twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రధానితో రకుల్ సెల్ఫీ.. ఎమోషనల్ పోస్ట్

    |

    సమాజంపై సినిమా ప్రభావం.. సామాజిక బాధ్యత ఉన్న సినిమాల వల్ల కలిగే ప్రయోజనాలు, సంప్రదాయాలు, ఆచారాలు.. ఇలాంటి వాటిపై చర్చించేందుకు.. మార్పు మనలోనే మొదలవ్వాలి అనే కార్యక్రమాన్ని ప్రధాని ఏర్పాటు చేశారు. మహాత్ముని ఆలోచనలు అనుగుణంగా సాగడం.. మార్పు అనేది మనలోంచి మొదలవ్వాలనే అనే పాయింట్ మీద సినీ ఇండస్ట్రీతో ప్రధాని బేటీ అయ్యారు.

    కదిలివచ్చిన బాలీవుడ్ తారాగణం..

    కదిలివచ్చిన బాలీవుడ్ తారాగణం..

    ఈ కార్యక్రమంలో షారుఖ్, ఆమిర్, జాక్వెలిన్, కంగనా, రాజ్ కుమార్ హిరాణి, సోనమ్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారు హాజరయ్యారు. ఇక వీరంతా ప్రధానితో కలిసి ముచ్చటించినట్టు తెలుస్తోంది. ప్రధానితో దిగిన సెల్ఫీలతో వీరంతా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

    ప్రధానితో సెల్ఫీ..

    ప్రధానితో సెల్ఫీ..

    ప్రధానితో జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో రకుల్ కూడా పాల్గోంది. ఈ మేరకు ప్రధానితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. సమాజాన్ని ప్రభావితం చేసే సినిమా మాధ్యమం గురించి ప్రధాని చర్చించారు.. జాతిని ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు మా అందరితో చర్చించారంటూ పోస్ట్ చేసింది.

    ప్రధానికి విన్నవించిన ఉపాసన..

    ప్రియమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, దక్షిణ భారతీయులమైన మేము.. మీ లాంటి వారు ప్రధానిగా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము.. ఇంకా ఎంతో గర్వంగా ఉంది. ఈ సమావేశంలో కేవలంలో హిందీ పరిశ్రమకు సంబంధించిన వారినే ఆహ్వానించారు.. దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.. నా బాధను మీరు సరైన రీతిలో అర్థం చేసుకుంటానని భావిస్తున్నాను.

    English summary
    Honoured to meet our honourable PM narendramodi ji and discuss the potential that film industry has to bring the change ..ChangeWithin it all starts from each one of us making an effort towards a better nation
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X