వచ్చిందని ఆరా తీస్తోంది. అలాగే డబ్బు పుచ్చుకున్న వారికి కూడా ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసులు వచ్చాయట. అలా నోటీసులు అందుకున్న వారిలో రకుల్‌ కూడా ఉందని వార్తలు గుప్పుమన్నాయి. హీరోయిన్స్ కి భారీగా డబ్బు ముట్టజెప్పడంతో వాళ్లు సంతోషంగా హజరై చిందులు కూడా వేశారు. అలా స్టెప్స్ వేసిన వారిలో హీరోయిన్స్ తమన్నా.. రకుల్ కూడా ఉన్నారు.

తమన్నా సంగతేమో కానీ ఇప్పుడు రకుల్ చుట్టూ మాత్రం నోటీస్ వార్తలు తిరుగుతున్నాయ్. అల్రెడీ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ మీద కన్నేసిన ఐటీ శాఖ ఇప్పుడు ఆ డబ్బంతా ఎక్కడదనే లెక్కలు లాగే పనిలో బిజీగా ఉంది. ఇటు డబ్బు పుచ్చుకొన్న వారికి కూడా నోటీస్ లు ఇచ్చిందని.. అలా ఐటీ నోటీస్ లు అందుకున్న వారిలో రకుల్ కూడా ఉందంటున్నారు. ఆమెకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందంటూ వదంతులు రేగాయి. అయితే రకుల్ మాత్రం ఇదంతా నాన్సెన్స్ అనేసింది. నాకు ఎవరూ నోటీస్ లు ఇవ్వలేదు నేను ప్యూర్ అంటుంది. సరే ప్రస్తుతం ఎలా ఉన్నా ఫ్యూచర్ సంగతి తెలియదుగా. అసలే అది గాలి డబ్బు. టచ్ చేసిన వాళ్లందరూ ఇరుక్కోవడం ఖాయమంటున్నారు. మరి రకుల్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

English summary
Former Karnataka BJP Minister and mining baron Gali Janardhan Reddy’s daughter’s wedding is heard to have made income tax sleuths knock the door of bubbly actress Rakul Preet Singh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu